కర్రి నారాయణ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్రి నారాయణరావు

పార్లమెంటు సభ్యుడు
పదవీ కాలం
1967–1977
తరువాత పూసపాటి విజయరామ గజపతి రాజు
నియోజకవర్గం బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 జూలై 1929
సంత నర్శీపురం, శ్రీకాకుళం జిల్లా
మరణం 2 మార్చి 2002
నడుకూరు , శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సరస్వతి
సంతానం విజయ కుమార్
వెబ్‌సైటు [1]

కర్రి నారాయణ రావు (కె.నారాయణ రావుగా సుపరిచితుడు) భారతీయ న్యాయవాది. పార్లమెంటు సభ్యుడు. అతను 4వ, 5వ, లోక్ సభలకు బొబ్బిలి లోక్ సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. 1967 నుండి 1977 వరకు లోక్ సభ సభ్యునిగా ఉన్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

కె.నారాయణ రావు 1929 జూలై 1న శ్రీకాకుళం జిల్లా సంత నర్శీపురం గ్రామంలోజన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. న్యాయవాద విద్యను అభ్యసించి లా కమిషన్ లో కీలక బాధ్యతలను నిర్వహించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, న్యూఢిల్లీ ఉపాధ్యక్షుడుగా పనిచేశారు.

1967 నుండి 1971 లలో జరిగిన 4,5 లోక్ సభ సాధారణ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]