Jump to content

కుమారి 21ఎఫ్

వికీపీడియా నుండి
కుమారి 21F
(2015 తెలుగు సినిమా)

సినిమా పోస్టరు
దర్శకత్వం పల్నాటి సూర్యప్రతాప్
నిర్మాణం సుకుమార్
విజయ్ బండ్రెడ్డి
థామస్ రెడ్డి
రచన సుకుమార్
తారాగణం రాజ్ తరుణ్
హెబ్బా పటేల్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం ఆర్. రత్నవేలు
కూర్పు అమర్ రెడ్డి
విడుదల తేదీ 20 నవంబరు 2015 (2015-11-20)
నిడివి 135 నిమిషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు
పెట్టుబడి 60—150 million
వసూళ్లు 380 million[1][2]
నిర్మాణ_సంస్థ సుకుమార్ రైటింగ్స్
పీ. ఏ. మోషన్ పిక్చర్స్

కుమారి 21ఎఫ్ - ఇది పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన 2015 నాటి తెలుగు సినిమా. ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లేతో పాటు సహ నిర్మాణం కుడా చేశారు. విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి సహ నిర్మాతలుగా, సుకుమార్ రైటింగ్స్, పి. ఎ. మోషన్ పిక్చర్స్ పతాకం పై నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

సిద్దూ ఒక చెఫ్, ఒక మధ్యతరగతి కుర్రాడు తన తల్లితో కె.జి.బి కాలనీలో ఉంటాడు.తన తండ్రి రవికాంత్‌పై అక్రమ సంభంధ ఆరోపణ ఉండటం వలన తల్లిదండ్రులు ఎప్పుడో విడిపొయారు.అతను సింగపూరులో పెద్ద చెఫ్ అవ్వాలని కొరుకుంటాడు కాని అతని ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు.అతని మిత్రులు శంకర్, సురేష్, శ్రీను దగ్గరలో ఉండే ఏ.టి.ఏం. వాడే వారి దగ్గర దొంగతనాలు చెసి వారి రహస్యమైన పాడుబడిన ప్రాంతంలో తలదాచుకుంటారు.సిద్దు వారికి బొజనం, మద్యం తిసుకెళ్ళి ఇస్తాడు.అందుకు బదులుగా వారు డబ్బులో కొంత భాగాన్ని అతనికి ఇస్తూ ఉంటారు.

ఇటీవలే కాలనీకి తరలి వచ్చిన ముంబైకి చెందిన కుమారితో సిద్దూకి పరిచయం ఏర్పదుతుంది.వారు ప్రేమలో పడతారు.కుమారి ధైర్యంగా, ఆమె ప్రవర్తనతో సిద్దూ తరచూ అయోమయం చెందుతాడు.అతని స్నేహితులు సిద్దూకు అతను కుమారి యొక్క మొట్టమొదటి ప్రియుడు కాదు, ఆమె గత సంబంధాలను కలిగి ఉండవచ్చుని చెభుతారు.సిద్దు కుమారి కన్య కాదేమో అని అనుమాన పడతాడు, కుమారి ఆ విషయన్ని అర్ధం చేసుకుంటుంది.సిద్దు పెళ్ళి చేసుకుందామని అడిగినప్పుడు ఆమె తిరస్కరించి.ఆమెని ప్రేమించేటంత పరిణితి అతనికి లేదని చెబుతుంది.

కుమారి అసూయ పడేలా చెయ్యటానికి అతను మదు అనే అమ్మాయితో చనువుగా ఉంటాడు.కాని కుమారి మాత్రం అతన్ని ప్రేమిస్తునే ఉంటుంది.ఆమె వైఖరి సిద్దూని గందరగోళానికి గురి చేస్తుంది.సిద్దు స్నేహితులు కుమారి అసలు పేరు మీనా, ఒక వేశ్యాగృహం వద్ద పోలీసులు దాడిలో దొరికిన ఒక ముంబైకి చెందిన మోడల్ అని తెలుసుకుంటారు.ఆమె వారి లైంగిక అభ్యర్దనను తిరస్కరిస్తుంది.దానితో వారు ఆమెపై కోపం పెంచుకుంటారు.సిద్దూ ఆమెను విడిచిపెట్టడానికి నిరాకరిస్తాడు.వారు ఆమెపై మరింత కొపగించుకుంటారు.

