ఓదూరు
ఓదూరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలం లోని గ్రామం..
ఓదూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°51′N 82°01′E / 16.85°N 82.02°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | రామచంద్రపురం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,281 |
- పురుషులు | 1,123 |
- స్త్రీలు | 1,158 |
- గృహాల సంఖ్య | 632 |
పిన్ కోడ్ | 533255 |
ఎస్.టి.డి కోడ్ |
ఇది సుందర ప్రకృతికి ఆలవాలమైన గ్రామం.
గ్రామ విశేషాలు[మార్చు]
ఓదూరుకి మరో పేరు ఓంకారపురం, వ్యాస మహర్శి తన అపరాదం వలన కాశీక్షేత్రంను విడిచి పెట్టి తన శిష్యులతో కలసి భీమేశ్వరునికన్న ఉత్తమమైన దేవుడు, ద్రాక్షారామము కన్న మిన్నయైన పుణ్యక్షేత్రములేవని తలిచి, ఆ దివ్య దర్శనముకై బయలుదేరి మొదటి పూరి జగన్నాధాలయంను దర్శించి,శ్రీకూర్మము, సింహచలము, పిఠాపురం, సామర్లకోట క్షేత్రం, సర్పవరము క్షేత్రములు దర్శించిన తరువాత తుల్యభాగ నదీతీరాన గల సాంపరాయణపురం (సంపర) గ్రామంను దర్శించి దక్షవాటికకు బయలుదేరగా, అగస్థ్యుడు తన భార్యతో పముద్రి సమేతంగా ద్రాక్షారామమును దర్శించి పీఠికాపురమునకు వెళ్ళుచున్న సమయంలో ఓంకారపురం క్షేత్రం ఓదూరు నందు వ్యాసులవారు, అగస్తుడు కలుసుకొని కుశల ప్రశ్నలు వేసుకుని ఓంకారపురం క్షేత్రం నందు వున్న బ్రహ్మ్హ, విష్ణు, మహేశ్వరులను స్తుతించిరి. వ్యాస, వైశంపాయన, అగస్త్య ఋషీశ్వరులు సంచరించిన పుణ్యభూమి ఈ ఓంకారపురం.
(ఆధారం గ్రంథం స్కాంధపురాణము.. శ్రీ వ్యాస మహర్శి విరచితం.)
గణాంకాలు[మార్చు]
2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 2,281 - పురుషుల సంఖ్య 1,123 - స్త్రీల సంఖ్య 1,158 - గృహాల సంఖ్య 632[1]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,131 ఇందులో పురుషుల సంఖ్య 1,067, మహిళల సంఖ్య 1,064, గ్రామంలో నివాసగృహాలు 557 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-07.