Jump to content

ఇలియాస్ బాబర్

వికీపీడియా నుండి
ఇలియాస్ బాబర్
జననం
మహమ్మద్ ఇలియాస్ బాబర్

1926 (1926)
మరణం2002 జూలై 30(2002-07-30) (వయసు 75–76)
పురస్కారాలుద్రోణాచార్య పురస్కారం (1994)

మహమ్మద్ ఇలియాస్ బాబర్ (1926 – 2022, జూలై 30) భారతీయ అథ్లెటిక్ కోచ్.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

బాబర్ కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించాడు. ఇతను హైదరాబాద్‌లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయ అథ్లెట్ అయ్యాడు. 1950 - 1957 మధ్యకాలంలో 110 మీటర్ల హర్డిల్స్‌లో, లాంగ్ జంప్‌లో రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో పట్టభద్రుడయ్యాడు.

ఇతను 1961లో పాటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుండి కోచింగ్‌లో డిప్లొమా పొందాడు. ఢిల్లీకి వెళ్లేముందు సికింద్రాబాద్‌లో కొంతకాలం కోచ్‌గా పనిచేశాడు. అక్కడ రాజ్‌పుతానా రైఫిల్స్‌లో చేరి 1999 వరకు పనిచేశాడు.

కెరీర్

[మార్చు]

ఇతని శిక్షణ పొందిన వారిలో జగ్మల్ సింగ్, బివి సత్యన్నారాయణ, బిఎప్ బరువా, శ్రీరామ్ సింగ్, తర్లోక్ సింగ్, చార్లెస్ బొరోమియో, బాగీచా సింగ్, హర్లాల్ సింగ్, రామ్ నారాయణ్ సింగ్, గీతా జుట్షి ఉన్నారు.[1] వారి మధ్య, వారు ఆసియా క్రీడలు, ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్‌లలో 17 బంగారు పతకాలు, మూడు పద్మశ్రీ, ఐదు అర్జున అవార్డులను గెలుచుకున్నారు. మాంట్రియల్ ఒలింపిక్స్‌లో శ్రీరామ్ సింగ్ 800 మీటర్ల పరుగులో ఏడో స్థానంలో నిలిచి 42 ఏళ్ల పాటు నిలిచిన భారత రికార్డును నెలకొల్పాడు. బాబర్ తన స్వంత ఖర్చుతో మాంట్రియల్ ఒలింపిక్స్‌కు వెళ్లాడు, తన స్కూటర్, వివిధ గృహోపకరణాలను విక్రయించి, మాంట్రియల్ చేరుకోవడానికి ఇతని స్నేహితుల నుండి అప్పు తీసుకున్నాడు.

బాబర్‌కు 1994లో ద్రోణాచార్య అవార్డు లభించింది. 1978 బ్యాంకాక్‌లో జరిగిన ఆసియన్ గేమ్స్‌లో అంతర్జాతీయ నిపుణుల బృందం ఇతనిని ఆసియాలో అత్యుత్తమ కోచ్‌గా ఎంపిక చేసి అడిడాస్ గోల్డెన్ షూను బహుకరించింది. ఇతను భారతదేశంలోని హైదరాబాద్‌లో కడుపులో పుండుకి శస్త్రచికిత్స చేయించుకున్న మూడు రోజుల తర్వాత 76 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]