ఎటిఎమ్ దోపిడీ తరువాత, వారు తప్పించుకుంటాడు కాని శ్రీను తన సెల్‌ఫొనుని కోల్పోతాడు.అది కుమారికి దొరుకుతుంది, అమే పోలీసులకు సెల్‌ఫొనుని అప్పగిస్తుంది.వారు తమ రహస్య స్తావరమైన పాడుబడిన ప్రేదేశానికి వెళ్ళి దాక్కుంటారు.సిద్దు వారిని కలుసుకున్నప్పుడు, కుమారి వాస్తవానికి మీనా అని వెల్లడించి, ముంబై పోలీసులు జారీ చేసిన ఒక పత్రికా వీడియోలో ఆమె, ఇతరులతో వ్యభిచారిణి కేసుతో ముడిపెట్టిన ఒక వీడియోను పంచుకుంటారు.ఆ రాత్రి సిద్దూ బలవంతపెట్టబొతే కుమారి తిరస్కరిస్తుంది.ఆ తరువాత రోజు సిద్దు తన తండ్రికి ఎటువంటి అక్రమ సంభందం లేదని, తన తల్లి తన తండ్రిని అపార్ధం చేసుకుందని తెలుసుకుంటాడు.సిద్దు సంతోషపెట్టటానికి అతని కొరిక తీర్చటానికి అతనని ఆ రోజు రాత్రి తన ఇంటికి రమ్మని కుమారి చెబుతుంది.

ఆ రాత్రి సిద్దు కంటే ముందు అతని ముగ్గురు స్నేహితులు కుమారి ఇంటికి వెళ్ళి అమెకు మత్తుమందు ఇచ్చి అమెను అత్యాచారం చేస్తారు.

అక్కడికి సిద్దు కుమారిని పెళ్ళి చెసుకుందామని చెప్పటానికి వచ్చి వారి ముగ్గురుని చుస్తాడు.వారిని పారదోలిన తరువాత అమే రాసిన లేఖ చదివి అతను కుమారిని ఎలా అపార్ధం చెసుకున్నాడొ తెలుసుకుంటాడు, అతనికి పరిణితి లేకపొవటం గుర్తిస్తాడు.ఆమెకు అత్యాచారం గురించి ఎమి తెలియకుండా ఉండేటందుకు అక్కడి వస్తువలని సరిగ్గా అమర్చటానికి చుస్తాడు.ఆమె చీర మీద ఉన్న రక్తం మరకలు చూసి ఆమె కన్యే అని భావిస్తాడు.అతను ఆ చిరను తిసి మరకలు కడిగి తిరిగి ఆమెకు తొడుగుతాడు.ఆమెకు స్ప్రుహ వచ్చిన తరువాత ఆ ముగ్గురు వెళ్ళిపొయిన తరువాత అమే నిద్రపొయిందని ఆమె మెల్కోనటానికి అతను ఎదురుచూస్తున్నాదని చెబుతడు.ఆమెకు అనుమానం కలిగినా అతను ఆమెని పెళ్ళి చెసుకొవటానికి అడుగుటాడు, ఆమె అంగీకరిస్తుంది.

పొలీసులు సిద్దుని అరెస్టు చేసి తన మిత్రులు ఎక్కడని విచారిస్తారు, కాని అతను ఎమి చెప్పదు.అతను విడుదలైన తరువాత కుమారిని పెళ్ళి చేసుకుంటాదు.మూదు సంవత్సరాల తరువాత అతను ఒక రెస్టారెంటు నడుపుతుంటాడు.ఆ ముగ్గురుని పట్టుకోలేక పొలీసులు కేసుని ముసివెయ్యాలని చుస్తారు.సిద్దు వారిని శిథిలాలలో సంకెళ్ళతో బంధించి ఉంచాడని వెళ్ళడవుతుంది.అతను మూదు సంవత్సరాలుగా వారిని బంధించి హింసిస్తున్నాడు.వారు తమని చంపెయ్యమని అతనిని వెడుకొంటారు. వారు చేసిన తప్పుని క్షమించెటంత పరిణితి తనకి లేదంటు వారికి బొజనం పెట్టిన తరువాత వారిని కొట్టడం మొదలుపెట్టటంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. H. Hooli, Shekhar (5 January 2016). "Baahubali to Kumari 21F: Top 20 highest-grossing Telugu/Tollywood movies of 2015". International Business Times India. Archived from the original on 5 January 2016. Retrieved 5 January 2016.
  2. "'Kumari 21 F' turns out to be a hit!". m:en:Sify. 23 November 2015. Archived from the original on 23 November 2015. Retrieved 23 November 2015.