కె.ఎం.మాథ్యూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.ఎం.మాథ్యూ
కె.ఎం.మాథ్యూ
జననం(1917-01-02)1917 జనవరి 2
అలప్పుఝా, కేరళ
మరణం2010 ఆగస్టు 1(2010-08-01) (వయసు 93)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పత్రికా సంపాదకుడు- మళయాళం మనోరమ
జీవిత భాగస్వామిఅన్నమ్మ మాథ్యూ

కె.ఎం.మాథ్యూ (మళయాళం: കെ.എം.മാത്യു) (జనవరి 2, 1917ఆగష్టు 1, 2010) మళయాళ మనోరమ దినపత్రిక సంపాదకులు. ఈ దినపత్రిక భారతీయులందరికీ సుపరిచితము. పాఠకుల విజ్ఞానాన్ని, పఠనాశక్తిని పెంపొందించే వీరి ఆంగ్ల పత్రిక "మనోరమ ఇయర్ బుక్" సుప్రసిద్ధమైనవే[1][2] [3] [4] మారుమూల ఉన్న ఒక చిన్న రాష్ట్రం నుంచి వెలువడే ఈ ప్రచురణలు దేశమంతటా జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. "మళయాళ మనోరమ"ను "కొట్టాయం ముద్దుబిడ్డ"గా చాలా మంది పిలుస్తారు.

జీవిత విశేషాలు

[మార్చు]

మాథ్యూ కేరళ లోని కొట్టాయంలో 1917, జనవరి 2 న కె.సి.మమ్మెన్‌ మాప్పిళ్ళై , మమ్మి (కుంజండమ్మ) లకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు. పాఠశాల విద్యను ఎం.డి.సెమినరీ పాఠశాల, కొట్టాయం , లియో XIII పాఠశాల,అలెప్పు లలో పూర్తిచేసిన పిదప సి.ఎం.ఎస్.కాలేజీ, కొట్టాయంలో చరిత్ర అభ్యాసించుటకు చేరారు. తర్వాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులైనారు. తాను చేపట్టిన జర్నలిజం వృత్తి మీద సాధికారత సంపాదించుకున్నా మాథ్యూ కేరళ లోని పాత్రికేయులకే కాక దేశీయ పత్రికారంగానికే మణిపూసగా నిలిచారు. ఆయన సెప్టెంబర్ 7 1942అన్నమ్మ మాథ్యూను వివాహం చేసుకున్నారు.

మళయాళ మనోరమ

[మార్చు]

కేరళ రాష్ట్రం, కొట్టాయంలో "మళయాళ మనోరమ" సంస్థను 1888, మార్చి 14 న "కేందతిల్ వర్ఘీస్ మా పిళ్ళై" స్థాపించారు. 1890 మార్చి 22 న "మనోరమ" వార పత్రిక ప్రారంభమైనది. 1896 లో "భాషా పోషిణి" సాహిత్య పత్రిక వెలువడడం ప్రారంభమైనది. 1901, ఆగష్టు 7 న "మనోరమ" ద్వైవారపత్రిక ప్రచురణ ప్రారంభించి, 1915 లో ప్రతిరోజూ యుద్ధ వార్తా సంచికలు వెలువరించారు. 1918 జూలై 2 నుండి వారానికి మూడుసార్లు వెలువరిస్తూ "మళయాళ" మనోరమగా పేరు మార్చి దిన పత్రిక చేసారు. 1950 లో పత్రికా కార్యాలయంలో మొదటి రోటరీ ప్రెస్ ను నెలకొల్పారు. మరుసటి యేడాది భారత రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ డైమండ్ జూబ్లీ ఉత్సరాలను ప్రారంభించారు.

కెరీర్

[మార్చు]

మాథ్యూ 1940 లో తన కెరీర్ ను చిక్ మగళూరు లోని భద్ర ఎస్టేట్ లో తన సోదరుడు కె.ఎం. జాకోబ్ పనిచేసే చోటనే ఒక పనిలో చేరాడు.అతను ఏడు సంవత్సరాల పాటు అదే ఎస్టేట్ లో గడిపాడు. ఈ కాలంలో ఆయన ఆ ఎస్టేట్ సమీపంలో బెలూన్ల తయారీ పరిశ్రమను స్థాపించాడు. కానీ వాతావరణ కాలుష్యం మూలంగా ఆ పరిశ్రమ మూసివేయబడింది. తర్వాత ఆ పరిశ్రమలో యంత్ర భాగాలను మద్రాసులో తన సోదరుడు అయిన కె.ఎం. మమ్మెన్ మాప్పిళ్ళైకు అందసేసాడు. అతడు అచట ఎం.ఆర్.ఎఫ్.లిమిటెడ్ను ప్రారంభించాడు. 1947 లో మాథ్యూ మిత్రరాజ్యాల సంస్థలు ప్రారంభించుటకు బొంబాయికి వెళ్ళాడు. బొంబాయిలో 7 సంవత్సరాలు గడిపిన తర్వాత 1954 లో ఆయన కొట్టాయం వెళ్ళి అచట మళయాళం మనోరమలో జనరల్ మేనేజరుగా బాధ్యతలను స్వీకరించారు. తన సోదరుడు, అప్పటి ఆ పత్రిక ప్రధాన సంపాదకుడు అయిన కె.ఎం.చెరియన్ మరణం తర్వాత ఆయన ప్రధాన సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించి 2010 మార్చి 14 న తను మరణించే వరకు కొనసాగించారు. ఆయన నేతృత్వంలో ఆ పత్రిక 17 ఎడిషన్లు, 1.6 మిలియన్ల కాపీల సర్క్యులేషను దాటగలిగింది.

