ఎమ్. ఆర్. శ్రీనివాసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మలూర్ రామసామి శ్రీనివాసన్
జననం (1930-01-05) 1930 జనవరి 5 (వయసు 94)
బెంగళూరు, బ్రిటిష్ ఇండియా
ప్రస్తుతం భారతదేశం
పౌరసత్వంభారతదేశం
జాతీయతభారతీయుడు
రంగములుమెకానికల్ ఇంజనీరింగ్
వృత్తిసంస్థలుఅటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ , ప్లానింగ్ కమిషన్
చదువుకున్న సంస్థలుయూనివర్శిటీ విశ్వేశ్వరాయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
మెక్‌గిల్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిభారతదేశం అణు కార్యక్రమం
గ్యాస్ టర్బైన్
ముఖ్యమైన పురస్కారాలుపద్మవిభూషణ్ (2015)
పద్మ శ్రీ (1984)

ఎమ్. ఆర్. శ్రీనివాసన్ (జననం: జనవరి 5, 1930) ఈయన అణు శాస్త్రవేత్త, మెకానికల్ ఇంజనీర్.[1] ఈయన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మ పురస్కారాల గ్రహీత.[2]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1930, జనవరి 5 న ఆనాటి బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం బెంగళూరులో జన్మించాడు. ఈయన ఎనిమిది మంది తోబుట్టువులలో మూడవ సంతానంగా జన్మించాడు. ఈయన మైసురులోని సైన్స్ స్ట్రీమ్‌ కాలేజీలో తన ప్రాథమిక విద్యను, తన ఇంటర్మీడియట్ విద్యను సంస్కృతం, ఇంగ్లీషును ప్రథమ భాషగా ఎంచుకొని తన విద్యను పూర్తిచేసాడు. ఈయనకు భౌతికశాస్త్రం మీద మక్కువతో 1950 లో సర్.ఎం.విశ్వేశ్వరాయ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తిచేసాడు. ఈయన 1952 లో తన మాస్టర్స్ విద్యను పూర్తి చేశాడు. 1954 లో కెనడాలోని మాంట్రియల్‌లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం నుంచి గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని పూర్తిచేసాడు.[3]

కెరీర్

[మార్చు]

ఈయన 1955 సెప్టెంబరులో అణు ఇంధన విభాగంలో భారతదేశపు మొదటి అణు పరిశోధన రియాక్టర్ అప్సర, నిర్మాణంపై డాక్టర్ హోమి భాభాతో కలిసి పనిచేశాడు. ఈయన 1959లో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ప్రిన్సిపాల్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. 1967లో మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్‌లో చీఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా నియనితులయ్యారు. 1987లో ఈయన అణుశక్తి కమిషన్ చైర్మన్, అటామిక్ ఎనర్జీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వహించాడు. 1987 లో స్థాపించబడిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యవస్థాపక-ఛైర్మన్‌గా ఉన్నారు. ఇందులో మొత్తం 18 అణు విద్యుత్ యూనిట్లకు ఆయన బాధ్యత వహించారు.

పదవులు

[మార్చు]

ఈయన 1990 నుండి 1992 వరకు వియన్నా లోని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో సీనియర్ సలహాదారుగా పనిచేసాడు. ఈయన 1996 నుండి 1998 వరకు భారత ప్రభుత్వ ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేశాడు. ఈయన 2002 నుండి 2004 వరకు, 2006 నుండి 2008 వరకు భారత జాతీయ భద్రతా సలహా మండలిలో బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. 2002 నుండి 2004 వరకు కర్ణాటక ఉన్నత విద్యపై వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలలో ఈయన కూడా ఉన్నారు. ఈయన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేటర్స్ (WANO) వ్యవస్థాపక సభ్యుడు. ఈయన ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా), ఇండియన్ న్యూక్లియర్ సొసైటీకి ఫెలో సభ్యుడిగా ఉన్నాడు. [4]

పురస్కారాలు

[మార్చు]
  • 2015లో పద్మ విభూషణ్ పురస్కారం
  • 1990లో పద్మ భూషణ్ పురస్కారం
  • 1984లో పద్మశ్రీ పురస్కారం
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ యొక్క డైమండ్ జూబ్లీ పురస్కారం.
  • ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) ఉత్తమ డిజైనర్ పురస్కారం.
  • సైన్స్ & టెక్నాలజీకి సంజయ్ గాంధీ పురస్కారం
  • సైన్స్ & టెక్నాలజీకి ఓం ప్రకాష్ భాసిన్ పురస్కారం
  • ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుంచి హోమి భాభా బంగారు పతకం
  • ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ యొక్క హోమి భాభా లైఫ్ టైమ్ పురస్కారం.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈయన శ్రీమతి గీతా శ్రీనివాసన్ వివాహం చేసుకున్నాడు. ఈమె ప్రకృతి పరిరక్షణాధికారి, వన్యప్రాణి కార్యకర్త, నీలగిరి వన్యప్రాణి & ఎన్విరాన్మెంట్ అసోసియేషన్ అధ్యక్షురాలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరి పిల్లలు రఘువిర్ శ్రీనివాసన్ ప్రస్తుతం ఫిన్లాండ్ లోని హెల్సింకిలో నివసిస్తున్నాడు. శారదా శ్రీనివాసన్ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈయన భారతదేశంలో అణు విద్యుత్ కార్యక్రమం, పిహెచ్‌డబ్ల్యుఆర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు.

మూలాలు

[మార్చు]
  1. Profile Archived 2016-03-03 at the Wayback Machine, asset.org.in; accessed 17 November 2019.
  2. "Advani, Amitabh Bachchan, Dilip Kumar get Padma Vibhushan". Bharti Jain. The Times of India. 25 January 2015. Retrieved 17 November 2019.
  3. "Life Time Contribution Award In Engineering Fact sheet" (PDF). Association of Separation Scientists and Technologists. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 17 November 2019.
  4. "Nuclear Experts, Nuclear Power Experts in India, Ask the Experts". Archived from the original on 2013-03-07. Retrieved 2019-11-17.