కె.ఎస్.జయలక్ష్మి
కె.ఎస్.జయలక్ష్మి | |
|---|---|
| జాతీయత | భారతీయురాలు |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1976 – ప్రస్తుతం |
కె.ఎస్.జయలక్ష్మి తమిళ చలనచిత్రం, టెలివిజన్ పరిశ్రమలలో పనిచేసే భారతీయ నటి. సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటించింది. 1976లో విడుదలైన తమిళ చిత్రం ఎతర్కుమ్ తునింతవన్‌లో జయలక్ష్మి తొలిసారిగా నటించింది.
కెరీర్
[మార్చు]ఆమె అగ్ని సచ్చి, పొయిక్కల్ కుధిరై, మనతిల్ ఉరుతి వెండుమ్, గురు శిష్యన్, పుదు పుదు అర్థాంగళ్, కాదలే నిమ్మదితో సహా వందకు పైగా చిత్రాలలో నటించింది.
ఆమె నటించిన మనతిల్ ఉరుతి వెండుమ్ చిత్రం తెలుగులో సిస్టర్ నందిని (1988)గా డబ్బింగ్ చేయబడింది. కె.బాలచందర్‌కు ఉత్తమ తమిళ దర్శకునిగా ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టిన పుదు పుదు అర్థంగళ్ చిత్రం తెలుగులోకి భార్యలూ జాగ్రత్త (1994) అనే పేరుతో డబ్బింగ్ సినిమాగా విడుదలయ్యింది.[1] ఇలా ఆమె నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ అయ్యాయి. అయితే ఆమె నటించిన తమిళ చిత్రం ఉన్నాల్ ముడియుం తంబి కి మూలం మాత్రం చిరంజీవి నటించిన రుద్రవీణ. చిరంజీవి పాత్రను కమల్ హాసన్, శోభన పాత్రను సీత పోషించగా, రెండింటిలోనూ తండ్రి పాత్రని జెమిని గణేశన్ పోషించారు.
ఆమె రెగ్యులర్ గా కవితాలయ ప్రొడక్షన్స్ చిత్రాలలో నటించింది. అలాగే కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలలో ఆమె నటించింది.
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
|---|---|---|---|
| 1976 | ఈతర్కుమ్ తునింతవన్ | హీరోయిన్ గా అరంగేట్రం | |
| 1978 | అదృష్టకరణ్ | ||
| 1980 | మూడు పాణి | వేశ్య | |
| 1981 | ఎల్లమ్ ఇంబ మయం | తెలుగు డబ్బింగ్ చిలిపి చిన్నోడు | |
| 1983 | అగ్ని సచ్చి | ||
| 1983 | పోయిక్కల్ కుధిరై | ||
| 1986 | పున్నగై మన్నన్ | మాలిని తల్లి | తెలుగు డబ్బింగ్ డాన్స్ మాస్టర్ |
| 1987 | మనతిల్ ఉరుతి వెండుమ్ | తెలుగు డబ్బింగ్ సిస్టర్ నందిని | |
| 1988 | గురు శిష్యన్ | వేశ్య | |
| 1988 | ఉన్నాల్ ముడియుం తంబి | రుద్రవీణ ఈ చిత్రానికి మూలం. | |
| 1988 | పూంతోట్ట కావల్కారన్ | ||
| 1989 | పుదు పుదు అర్థాంగళ్ | ||
| 1990 | పులన్ విసరనై | పార్వతి | తెలుగు డబ్బింగ్ పోలీస్ అధికారి |
| 1990 | ఉలగం పిరంధడు ఎనక్కగా | ||
| 1991 | ఎన్ రసవిన్ మనసిలే | పన్నయ్యర్ భార్య | |
