కల్లూరు రాఘవేంద్రరావు
కల్లూరు రాఘవేంద్రరావు అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన కథారచయిత, బాలసాహిత్యవేత్త.
కల్లూరు రాఘవేంద్రరావు | |
---|---|
జననం | కల్లూరు రాఘవేంద్రరావు 1946జూలై 1 కల్లూరు |
వృత్తి | విశ్రాంత ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కథారచయిత, బాలసాహిత్యవేత్త |
తండ్రి | కల్లూరు అహోబలరావు |
తల్లి | సీతమ్మ |
జీవితవిశేషాలు
[మార్చు]కల్లూరు రాఘవేంద్రరావు అనంతపురం జిల్లా, లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో సీతమ్మ,కల్లూరు అహోబలరావు దంపతులకు 1946, జులై 1వ తేదీన జన్మించాడు. హిందూపురంలో బి.ఎ. (తెలుగు సాహిత్యం) చదివి సెకెండరీ గ్రేడ్ టీచర్ ట్రయినింగ్ పూర్తి చేశాడు. వృత్తి రీత్యా 1969 నుండి 2004 వరకు 35 సంవత్సరాల పాటు హిందూపురం పురపాలక సంఘ వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయవృత్తి సాగించి, ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు.
కల్లూరు రాఘవేంద్రరావు రాసిన కథలు, గేయాలు చందమామ, బాలమిత్ర, బాలబంధు, బుజ్జాయి, కృష్ణా పత్రిక, ప్రజామత మొదలైన పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అంతేకాదు నవ్య, సాక్షి ఫన్‌డే పత్రికల్లో ఇతని కథలు ఎక్కువగా ప్రచురితమయ్యాయి. కథలపోటీల్లో బహుమతులు కూడా వచ్చాయి.
ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన తరువాత పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని గేయాలు, కథలు రాయవలసిన అగత్యం ఏర్పడింది. దాంతో కొన్ని కథాగేయాలు కూడా రాయడం జరిగింది. వీరి కథా గేయాలు పిల్లల్ని బాగా ఆకట్టుకున్నాయి. వీరు వాటిని పంచతంత్ర కథల ఆధారంగా రాయడం జరిగింది. కోతి-మొసలి, కొంగ- తాబేలు, ఎండ్రి- కొంగ, మనిషి- కాకి, పాము-ముంగిస మొదలైనవి బాలలను విశేషంగా ఆకర్షించాయి. తన తండ్రి కల్లూరు అహోబలరావు స్థాపించిన శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాలకు మేనేజింగ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ప్రచురించిన గ్రంథాలు
[మార్చు]- మూడుకాళ్ల మేక
- స్వర్గానికి దుప్పట్లు
పురస్కారాలు
[మార్చు]- పెనుకొండలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ పంచశతాబ్ది జయంత్యుత్సవాలలో అనంతపురం జిల్లా కలెక్టర్ చేత సత్కారం
- జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
బిరుదము
[మార్చు]హాస్యకథారత్న
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]http://www.suryaa.com/main/showSunday.asp?cat=1&subCat=11&ContentId=20128[permanent dead link]