Jump to content

ఉట్నూర్ రామాలయం

అక్షాంశ రేఖాంశాలు: 19°24′N 78°19′E / 19.40°N 78.31°E / 19.40; 78.31
వికీపీడియా నుండి

ఉట్నూరు రామాలయం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలంలోని పాత ఉట్నూరులో ఉంది.అత్యంత ప్రాచిన మైన ఆలయం, 12. వ శతాబ్ద కాలం నాటిది.దేవగిరి యాదవ రాజులలో ఐదవ వంశస్థులు విఠలేశ్వరుని భక్తులు. వారి సామంత రాజులు కట్టించారు. దినినే విఠలే శ్వరాలయం అని కూడా అనేవారు[1] [2].

ఉట్నూరు రామాలయం
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఉట్నూరు
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఉట్నూరు
ఉట్నూరు రామాలయం is located in Telangana
ఉట్నూరు రామాలయం
ఉట్నూరు రామాలయం
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°24′N 78°19′E / 19.40°N 78.31°E / 19.40; 78.31
పేరు
ఇతర పేర్లు:విఠలేశ్వరాలయం
ప్రధాన పేరు :శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉట్నూరు ఆదిలాబాదు
దేవనాగరి :उटनुर राम मंदिर
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాదు జిల్లా
ప్రదేశం:ఉట్నూరు, పాత ఉట్నూరు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీరాముడు
ప్రధాన దేవత:సీత
ముఖ్య_ఉత్సవాలు:శ్రీరామనవమి,ఉగాది,దసరా
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షీణ భారత దేశ హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:03
ఇతిహాసం
నిర్మాణ తేదీ:క్రీ. శ.12వ శతాబ్దం
సృష్టికర్త:దేవగిరి యాదవులు

పూర్వపు చరిత్ర

[మార్చు]

ఉట్నూరు రామాలయాన్ని పూర్వం విఠలేశ్వరాలయం అని అనేవారు. గోండు రాజులకు పూర్వం ఈ ప్రాంతమును దేవగిరి యాదవ రాజులు దక్కనులో క్రి.శ, 9 వ.శతాబ్దం నుండి 13 వ.శతాబ్దం వరకు దేవగిరిని రాజధానిగా చేసుకోని పాలించిన యాదవ రాజులు దక్కను ప్రాంతంలో విశాల సామ్రాజ్యమును నిర్మించి ఉత్తర భారతములోని కొన్ని భాగములను జయించి పాలించినారు. ఈ వంశీయుల పాలన ఉమ్మడి ఆదిలాబాదు,జిల్లా 12వ.శతాబ్ది కాలంలో స్థిరపడినది. జిల్లాలో ఆదిలాబాదు,బోథ్,ఉట్నూరు, కిన్వట్, రాజురా తాలుకలు వీరి రాజ్యంతర్భాగంలో ఉండెను.దేవగిరి రాజుల సామంతులు ఈ ప్రాంతంలో పరిపాలించు చుండిరి.యాదవ రాజులలో ఐదవ వంశజులు విఠలే శ్వరుని భక్తులు వారి సామంతులు ఈ ఉట్నూరు లోని విఠలేశ్వరాలయమును నిర్మించారని చరిత్ర ఆధారం వలన తెలుస్తుంది.

ఆలయ చరిత్ర

[మార్చు]

12వ శతాబ్దం నాటి ఈ ఆలయం దేవగిరి యాదవ రాజుల కాలానికి చేదింది.ఈ రామాలయ నిర్మాణం దక్షిణ భారత హిందూ వాస్తుశిల్పి ప్రకారం నిర్మించబడినది. విశాల ప్రదేశం ఉన్న ఆలయం పురాతన రాతి కట్టడాలతో నిర్మితమైంది. దేవాలయం గర్భగుడిలో రామలక్ష్మణుడు, సీత దేవి, అంజనేయస్వామి విగ్రహాలున్నాయి.ఆలయానికి మహోన్నతమైన శిఖరం ఉంది.ఆలయం ముందు మండపము, కోనేరు,ఇరువై ఒక ఫిట్ల ఎత్తులో ఆలయ ముఖ ద్వారం ఉంది. పూర్వకాలంలో బావి నీటిని స్వామి అభిషేకానికి వాడేవారు.ప్రస్తుతం బోరింగ్ ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు కోనేటి నీళ్ళతో కాళ్ళుచేతులను శుభ్రం చేసి ఆలయ ముఖ ద్వారం గుండా ఆలయంలో ప్రవేసించేవారు.ఆలయ గోపురము చూపరులను ఆకర్షిస్తుంది.ఆలయ అభిముఖంగా చక్కని నీళ్ళతో నిండిన కోనేరు ఉన్న అది శిధిల దశకు చేరుకోవడంతో చుట్టు ప్రక్కల ఫెన్సింగ్ వేసి ఎవ్వరు వేళ్ళ కుండా చేశారు.రామాలయం కుడి ప్రక్కన అతి పురాతన శివాలయం ఉంది.ఈ శివాలయం గర్భగుడిలో పరమ శివుడు మాతా పార్వతి దేవిల విగ్రాహాలున్నాయి. ఎడమ ప్రక్కన శివరామ,గురుదత్త, సాయిక్రిష్ణ మందిరం ఉంది. ఈ ఆలయంలో శివరామ గురుదత్త సాయి క్రిష్ణ విగ్రహాలను 1994 సంవత్సరంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట చేశారు. పురాతన ఆలయం శిథిల దశకు చేరడంతో శ్రీసీతారామాలయం పునః నిర్మాణము కోసం ఆలయ కమిటీ ప్రయత్నంలో భాగంగా 1993సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆలయ మరమత్తుల కోరకు నిధులు విడుదల చేయడంతో ఆలయానికి కొత్త శోభను సంతరించుకుంది.

