ఎమ్వీయల్. నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏంమ్వీయల్(మద్దాలి వెంకట లక్శ్మీనరసింహారావు ) వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
ఎమ్వీయల్. నరసింహారావు

ఎమ్వీయల్. నరసింహారావు (1944 - 1986) సుప్రసిద్ధ సాహితీవేత్త, సినిమా నిర్మాత. ఈయన పూర్తిపేరు మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు. ఈయన సెప్టెంబరు 21, 1944 సంవత్సరంలో గూడూరులో జన్మించాడు. బందరులో డిగ్రీ చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పూర్తిచేశాడు. నూజివీడు లోని ధర్మ అప్పారాయ కళాశాల తెలుగు శాఖలో అధ్యాపకుడుగా చేరి చివరివరకు పనిచేశాడు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రశ్న జవాబుల శీర్షిక చాలా కాలం విజయవంతంగా నిర్వహించాడు. 'తాగుడుమూతలు' శీర్షిక కూడా వీరిదే. 1974లో బాపూ రమణల పరిచయంతో సినిమా రంగంలో ప్రవేశించి, ముత్యాల ముగ్గు సినిమా నిర్మించాడు. ఇది బాగా విజయవంతం కావడంతో, గోరంత దీపం, స్నేహం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్ళే రైలు, ఓ ఇంటి భాగోతం సినిమాలకు సంభాషణలు వ్రాశాడు.