ఎస్.ఏ.ఎబెనెజర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుబ్బయ్య అల్లరి ఎబెనెజర్

పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం వికారాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం 13 నవంబరు 1899
నెల్లూరు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేస్
జీవిత భాగస్వామి డాక్టర్ ఏ.ఆర్.ఎం.ఎబెనెజర్
సంతానం ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు
మతం కాథలిక్ కైస్తవమతం

డాక్టర్ సుబ్బయ్య అల్లరి ఎబెనెజర్ (1899, నవంబరు 1319??) భారతీయ రాజకీయనాయకుడు. ఈయన 1952 నుండి 1957 వరకు, తొలి లోక్‌సభలో వికారాబాదు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.

ఎబెనెజర్, దక్షిణ భారతదేశంలో ప్రముఖ కైస్తవ మతప్రచారకుడైన రెవరెండ్ అల్లరి సుబ్బయ్య కుమారుడు.[1] 1899, నవంబరు 12న నెల్లూరులో జన్మించాడు. ఈయన పాఠశాల విద్యాభ్యాసం నెల్లూరులోని కోల్స్ స్మారక ఉన్నత పాఠశాలలో సాగింది. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై, మహారాష్ట్రలోని మిరజ్ వైద్యకళాశాలలో చేరి, 1929లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎం.పి & ఎల్.సి.పి.ఎస్ డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. ఈయన డాక్టర్ ఏ.ఆర్.ఎం.ఎబెనెజర్ ను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే, ఎబెనెజర్ విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 1928లో మిరజ్‌లో క్రైస్తవ విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1929లో మహాత్మాగాంధీ యొక్క సబర్మతీ ఆశ్రమ పర్యటనకు, మద్రాసులో జరిగిన ప్రపంచ విద్యార్థుల క్రైస్తవ సమాఖ్యకు వెళ్ళిన విద్యార్థి బృందాలకు నాయకత్వం వహించాడు.[2]

వైద్యుడుగా వృత్తి ప్రారంభించి, స్వతంత్ర డాక్టరుగా హైదరాబాదులో ప్రాక్టీసు ప్రారంభించాడు. వ్యాధి నివారణ, ఆంటీబాయాటిక్స్ తో రోగచికిత్సపై ఈయన ఆసక్తి కనబరచాడు. 1929 నుండి 1930వరకు హనుమకొండలోని మిషన్ ఆసుపత్రికి బాధ్యత వహించాడు. ఆ తర్వాత స్వతంత్ర వైద్యునిగా, 1931లో గంజాం జిల్లాలోని బారువాలో, 1932లో విజయనగరంలో, 1933లో శ్రీకాకుళంలో, 1934 నుండి 1942 వరకు జాల్నా మిషన్ ఆసుపత్రిలో పనిచేశాడు.

క్రియాశీల కాంగ్రేసు కార్యకర్తగా, ఈయన కాంగ్రేసు యొక్క నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 1952లో కార్యకర్తల, వార్డు కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రేసు కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. అంతేకాక ఇండియన్ కౌన్ సిల్ ఆఫ్ మెడికల్ రీసర్ఛ్ యొక్క పాలనా సంఘానికి లోక్‌సభ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. D., Downie (June 12, 1919). "Rev A. Subbaiah of Nellore". The Journal and Messenger: The Central National Baptist Paper. 88: 9. Retrieved 11 December 2017.
  2. "First Lok Sabha - Member Profile". Retrieved 10 December 2017.