విశేషం

[మార్చు]
ఉట్నూరు సాయిబాబా ఆలయంలో పూజలు చేస్తున్న పుజారి సంతోష్ దూబే

విశాలమైన ప్రదేశంలో రామాలయం కుడి ప్రక్కన శివాలయం[3],ఎడమ ప్రక్కన శివరామ, గురుదత్త సాయిక్రిష్ణ దేవాలయం, ఆంజనేయస్వామి ఆలయం అన్ని ఒకే చోట ఉండం విశేషం

సీతారాముల కల్యాణం

[మార్చు]

ఆలయంలో ప్రతి ఏటా వసంత ఋతువులో చైత్రశుద్ద నవమి నాడు శ్రీరాముని జన్మదినాన్ని పురష్కరించుకుని ఆలయంలో శ్రీరామనవమి వేడుకను ఆలయ అర్చకులు సంతోష్ దూబె అధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉట్నూరు డివిజన్ లోని ఉట్నూరు, ఇంద్రవెల్లి నార్నూర్ ,గాదిగూడ, కుంరంభీం ఆసిఫాబాదు జిల్లా జైనూర్, సిర్పూర్ యు లింగాపూర్ మండలం నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని చేరుకుని స్వామి వారి కల్యాణ్యాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తారు.భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.ఉదయం 10 గం, నుండి సాయింత్రం 3 గం, వరకు కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తుల కోసం ఆలయ కమిటీ, హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో టెంట్లు, చల్లటి నిళ్ళ క్యాన్లు మజ్జిగ,అంబలి ,అందుబాటులో ఉంచుతారు. మధ్యాహ్నం సమయంలో ఉట్నూరు వ్యాపారస్థుల ఆధ్యర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ఉంటుంది.మరునాడు ఆలయ అర్చకులు వారి ఆధ్యర్యంలో ఉట్నూర్ పట్టణంలో స్వామి వారి ఉరేగింపు ను కూడా నిర్వహిస్తారు.

ఉత్సవాలు

[మార్చు]

•మహాశివరాత్రి

ఉట్నూరు శివాలయంలోని దృశ్యం

శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో శివపార్వతుల కల్యాణం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఉట్నూర్ పట్టణంతో పాటు పరిసరా గ్రామాల నుండి స్వామి దర్శనం కోసం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోని పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ శైవాలం భక్తులతో కిటకిటలాడుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు[4].

•ఉగాది

తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండుగను పురష్కరించుకోని ఆలయంలోని దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు అభిషేకం,పుష్పార్చనా,హోమం, బాల భోగం ,మహానైవేధ్యం నిర్వహిస్తారు.ఉగాది పంచాంగం, ఉగాది పచ్చడి చేసి పంపిణి చేస్తారు.

•దసరా

విజయదశమి పండుగ సందర్భంగా ప్రతి ఏటా ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు భక్తిశ్రద్ధతో నిర్వహిస్తారు. స్వామి వారికి అభిషేకం,హోమం, పుష్పార్చన, బాల భోగం ,మహానైవేద్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్రమైన దసరా రోజున చేడు పై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాజా భజంత్రీలతో భక్తులు ఉరేగింపుగా వెళ్ళి లంకాధిపతి రావణుడి దిష్టి బోమ్మలను దహనం చేస్తారు.

ఎలా చేరుకోవచ్చు

[మార్చు]

ఈ ఆలయాన్ని ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాదు జిల్లాల నుండి వచ్చే భక్తులు ఉట్నూర్ మండల కేంద్రానికి చేరుకోవాలి, అచ్చట నుండి కిలో మీటర్లు దూరంలో రామాలయం ఉంది. ప్రయివేటు వాహనంలోగాని అటోలో గాని కుర్చోని చేరుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. Sanagala, Naveen (2007-01-08). "Sri Shiva Temple, C/o. Sri Ramalayam, Utnoor Town". HinduPad (in ఇంగ్లీష్). Retrieved 2024-07-28.
  2. "చారిత్రక కట్టడం..తీర్చి దిద్దితే పూర్వ వైభవం". EENADU. Retrieved 2024-07-28.
  3. "Ramalayam Shivalayam - Opening Hours, Reviews & Photos [2024]". TRIP.COM (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-30.
  4. "Adilabad District Temples of Lord Shiva of Telengana - అదిలాబాద్ శివ గుడి". shaivam.org. Retrieved 2024-07-30.