| 1991 | నీ పతి నాన్ పతి | ||
| 1991 | కురుంబుక్కారన్ | ||
| 1991 | అజగన్ | స్వప్న టీచర్ | |
| 1991 | ఒరు వీడు ఇరు వాసల్ | శివప్పు రుక్మణి | |
| 1992 | ఇడుతాండ సత్తం | ||
| 1992 | నాలయ్య తీర్పు | అంబిక | |
| 1992 | ఊర్ మరియాదై | ||
| 1993 | పోరంత వీడ పుగుంత వీడ | లిల్లీ | |
| 1994 | ఇలైంజర్ అని | పుదీనా | |
| 1994 | వనజ గిరిజ | మేరీ | |
| 1995 | ఎన్ పొండట్టి నల్లవా | ||
| 1995 | విట్నెస్ | అశోక్ తల్లి | |
| 1996 | శివశక్తి | కామేశ్వరి | |
| 1997 | లవ్ టుడే | ప్రీతి తల్లి | |
| 1997 | ఆహా ఎన్న పోరుతం | జాక్-ఆన్-జిల్ తల్లి | |
| 1998 | కాదలే నిమ్మది | ||
| 1999 | కుమ్మీ పాట్టు | అమరావతి తల్లి | |
| 1999 | ఒరువన్ | ||
| 1999 | అన్బుల్లా కధలుక్కు | ||
| 2000 | కన్నన్ వరువాన్ | ||
| 2002 | పమ్మల్ కె. సంబందం | ||
| 2015 | నలు పోలీసమ్ నల్ల ఇరుంధ ఊరుమ్ | ||
| 2017 | శరవణన్ ఇరుక్క బయమేన్ | నాగలక్ష్మి |
సీరియల్స్
[మార్చు]| సంవత్సరం | ధారావాహిక | పాత్ర | ఛానెల్ |
|---|---|---|---|
| 1999 | కాసలువు నేసం | మాధవీ దేవి | సన్ టీవీ |
| 2000–2001 | చితి | ||
| 2001–2002 | అలైగల్ | శకుంతల | |
| 2003–2004 | అన్నామలై | భార్గవి | |
| 2005–2006 | మనైవి | మాలాశ్రీ తల్లి | |
| 2006–2008 | లక్ష్మి | చాముండేశ్వరి | |
| 2008–2010 | అతిపూకల్ | ||
| 2009–2010 | కరుణామంజరి | రాజ్ టీవీ | |
| 2010–2012 | ఉరవుగల్ | మీనాక్షి | సన్ టీవీ |
| 2011–2015 | తెండ్రాల్ | తమిళ్ తల్లి | |
| 2013–2015 | వల్లి | శాంతి | |
| పొన్నుంజల్ | కృష్ణవేణి | ||
| 2013–2016 | భైరవి ఆవిగలుక్కు ప్రియమానవళ్ | బొంబాయి మామి | |
| 2014 | మన్నన్ మగల్ | జయ టీవీ | |
| 2015–2016 | చంద్రలేఖ | తమిళరసి | సన్ టీవీ |
| 2015–2017 | వంశం | సోలయ్యమ్మ | |
| 2019–2023 | పాండవర్ ఇల్లం | వల్లి | |
| 2021–2022 | పుదు పుదు అర్థాంగళ్ | పరిమళం | జీ తమిళం |
| 2020–2021 | నీతానే ఎంతన్ పొన్వసంతం | సమియాది | జీ తమిళం |
| 2023–Present | పేరంబు | జీ తమిళం |
రియాలిటీ షోలు
[మార్చు]| వనం వాసపాదుం |
| సూపర్ కుటుంబం సీజన్ 1 |
| సూర్య వనక్కం |
| సొల్లతాన్ నానికెరెన్ |
| సాగర సంగమ |
| పుతియా పాటుకల్ |
| పోయి సొల్ల పోరం |
మూలాలు
[మార్చు]- ↑ web master. "Bharyalu Jagratha (K. Balachandar) 1990". ఇండియన్ సినిమా. Retrieved 8 September 2022.