ఒగ్గు రవి
ఒగ్గు రవి | |||
| |||
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR ) రీజినల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 15 జూన్ 2021 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 24 సెప్టెంబర్ 1984 మాణిక్యపురం , లింగాల ఘనపూర్ మండలం , జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
తల్లిదండ్రులు | బుగ్గయ్య | ||
బంధువులు | చుక్కా సత్తయ్య (తాత) |
చౌదరపల్లి రవి కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒగ్గు కళాకారుడు. ఆయన ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR ) రీజినల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఒగ్గు రవి 2017లో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం అందుకున్నాడు.[1]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]ఒగ్గు రవి 1984, సెప్టెంబరు 24న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, లింగాల ఘనపూర్ మండలంలోని మాణిక్యపురం గ్రామంలో జన్మించాడు. ఆయన హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసి, థియేటర్ ఆర్ట్స్‌లో ఎంఫిల్, పీహెచ్‌డీ చేశాడు.[2] [3]
కళా జీవితం
[మార్చు]ఒగ్గు రవి తన తాత చుక్కా సత్తయ్య స్ఫూర్తితో ఒగ్గు కథ కళాకారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన 1997లో ఖమ్మంలోని చిన్న గోపతి గ్రామంలో జరిగిన ఒగ్గుకథ ప్రదర్శన ద్వారా తొలిసారి డోలు వాయించి ప్రదర్శన ఇచ్చి, అలా తన తాత వెంట ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, మైసూర్, హర్యానాలో ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. రవి 2012లో తిరుపతిలో జరిగిన నాల్గవ తెలుగు మహాసభల్లో తొలిసారి తన బృందంతో కలిసి ఒగ్గుకథను ప్రదర్శించాడు.
ఒగ్గు రవి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గోల్కొండ కోటపై స్వరాష్ట్రంలో జరిగిన తొలి స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరపున కోటపై పిరమిడ్ ప్రదర్శన ఇచ్చి మంచి గుర్తింపు పొందాడు. ఆయన తరువాత రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు.
ఒగ్గు కళా ప్రదర్శనలు
[మార్చు]ఒగ్గు రవి 2014లో స్వంతగా ఒక బృందంగా ఏర్పాటుచేసి 'రజాకార్', 'ధర్మాగ్రహం' ఎల్లమ్మకథ, బలి, ఇంకెన్నాళ్లు, పంతులు పద్మము ఓ భగవంతుడు వంటి పలు ప్రదర్శనలు ఇచ్చాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమండ్రిలో 2014లో నంది నాటక పరిషత్తులో 'రజాకార్' ప్రదర్శనకు గాను నంది అవార్డు అందుకున్నాడు.[4] రవి 2020లో కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ రూపొందించిన ఒగ్గుకథకు ప్రశంసలను అందుకున్నాడు.[5][6]
పురస్కారాలు
[మార్చు]- నంది నాటక పరిషత్తు పురస్కారం - 2014
- ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం - 2017
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పురస్కారం - 2018
- సింగిడి యువ పురస్కారం - 2018
- ప్రైడ్ అఫ్ తెలంగాణ అవార్డు - 2019
- ఇండియన్ ఫోక్ ఆర్ట్ ఫెడరేషన్ వారి ఫోక్ ఆర్ట్ మాస్టర్ అవార్డు - 2019
- హెచ్.ఆర్.డి ఫెలోషిప్ అవార్డు (కేంద్ర సాంస్కృతిక శాఖ) - 2019
- ఎంఫిల్ గోల్డ్ మెడల్ - పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ
- యూ.ఆర్.ఎఫ్ అవార్డు - పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ
చిత్రమాలిక
[మార్చు]-
2018లో జరిగిన ఉగాది వేడుకల్లో ఒగ్గు రవి బృందం
-
2018లో సింగిడి యువ పురస్కారం అందుకున్న ఒగ్గు రవి
-
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో మామిడి హరికృష్ణ నుండి ఒగ్గు రవికి సత్కారం
-
2015, ఆగస్టు 15న హైదరాబాదులోని గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శనలో జాతీయ జెండాతో ఒగ్గు రవి
మూలాలు
[మార్చు]- ↑ Indiablooms (27 November 2017). "Assam Governor presents Ustad Bismillah Khan Yuva Puraskar" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ Namasthe Telangana (7 June 2017). "ఒగ్గుకథ ఉస్తాద్!" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ Madras Courier (23 February 2017). "Oggudolu: Keeping Folklore Alive in Modern India | Madras Courier". Archived from the original on 25 July 2020. Retrieved 18 July 2021.
- ↑ Deccan Chronicle (10 April 2019). "Keeping traditional folk art alive" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ The Times of India (1 April 2020). "A folk number by Oggu Ravi and his team creating awareness amid COVID-19 lockdown - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ ETV Bharat News (3 April 2020). "ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.