కహ్న్ సింగ్ నాభా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కహ్న్ సింగ్ నాభా
పుట్టిన తేదీ, స్థలం(1861-08-30)1861 ఆగస్టు 30
షాబాజ్ బనేరా , పటియాలా[1]
మరణం23 November 1938(1938-11-23) (aged 77)
నాభ రాష్ట్రం
వృత్తివిజ్ఞాన సర్వస్వ నిపుణుడు, నిఘంటుకర్త
జాతీయతబ్రిటిష్ ఇండియా
గుర్తింపునిచ్చిన రచనలు"Gur Shabad Ratnakar – Mahaan Kosh (1930)" "Ham Hindu Naahi ( 1887)" "Raj Dharam" "Gurmat Parbhakar (1898)"Gurmat Sudhakar (1899)
మహాన్ కోష్, సిక్కీజం యొక్క మొదటి విజ్ఞాన సర్వస్వం

భాయ్ కహ్న్ సింగ్ నాభా (1861 ఆగస్టు 30 – 1938 నవంబరు 24) నిర్మలా సిక్కు శాస్త్రజ్నుడు, విజ్ఞాన సర్వస్వకర్త. ఆయన రాసిన మహాన్ కొశ్ తన తరువాతి తరాల పండితులకు ఆదర్శంగా నిలిచింది.[1] సింగ్ సభా ఉద్యమంలో ప్రభావవంతమైన పాత్ర పోషించారు.

జీవిత సంగ్రహం[మార్చు]

పటియాలా లోని సబాజ్ బనెరాలో నరైన్ సింగ్, హర్ కౌర్ లకు 1861 ఆగస్టు 30న జన్మించారు కహ్న్ సింగ్.[1] 1861లో దేరా నభాలోని  బాబా అజయ్ పాల్ సింగ్ గురుద్వారాకు కహ్న్ తాత సరూప్ సింగ్ తరువాత అధికారి అయ్యారు ఆయన తండ్రి.[1] కహ్న్ సింగ్ కు ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు.

ఆయన పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళి చదువుకోలేదు కానీ స్వంతంగా చాలా పుస్తకాలు చదువుకున్నారు. 10వ సంవత్సరం  వచ్చేటప్పటికీ గురు గ్రంథ్ సాహిబ్, దశమ్ గ్రంథ్ పుస్తకాలు చదివేశారు.[1] నాభాలో స్థానిక పండితుల వద్ద సంస్కృత గ్రంథాలు నేర్చుకున్నారు కహ్న్ సింగ్.[1] ఢిల్లీ లో పర్షియన్, మావల్వా భాషలు చదువుకున్నారు.

రెండేళ్ళు పర్షియన్ భాషలో చదువు కొనసిగించిన తరువాత, 1883లో సింగ్ సభా ఉద్యమంలో భాగంగా సుధారక్ ను ప్రచురించడంలో భాయ్ గురుముఖ్ సింగ్ కు సహాయం చేశారు కహ్న్ సింగ్.[1] 1887లో నాభా రాజ్య ఉత్తరాధికారి రిపుదమన్ సింగ్ కు చదువు చెప్పడానికి నియమించబడ్డారు ఆయన. ఆ తరువాత నభా రాష్ట్ర హైకోర్టు జడ్జి మహారాజా హీరా సింగ్ కు పర్సనల్ సెక్రెట్రీగా పనిచేశారు కహ్న్ సింగ్.[1] 1915-1917 మధ్యకాలంలో పటియాలా రాష్ట్రానికి కూడా  సేవలందించారు ఆయన.[1]

1885లో సిక్కు మతం గురించి ది సిక్ రిలిజియన్ పేరుతో ఆరు వాల్యూంలు రాసిన మాక్స్ ఆర్థర్ మక్యౌలిఫ్ఫెను కలిశారు కహ్న్ సింగ్. అప్పట్నుంచీ వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ పుస్తకం రాయడంలో మాక్స్ కు కహ్న్ సింగ్ సహాయం చేశారు.[1] ఆ పుస్తకాన్ని ప్రచురించినపుడు కహ్న్ సింగ్ కే కాపీహక్కులు లభించాయి.[1]

రచనలు[మార్చు]

సిక్కు మతాన్ని అర్ధం చేసుకోవడానికి ఆయన రాసిన గురుమత్ ప్రభాకర్, గురుమత్ సుధాకర్ పుస్తకాలు ఇప్పటికీ దానిని చదువుతుంటారు. ఆయన రాసిన సిక్కు విజ్ఞాన సర్వస్వం మహాన్ కోశ్ పుస్తకం మాస్టర్ పీస్ గా నిలిచింది. ఖల్సా గజట్టే పత్రికను నడిపేవారు ఆయన. ఖల్సా అక్బర్ వారపత్రికను స్థాపకుల్లో ఒకరు కహ్న్. 1822 నుండి 1911 మధ్య ఆయన రాసిన ప్రముఖ పుస్తకాలు:

 • రాజ్ ధరమ్- మహారాజా హీరా సింగ్ దగ్గర పనిచేసినప్పుడు కహ్న్ సింగ్ రాసిన మొదటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రభుత్వం స్వంత  ఖర్చులతో ప్రచురించారు.
 •  హమ్ హిందూ నహీ - 1898లో మొదటి సారి ప్రచురించారు ఈ పుస్తకాన్ని.[2][3] ఈ పుస్తకాన్ని ముందు హిందీ భాషలో రాసి,  తరువాత పంజాబీ భాషలోకి అనువదించారు.
 • గురుమత్ ప్రభాకర్-1898లో ప్రచురించారు.
 • గురుమత్ సుధాకర్-1899లో ప్రచురించారు.
 • సద్ పరమార్ధ్
 • గురుచంద్ దివాకర్ 
 • గురు శబ్ధాలంకార్
 • రూప్ దీప్ పింగల్
 • గురు శబద్ రత్నాకర్ మహాన్ కోశ్ - సిక్కు విజ్ఞాన సర్వస్వం
 • గురుమత్ మర్తాండ్
 • గురు మహిమా సంగ్రహ్
 • అనేకర్థక్ కోశ్
 • నామ్ మాలా కోశ్

మూలాలు[మార్చు]

 1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 Singh, Satyindra (1995). Siṅgh, Harbans (ed.). Kāhn Siṅgh, of Nābhā (in English) (3rd ed.). Patiala, Punjab, India: Punjab University, Patiala, 2011. pp. 409-410. ISBN 9788173805301. Retrieved 18 January 2020.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 2. Nabha, Kahn Singh (2011). ਹਮ ਹਿੰਦੂ ਨਹੀਂ (in Punjabi). Amritsar: Singh Brothers. p. 128. ISBN 978-81-7205-051-1.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 3. "Ham Hindu Nahin". Article on book. TheSikhEncyclopedia. Retrieved July 24, 2012. {{cite web}}: External link in |publisher= (help)