Jump to content

ఎం. గిరిజా ప్రియదర్శిని

వికీపీడియా నుండి
ఎంజీ ప్రియదర్శిని

తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008

వ్యక్తిగత వివరాలు

జననం 1970
విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు మాటూరి అప్పారావు, నాగరత్నమ్మ
జీవిత భాగస్వామి విజయ్ కుమార్

మాటూరి గిరిజ ప్రియదర్శిని భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఎం. గిరిజా ప్రియదర్శిని 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం పట్టణంలో అప్పారావు, నాగరత్నమ్మ దంపతులకు జన్మించింది. ఆమె విశాఖపట్నంలోని ఎన్‌బీఎం లా కాలేజీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1995లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది.[3]

వృత్తి జీవితం

[మార్చు]

ఎం. గిరిజా ప్రియదర్శిని ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక విశాఖపట్నం జిల్లా కోర్టులో ఏడేళ్లు ప్రాక్టీస్‌ చేసి 2008లో జిల్లా జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణులై గుంటూరు అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె తరువాత ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా, 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్‌గా పదోన్నతి అందుకొని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తుంది. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[2][4]సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2 February 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. 2.0 2.1 TV9 Telugu (2 February 2022). "తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (24 March 2022). "తపించారు.. సాధించారు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  4. Andhra Jyothy (3 February 2022). "హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  5. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.