అక్కినేని సంజీవి

వికీపీడియా నుండి
(ఏ.సంజీవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అక్కినేని సంజీవి
అక్కినేని సంజీవి
జననం
అక్కినేని సంజీవరావు

వృత్తిసినిమా దర్శకుడు, సినిమా ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1961-1994
గుర్తించదగిన సేవలు
అత్తగారు కొత్తకోడలు
నాటకాల రాయుడు
అక్కా చెల్లెలు
పిల్లలుశ్రీకర్ ప్రసాద్
తల్లిదండ్రులుఅక్కినేని శ్రీరాములు,
బసవమ్మ
బంధువులుఎల్.వి. ప్రసాద్

అక్కినేని సంజీవి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు.

జననం

[మార్చు]

అక్కినేని సంజీవరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంనందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు జన్మించాడు.వీరి కుమారుడే జాతీయ పురస్కారాల్ని పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్.వి. ప్రసాద్ గారు వీరికి స్వయాన అన్నగారే.

సినిమా రంగం

[మార్చు]

అక్కినేని సంజీవి అక్కాచెల్లెలు, ధర్మదాత, అత్తగారు కొత్తకోడలు, నాటకాలరాయుడు, మల్లమ్మ కథ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అంతకుముందు ఎడిటింగ్ శాఖలో నిష్ణాతుడు. విదేశీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే చిత్రాలకు మన తెలుగు చిత్రాల నిడివి ఎక్కువైనపుడు వాటిని అర్థవంతంగా కుదించి పంపించిన ఘనత సంజీవి గారిది. అంతేకాదు. అప్పట్లో మనకు కొత్తైన సబ్ టైట్లింగ్ ప్రక్రియను సరైన పరికరాలు లేకుండా మామూలు లాబరేటరీలో అత్యంత ప్రతిభావంతంగా రూపొందించి చిత్రోత్సవాలకు పంపించారు. ఆ తర్వాత చాలా కాలానికి గానీ సబ్ టైట్లింగ్ పరికరం మన దేశానికి రాలేదు. సంజీవి గారు అలా నిడివి కుదించి సబ్ టైట్లింగ్ చేసిన చిత్రాల్లో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందుకు, సాక్షి లాంటి చిత్రాలు వున్నాయి.

చిత్ర సమాహారం

[మార్చు]

ఎడిటర్

[మార్చు]
  • తయిళ్ళ పిళ్ళై (తమిళం, 1961) (ఎడిటర్)
  • భార్యాభర్తలు (తెలుగు, 1961) (ఎడిటర్) [1]
  • ఇరువార్ ఉల్లం (తమిళం, 1963) (ఎడిటర్)
  • బంగారు గాజులు (తెలుగు, 1968) (ఎడిటర్)
  • దత్తపుత్రుడు (1972) (ఎడిటర్)
  • సతీ అనసూయ (ఒరియా, 1978) (ఎడిటర్)
  • అష్టరాగ (ఒరియా, 1982) (ఎడిటర్)
  • ము తుమే ఓ సే (ఒరియా, 1982) (ఎడిటర్)
  • ఎస్.పి.భయంకర్ (తెలుగు, 1983) (ఎడిటర్)
  • చక భౌరి (ఒరియా, 1985) (ఎడిటర్)
  • మేరా ఘర్ మేరే బచ్చే (హిందీ, 1985) (ఎడిటర్)
  • సహరి బఘా (ఒరియా, 1985) (ఎడిటర్)
  • కెప్టెన్ నాగార్జున (తెలుగు, 1986) (ఎడిటర్)
  • స్వాతి (హిందీ, 1986) (ఎడిటర్)
  • తుండ బైడ (ఒరియా, 1987) (ఎడిటర్)
  • జీతే హై షాన్ సే (హిందీ, 1988) (ఎడిటర్)
  • ఖత్రోంకి ఖిలాడీ (హిందీ, 1988) (ఎడిటర్)
  • సాగర్ గంగ (ఒరియా, 1994) (ఎడిటర్)

దర్శకత్వం

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. భార్యాభర్తలు, తెలుగు సినిమా నవల, హాసం ప్రచురణలు.