మాథ్యూ క్రింది పదవులలో విశేష సేవలందించారు:

ఛైర్మన్- ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ABC) - (1970)
ఛైర్మన్- ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా[1] - (1979)
ఛైర్మన్- రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూస్ పేపర్ డెవలప్ మెంట్ (RIND) - (1979)
అధ్యక్షుడు- ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ
ట్రస్టు స్థాపకుడు- ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
సభ్యుడు - ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు - ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ న్యూస్ పెపర్ పబ్లిషర్స్ అండ్ ఎడిటర్స్, ప్రాన్స్

అవార్డులు

[మార్చు]
  • 1998 : పద్మభూషణ్ అవార్డు.
  • 1991 : ఫౌండేషన్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్‌మేషన్ అవార్డు.
  • 1992 : నేషనల్ సిటిజన్ అవార్డు.
  • 1995 : రామకృష్ణ జై దయాల్ అవార్డు.
  • 1996 : దుర్గా ప్రసాద్ చౌదరి అవార్డు.
  • 1997 : ప్రెస్ అకాడమీ అవార్డు.
  • 1996 : బి.డి.గోయంకా అవార్డు.
  • ఆయన మరణానంతరం వర్ధంతి నాడు భారత ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది [5] భారత పార్లమెంటు భవనంలో భారత యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్, ఇన్‌పర్మేషన్ శాఖ్యామాత్యులైన కపిల్ సిబాల్ ఆయన చిత్రంతోకూడిన స్టాంప్ ఆల్బాన్ని ప్రధాన మంత్రి మన్‌మోహన్‌సింగ్కు అందజేశారు.

కుటుంబం

[మార్చు]

ఆయన భార్య అన్నమ్మ మాథ్యూ (1922–2003) "వనిత" పత్రికకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ఆమె "కె.ఎం.మాథ్యూ" పేరుతొ రచనలు చేసేవారు. ఆయన జ్ఞాపకాలతో కూడిన పుస్తకం "అన్నమ్మ" [6] 2004 లో "పెంగ్విన్" ద్వారా మళయాళంలో ప్రచురింపబడింది., 2005 లో ఆంగ్లంలో ప్రచురింపబడింది.

కె.ఎం.మాథ్యూ, అన్నమ్మ మాథ్యూ లకు నలుగురు పిల్లలు. వారు మమ్మెన్ మాథ్యూ, ఫిలిప్ మాథ్యూ, జాకోబ్ మాథ్యూ, థంకోం మామ్మెన్.

స్వీయ చరిత్ర

[మార్చు]

ఆయన జీవిత చరిత్ర "ఎట్టంతే మోథిరాం" [7][8][9] (The Eighth Ring) 2008 లో ప్రచుచింపబడింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Hindustan Times 1 August 2010 Archived 2013-01-25 at Archive.today. Retrieved 1 August 2010.
  2. PTI. "President, Manmohan, Sonia, condole death of K. M. Mathew". Chennai, India: The Hindu. Retrieved 2010-08-01.
  3. "Doyen of Indian media, K M Mathew passes away". Ndtv.com. Retrieved 2010-08-01.
  4. "Malayala Manorama Chief Editor K.M. Mathew passes away". Chennai, India: The Hindu. 2010-08-01. Retrieved 2010-08-01.
  5. "K.M. Mathew an Indian legend, says Manmohan". The Hindu. Chennai, India. 2011-08-03.
  6. "Annamma". Easternbookcorporation.com. Archived from the original on 2011-07-10. Retrieved 2010-08-01.
  7. "Ettamathe Mothiram". Indulekha. 2008-02-20. Archived from the original on 2010-01-08. Retrieved 2010-08-01.
  8. "Ettamathe Mothiram by K. M. Mathew". Indiaplaza.in. Retrieved 2010-08-01.
  9. "Ettamathe Mothiram". Subscribe.manoramaonline.com. Archived from the original on 2010-01-18. Retrieved 2010-08-01.