కె.ఆశన్న
కందుల ఆశన్న | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, 2వ లోక్‌సభ | |
In office ఏప్రిల్ 1957 – మార్చి 1962 | |
అంతకు ముందు వారు | సి.మాధవరెడ్డి |
తరువాత వారు | జి. నారాయణరెడ్డి |
నియోజకవర్గం | ఆదిలాబాదు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఆదిలాబాదు, తెలంగాణ | 1923 మే 11
మరణం | 2007 సెప్టెంబరు 23[1] | (వయసు 84)
పౌరసత్వం | భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | లక్ష్మిబాయి |
సంతానం | ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు |
తల్లిదండ్రులు | నర్సింహులు (తండ్రి) |
నైపుణ్యం | న్యాయవాది & రాజకీయ నాయకుడు |
కందుల ఆశన్న ( 1923 మే 11 – 2007 సెప్టెంబరు 23) తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు.[2][3] 1957లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంనుండి 2వ లోక్‌సభకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
జననం - చదువు
[మార్చు]ఆశన్న 1923, మే 11న ఆదిలాబాదులో జన్మించాడు. తండ్రి పేరు కందుల నర్సింహులు. మాధ్యమిక విద్య అన్వరులు-లూమ్ పాఠశాలలో, కళాశాల విద్యను చాదర్ ఘాట్ కళాశాలలో చదివాడు. 1954లో ప్లీడర్ షిప్ డిప్లమా చేశాడు.
వివాహం
[మార్చు]1946, మే 11న లక్ష్మిబాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]1957లో ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటిచేసిన ఆశన్న సి. మాధవరెడ్డిపై 5,912 ఓట్ల తేడాతో గెలుపొందాడు.[6] ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన రెండో వ్యక్తి ఆశన్నకు. భారత లోక్‌సభలో ఏకైక పదవీకాలం ఇది.[2][7]
పదవులు
[మార్చు]- 1957లో 2వ లోక్‌సభకు ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.
- సంయుక్త కార్యదర్శి, హైదరాబాదు రెడ్డి హాస్టల్ (1944)
- ఉపాధ్యక్షులు, చాదర్ ఘాట్ కాలేజ్ సంఘం (1944)
- ప్రతినిధి, హైదరాబాదు లోని అన్ని విద్యార్థుల సంఘం (1945)
- కార్యదర్శి, తాలూకా కాంగ్రెస్ కమిటీ, ఆదిలాబాద్ (1948)
- ప్రతినిధి, హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ (1949)
- సభ్యులు, జిల్లా ఆహార మండలి (1951)
- సభ్యులు, వ్యవసాయ క్రయ విక్రయాల సంఘం (1950-53)
- కార్యదర్శి, భారత సమావేశ సోషల్ వర్క్ (1950-51 )
- సభ్యులు, హైదరాబాదు కేంద్రీయ పంపిణి సంస్థ (1952-53)
- సభ్యులు, తాలూకా కౌలు సంఘం (1952-54)
- సభ్యులు, భారత జాతీయ కాంగ్రెస్, 58 వ సమావేశాలు ఆదరణ కమిటీ ననల్ నగర్, హైదరాబాదు (1953)
- ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ, ఆదిలాబాద్
- ఉపాధ్యక్షులు, జిల్లా సంఘం, ఆదిలాబాద్
- సభ్యులు, జిల్లా ప్రణాళిక, అభివృద్ధి సంఘం, ఆదిలాబాద్
- సంయుక్త కార్యదర్శి, ఆదిలాబాద్ బార్ అసోసియేషన్
ఓట్ల వివరాలు
[మార్చు]ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు పోలైన ఓట్లు - 4,28,092,
- కె.ఆశన్న (భారత జాతీయ కాంగ్రెసు) 91,287
- సి.మాధవరెడ్డి 85,375
మరణం
[మార్చు]ఆశన్న 2007, సెప్టెంబరు 23న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ K. Ashanna's obituary
- ↑ 2.0 2.1 "Member Profile". Lok Sabha website. Archived from the original on 15 October 2013. Retrieved 19 January 2014.
- ↑ "Election Results 1957" (PDF). Election Commission of India. Retrieved 19 January 2014.
- ↑ "లోక్‌సభ జాలగూడు". Archived from the original on 2013-10-15. Retrieved 2014-01-25.
- ↑ EENADU (8 May 2024). "ఆయన ఎన్నికల ఖర్చు రూ.500". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
- ↑ ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 18 April 2020.
- ↑ "Election Results 1957" (PDF). Election Commission of India. Retrieved 19 January 2014.