Jump to content

ఇ. తుకారామ్

వికీపీడియా నుండి
ఇ. తుకారామ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2008 – 2024
ముందు సంతోష్ లాడ్
నియోజకవర్గం సండూర్

ఉన్నత విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
22 డిసెంబర్ 2018 – 8 జులై 2019
ముందు డీ.కే. శివ కుమార్
తరువాత సి.ఎన్. అశ్వత్ నారాయణ్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-07-26) 1967 జూలై 26 (వయసు 57)
యశ్వంత్‌నగర్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

ఇ. తుకారామ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు సండూర్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బళ్ళారి నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇ. తుకారామ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో సండూర్ ఎస్టీకి రిజర్వు కాగా మాజీ మంత్రి సంతోష్ ఎస్.లాడ్, అనిల్ హెచ్. లాడ్ సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థిపై 20719 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2008లో బళ్లారి జిల్లాలో భాజపా ప్రభావం, గాలి జనార్దన్ రెడ్డి హవా ఉండేది. అప్పట్లో జిల్లాలో మొత్తం బీజేపీ అభ్యర్థులే గెలవగా, సండూరులో కాంగ్రెస్ తరపున తుకారామ్ గెలిచి రికార్డ్ సృష్టించాడు.

ఇ. తుకారామ్ 2013లో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 34631 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హెచ్. డి. కుమారస్వామి మంత్రివర్గంలో 22 డిసెంబర్ 2018 నుండి 8 జులై 2019 వరకు వైద్యవిద్య శాఖ మంత్రిగా పని చేశాడు. ఇ. తుకారామ్ 2023లోసండూర్ నుండి బీజేపీ అభ్యర్థి శిల్పా పాటిల్ పై 35,522 ఓట్ల మెజారిటీతో వరుసగా నాలుగోవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  2. Eenadu (15 May 2023). "గనినాడుకు మంత్రి పదవి దక్కేనా?". Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.
  3. Eenadu (15 May 2023). "ఆ ముగ్గురు ఇంటికి.. ఆయన అసెంబ్లీకి". Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.