కె.ఎల్. నరసింహారావు
కె.ఎల్. నరసింహారావు | |||
మాజీ శాసనసభ్యులు
| |||
పదవీ కాలం 1952 - 1967 | |||
నియోజకవర్గం | ఇల్లందు శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1927 బేతంపూడి, టేకులపల్లి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ | ||
మరణం | 2011, మార్చి 16 | ||
రాజకీయ పార్టీ | సిసిఐ | ||
జీవిత భాగస్వామి | దుర్గాదేవి | ||
సంతానం | ఉత్తమ్ కుమార్ , పవన్ , సుధ |
కె.ఎల్. నరసింహారావు (కొండపల్లి లక్ష్మీ నరసింహారావు) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు (రైతుసంఘం) నాయకులు, మాజీ శాసనసభ్యులు.[1] 1952 నుండి 1967 వరకు మూడు పర్యాయాలు ఇల్లందు శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించాడు.[2][3]
జననం
[మార్చు]ఇతను 1927 లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలంలోని బేతంపూడి గ్రామంలో జన్మించారు.[4][5]
సాయుధపోరాటం
[మార్చు]జమీందారీ కుటుంబమైనప్పటికీ దాయాదుల కుట్రల వల్ల చాలా కష్టాలు అనుభవించారు. పదిహేనవ ఏట క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.
జైలు నుంచి విడుదలయ్యాక ఎం.ఎస్. రాజలింగం, హయగ్రీవాచారి, కాళోజీ నారాయణరావు వంటి వారి ప్రభావంతో ఆంధ్ర మహాసభ మార్గంలో నడిచారు. భువనగిరి మహాసభలో రావి నారాయణ రెడ్డి, చిర్రావూరి లక్ష్మీనరసయ్య, మంచికంటి రాంకిషన్ రావు, సర్వ దేవ భట్ల రామనాథం తదితరులతో పరిచయమైంది. ఆ కాలంలో వరంగల్‌లో ఆజాంజాహి మిల్లులో కార్మిక సంఘ నిర్మాణంలో రామనాథంతో కలసి పనిచేశారు. రామనాథం ప్రేరణతో 1944లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అదే ఏడాది విజయవాడలో రాజకీయ తరగతులకు హాజరై పుచ్చలపల్లి సుందరయ్యను చూశారు. పుస్తక పఠనం కూడా అప్పుడే బాగా సాగించారు.[4]
ఇల్లెందు తాలూకా ఆంధ్ర మహాసభ కార్యదర్శిగానూ కమ్యూనిస్టు పార్టీ బాధ్యుడుగానూ పనిచేసి.. అక్రమ లెవీ, దోపిడీకి, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపి నిజాం ప్రభుత్వంలో జైలు శిక్ష అనుభవించారు. వీర తెలంగాణా పోరాటానికి నాందిగా పరిగణించే దొడ్డి కొమరయ్య బలిదానంపై జైల్లో ఉండి అమరజీవివి నీవు కొమరయ్యా అందుకో జోహార్లు కొమరయ్య అన్న పాట రాశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాజకీయ ఆర్గనైజర్‌గా రహస్య కేంద్రాలలో బాధ్యతలు చూసేవారు. బొంబాయి, మద్రాసు వంటి చోట్లకు వెళ్లి ఆయుధాలను కొనుగోలు చేసి, బట్టల వ్యాపారి వేషం వేసుకుని పెద్ద పెద్ద పెట్టెలలో పెట్టుకొని గెరిల్లా దళాలకు చేర్చేవారు.
ఇల్లెందు ప్రాంతంలో జన్నారెడ్డి భూస్వామి ఆధీనంలోని భూమిని పేదలకు పంచారు.
రాజకీయ జీవితం
[మార్చు]1952లో జరిగిన హైదరాబాదు రాష్ట్ర ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుమీద ఇల్లెందు నుంచి పోటీచేసి గెలిచారు. నాటి హైదరాబాదు శాసనసభలో వి.డి.దేశ్‌పాండే నాయకుడు కాగా నరసింహారావు ఉపనాయకుడుగా బాధ్యతలు నిర్వహించారు.
1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడి సుందరయ్య ప్రతిపక్ష నాయకత్వం చేపట్టినప్పుడు కూడా నరసింహారావు ఉప నాయకుడుగా ఉన్నారు. సభలో ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలను కలిపినప్పుడు కమ్యూనిస్టులు చెప్పిన విశాలాంధ్ర పదం గిట్టని సమయంలో ఆంధ్రప్రదేశ్ అన్న పదాన్ని ముందుకు తేవడంలోనూ ఆయన తొలి సూచన చేశారు. 1962లో మూడోసారి ఎంఎల్‌ఏగా గెలిచిన తరుణంలోనే ప్రభుత్వం భావి సిపిఎం నాయకత్వంపై మాత్రమే దాడి చేసినపుడు ఆయన కూడా అరెస్టయ్యారు. సిపిఎం వైపే నిలబడి జిల్లాలో ప్రముఖ శక్తిగా ఎదగడానికి ప్రారంభ దశలో ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. 1967లో ఆఖరి సారి శాసనసభ్యుడైనప్పుడు విశాఖ ఉక్కు సమస్యపై రాజీనామా చేశారు. తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడుగా మారింది. 1975లో దేశంలో ఎమర్జన్సీ విధించి హక్కులు కాలరాచినపుడు పార్టీ నాయకత్వం అజ్ఞాత వాసంలోకి వెళ్లారు.
శాసనసభ్యుడిగా
[మార్చు]సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1962 | 281 | ఇల్లందు | జనరల్ | కొండపల్లి లక్ష్మీనరసింహరావు | సిపిఐ | 21557 | బొమ్మకంటి సత్యనారాయణరావు | కాంగ్రెస్ | 14914 |
1957 | 71 | ఇల్లందు | (ఎస్టీ) | కొండపల్లి లక్ష్మీనరసింహరావు | సిపిఐ | 32529 | టి. వెంకట పాపయ్య | కాంగ్రెస్ | 27747 |
1952 | ఇల్లందు | (ఎస్టీ) | కొండపల్లి లక్ష్మీనరసింహరావు | ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ |
మరణం
[మార్చు]ఈయన 2011, మార్చి 16న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "🗳️ Kondapalli Lakshminarasimha Rao, Yellandu Assembly Elections 1962 LIVE Results | Election Dates, Exit Polls, Leading Candidates & Parties | Latest News, Articles & Statistics | LatestLY.com". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-05. Retrieved 2023-04-05.
- ↑ "Yellandu Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Retrieved 2023-04-05.
- ↑ Eenadu (14 November 2023). "సుదీర్ఘ విరామానికి తెర". EENADU. Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ 4.0 4.1 స్రజాశక్తి. "ఆశయాలకు అంకితమైన ధన్యజీవి కె.ఎల్". Archived from the original on 15 సెప్టెంబరు 2013. Retrieved 8 February 2017.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (7 November 2023). "టేకులపల్లి చట్టసభల చుట్టం". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.