కల్వల మాధవరెడ్డి
కల్వల మాధవరెడ్డి | |
---|---|
జననం | 1934 |
మరణం | ఆగస్టు 11, 2016 |
ఉద్యమం | తెలంగాణ సాయుధ పోరాటం |
కల్వల మాధవరెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డితో కలిసి పాల్గొన్నాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]మాధవరెడ్డి 1934లో జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామంలో జన్మించాడు.[1]
రాజకీయరంగం
[మార్చు]1950లలో విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. ముత్తారంలో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేయడంతో, దాదాపు పదేళ్లపాటు పూర్తిస్థాయి కార్యకర్తగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. 1960 నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చి, జనగామ స్థానిక కాంగ్రెస్‌లో పేరొందిన నాయకుడిగా ఎదిగాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, జనగామ మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశాడు. భారతదేశ మాజీ ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాంధీలకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మాధవరెడ్డి,రచయితగా పుస్తకాలు కూడా రాశాడు.[1]
ఇతర వివరాలు
[మార్చు]- సూర్యాపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఉపన్యాసానికి తెలుగు అనువాదం చేశాడు.
- 1983లో తెలుగుదేశం పార్టీ తరపున జనగామ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎన్.టి.ఆర్ కోరగా, తిరస్కరించాడు.
మరణం
[మార్చు]మాధవరెడ్డి 2016, ఆగస్టు 11న ముత్తారం గ్రామంలో మరణించాడు.[1]