ఎద్దుల బండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎద్దుల బండి
టైరులతో గల ఎద్దుల బండి
చెక్క చక్రాల ఎడ్లబండి
ఎడ్లబండి
పొలంలో వున్న ఎద్దులబండి
పాడైన ఎద్దులబండి
రొడ్దుపైన వున్న ఎద్దులబండి

మనుష్యులను కాని వస్తువులను కాని ఒక చోటి నుండి మరొక చోటికి చేరవేయడానికి పల్లెల్లో ఉపయోగించే ఎద్దులు లాగే వాహనం. భారతీయ రైతుల దైనందిన జీవితంలో ప్రధాన భాగమైన ఈ వాహనాన్ని ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఇంటి నుంచి పొలాలకు సరుకులను మోయడం వంటి అవసరాలకు విరివిగా వాడుతున్నారు. పారిశ్రామికీకరణ మూలంగా వీటి స్థానాన్ని నెమ్మదిగా ట్రాక్టర్లు ఆక్రమిస్తున్నాయి.

రకాలు

[మార్చు]

ఒక ఎద్దుతో లాగే బండిని ఒంటెద్దు బండి అని రెండు ఎద్దులతో లాగే బండిని జోడెడ్ల బండి అని అంటారు.

ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న చాలా ఎడ్లబండ్లకు రబ్బరు టైర్లను వాడుతున్నారు. పాత జీపు టైర్ చక్రాలను వాదుతున్నారు. దైనివలన ఏద్దులకు లాగడానికి సులబంగా ఉంటుంది.దీనికి మునుపు చెక్కతో చేసిన చక్రాలను వాడేవారు. ఈ బండ్లను లాగడం ఎడ్లకు కష్టంతో కూడుకున్న పనిగా ఉండేది. ఇంకా అభివృద్ధి చెందని మూరుమూల గ్రామాల్లో సరుకులను పట్టణాలకు చేరవేయడానికి ఇంకా ఇలాంటి బండ్లను వాడుతుండడాన్ని గమనించవచ్చు. ఈ విధంగా సరుకులను తీసుకుపోయే బండి ని "చెకడ" అని కూడా అంటారు.

బండి ఉండే ఆకారాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు:

  • గూడు బండి (ఇప్పటికి కృష్ణా జిల్లాలో ఉండే రిక్షాలను గూడు రిక్షాలని అంటారు)
  • పెట్టె బండి
  • చాప బండి (చాపలతో పైన మూస్తారు కాబట్టి ఆ పేరు)
  • విల్లు బండి (స్ప్రింగ్ మీద ఉండే బండీ, ఈ స్ప్రింగ్ విల్లు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు)

గతంలొ ఈబండ్లను మనుషుల రవాణాకు కూడ వాడేవారు.

ఎడ్ల బండి భాగాలు

[మార్చు]

ముందు భాగం

[మార్చు]
  • కాడె లేక కాడి : ఎద్దుల మెడ మీద వేసే దుంగ(దుంగలతో చేస్తారు)
  • మోకు : ( పలుపు) ఎద్దులను కాడెకు కట్టే మెడతాడు
  • తొట్టె:
  • తొట్టి గడలు (నగలు): తొట్టి గడలనుంచి తొట్టెను తాడుతో అల్లుతారు.
  • పీట (తొట్టెలో ఉంటుంది)
  • షిపాయి ( ఎడ్లబండి ఆపినప్పుడు ముందు భాగంలో ఎద్దులకు బరువు కాకుండా ఏర్పాటు చేసేది)

వెనక భాగం

[మార్చు]
  • డొలుపు (ఇరుసును డొలుపు నుంచి దూరుస్తారు)
  • పరం (డొలుపు మీద పరం బిగిస్తారు, రెండు పెద్ద బద్దలు, కొన్ని అడ్డ బద్దలు ఉండి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది.)
  • గుసి గొయ్యలు: పరం మీద నిలువుగా నాటే కొయ్యలు

చక్రాలు

[మార్చు]
  • చక్రాలు : ఒకటి కాని రెండు గాని ఉంటాయి.వీటిని బండి కల్లు అని కూడా అంటారు.
    • చెక్క చక్రాలు: ఈ చక్రాల చుట్టూ ఒక ఇనుప పట్టీని బిగిస్తారు. దీనివలన చక్క చక్రాలు అరిగిపోకుండా వుంటాయి. ఈ పట్టీలను నేమి అని కూడా అంటారు
  • పూటీలు లేదా వంపులు: ఒక్కోక్క చక్రాన్ని చెయ్యడానికి వృత్తాన్ని 6-7 భాగాలుగా చెక్కతో చేస్తారు, ఈ పూటిలన్నిటిని కలిపి ఒక వృత్తం చేస్తారు.
  • కుండలు లేదా కన్నులు (చక్రం మధ్య భాగంలో ఉంటుంది)
  • ఆకులు (కుండలని పూటిలను కలిపే బద్దలు)
  • కుండ మధ్యభాగంలో రంధ్రం ఉంటుంది. దీనిలో ఇనుపగొట్టం వంటిందానిని బిగువుగా బిగిస్తారు. బండి ఇరుసు ఈ రంధ్రంలో ఉండేలా బిగిస్తారు. అలా ఇరుసు ఆధారంగా కుండ, దానితోపాటు చక్రం మొత్తం తిరుగుతుంది.
  • ఇరుసు. ఇది ఇనుముతో చేసినది
  • కందెన: చక్రాలలో పోసే ఆముదం (ఇరుసున కందెన పెట్టక పరమేసుని బండి యైన పారదు సుమతి)
  • తార: ఆముదం పూసిన తాడు, ఇరుసు మీద పేనుతారు, కొన్ని రోజులకొకసారి కొత్త తార వేసుకుంటారు.
  • చాయమేకు : ఇరుసునుండి చక్రాలు బయటకు రాకుండా పెట్టే పెద్ద మేకు.
  • చాయ బిళ్లలు:
  • బొడ్డు సీల
  • చిలుక చీల
  • జంజడ
  • మొల

[1]

తయారు చేసే విధానం

[మార్చు]

ఎద్దుల బండికి వున్న ప్రధాన భాగాలు:

రెండు చక్రాలు
ప్రతి చక్రానికి ఆరు వంపులు, ఎనిమిది ఆకులు, ఒక కుండ,ఒక ఇనుప పట్టి, కడిసెల,
ఒక నొగ, దానికి ముందు బాగాన మ్ముక్కిన,
రెండు పారు పట్టీలు, వాటికున్న రంద్రాలలో పెట్టే కూసులు.
దిమ్మ, (ఇది కొయ్యతొ చేసినది) దానికి మధ్యలో ఇరుసుకు అను సందానం చేసె బొడ్డు సీల,
ఇరుసు. ఇది ఇనుముతో చేసినది. దీనికి రెండు చివరలన చిన్న రంద్రాలుంటాయి. వాటిలొ కడిసీల పెడ్తారు.

మధ్యలో వున్నరంధ్రంలో దిమ్మకు అనుసందానం చేసి పెట్టే బొడ్డు సీలను పెడతారు. తయారు చేసె విధానం

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో

[మార్చు]

ఆస్ట్రేలియా లో వలసవాదుల రాజ్యమేలుతున్నపుడు ఎద్దుల బండ్లే ప్రధాన రవాణా సాధనాలుగా ఉండేవి. [2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.eemaata.com/em/issues/200806/1290.html Archived 2009-02-11 at the Wayback Machine?
  2. The Grolier Society. The Australian Encyclopaedia. Halstead Press, Sydney.