కలసి ఉంటే కలదు సుఖం

వికీపీడియా నుండి
(కలసివుంటే కలదుసుఖం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కలసి ఉంటే కలదు సుఖం
దర్శకత్వంతాపీ చాణక్య
రచనఆచార్య ఆత్రేయ (మాటలు), కొసరాజు రాఘవయ్య, శ్రీశ్రీ (పాటలు)
నిర్మాతవై. రామకృష్ణ ప్రసాద్, సి. వి. ఆర్. ప్రసాద్
తారాగణంనందమూరి తారక రామారావు,
సావిత్రి,
యస్వీ రంగారావు
ఛాయాగ్రహణంయూసాఫ్ మూల్జీ
కూర్పుఎ. సంజీవి
సంగీతంమాస్టర్ వేణు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
సెప్టెంబరు 8, 1961 (1961-09-08)
సినిమా నిడివి
192 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు

కలసి ఉంటే కలదు సుఖం 1961 లో తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, సావిత్రి, ఎస్. వి. రంగారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వై. రామకృష్ణ ప్రసాద్, సి. వి. ఆర్. ప్రసాద్ శ్రీ సారధి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు రాశాడు. మాస్టర్ వేణు సంగీతం అందించాడు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. కలసివుంటే కలదుసుఖం - ఘంటసాల, పి.సుశీల . రచన: కొసరాజు.
  2. తొండమునేక దంతమును (పద్యం) - ఘంటసాల . రచన:కొసరాజు
  3. నవరాల తండ్రి - ఘంటసాల . రచన:ఆరుద్ర.
  4. బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మనదేశం - ఘంటసాల, రాఘవులు, పి.సుశీల . రచన: కొసరాజు.
  5. మేలిమి బంగారు - పి.సుశీల, రచన: ఆరుద్ర
  6. ముద్దబంతి పూలు బెట్టి - రచన: కొసరాజు రాఘవయ్య; గానం: ఘంటసాల, పి.సుశీల
  7. ఆటల తీరు పదివేలు అది ఆశలు గొలిపే , కె.జమునా రాణి , సత్యారావు బృందం , రచన: శ్రీ శ్రీ
  8. ముద్దబంతి పూలుబెట్టి, ఎం.ఎస్.విశ్వనాధన్,(ఆలాపన),ఘంటసాల , పి.సుశీల, రచన:కొసరాజు.

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.