Jump to content

కె.బ్రహ్మానందం

వికీపీడియా నుండి
కాంచీభోట్ల బ్రహ్మానందం
జననం1953
ఏడుబాడు పర్చూరు మండలం,ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
మరణం2020 ఏప్రిల్ 6 (వయసు 66)
న్యూయార్క్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
పౌరసత్వంభారతదేశం
వృత్తిపాత్రికేయుడు
భార్య / భర్తఅంజన
పిల్లలుసుధామ, సుజన

కాంచీభోట్ల బ్రహ్మనందం (1953 - 2020 ఏప్రిల్ 6) అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసిన భారతీయ-అమెరికన్ పాత్రికేయుడు. [1] కంచిభొట్ల బ్రహ్మానందం ఇండియా అబ్రాడ్, న్యూస్-ఇండియా టైమ్స్, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ది ఇండియన్ పనోరమ పత్రికలకు రచయితగా పనిచేశాడు. [2]

జీవితం వృత్తి

[మార్చు]

కె. బ్రహ్మానందం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏడుబాడు గ్రామంలో జన్మించారు. [3]

1992లో, కె. బ్రహ్మానందం న్యూస్-ఇండియా టైమ్స్‌ పత్రికకు వ్యాపార సంపాదకడిగా పని చేస్తూ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లారు, తరువాత కె. బ్రహ్మానందం పలు ఆంగ్ల పత్రికలలో పనిచేశాడు. ఆంగ్ల పత్రికలలో ఆర్థిక శాఖ అంశాలపై వ్యాసాలు రాసేవాడు. కె. బ్రహ్మానందం తర్వాత ఇండియా వీక్లీ అనే పత్రికలో పనిచేయడం మొదలుపెట్టాడు, తరువాత ది అర్బన్ ఇండియన్, పత్రికలో పనిచేశాడు. రచయితగా కె. బ్రహ్మానందం పనిలో పులుల సంరక్షణ, రెస్టారెంట్ కార్మికులు, చిన్న వ్యాపారాలు 2000ల ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ బడ్జెట్‌పై విశ్లేషకుల అభిప్రాయాలు లాంటి అంశాలపై రచనలు రచించాడు.

యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI) న్యూస్ వైర్‌లో సీనియర్ కరస్పాండెంట్‌గా ఉన్నప్పుడు కె. బ్రహ్మానందం ఆసియా ఖండంలో ప్రసిద్ధిగాంచారు. తన అర్ధ-దశాబ్దపు పాత్రికేయ జీవితంలో , కె. బ్రహ్మానందం న్యూయార్క్ నగరం ఆర్థిక వ్యవస్థ దాని జాతి సంఘాలు అలాగే ఐక్యరాజ్యసమితిపై దృష్టి సారించే అంతర్జాతీయ వార్తల గురించి పత్రికలలో వ్యాసాలు రాశాడు.

మరణం

[మార్చు]

2020 మార్చి 28న, కె. బ్రహ్మానందం కరోనా వైరస్ సొకడంతో ఆసుపత్రిలో చేరాడు. కె. బ్రహ్మానందం కరోనా వైరస్ ఇతర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన 9 రోజుల తరువాత 2020 ఏప్రిల్ 6న చికిత్స పొందుతూ మరణించాడు. మరణించే నాటికి కె. బ్రహ్మానందం కు 66 సంవత్సరాలు. [4] [5]

కె. బ్రహ్మానందం కరోనా వైరస్ తో బాధపడుతూ మరణించడం పట్ల భారతదేశానికి చెందిన పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు. కె. బ్రహ్మానందం మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ, [6] భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, [7] అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, [8] ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి [9] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ సంతాపాన్ని తెలియజేశారు. కె. బ్రహ్మానందం మరణం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశాడు. [10]

కె. బ్రహ్మానందం మృతి పట్ల నరేంద్ర మోడీ సంతాపం తెలుపుతూ ఇలా వ్యాఖ్యానించాడు. [11] కె. బ్రహ్మానందం భారత్ అమెరికా మధ్య బంధం బలపడేందుకు కృషి చేశారు. ఆయన మరణం జర్నలిస్ట్ ప్రపంచానికి తీరని లోటు.

కె. బ్రహ్మానందం కు భార్య అంజన, కూతుళ్లు సుదామ, సృజన ఉన్నారు. కె. బ్రహ్మానందం కుటుంబ సభ్యులు అమెరికాలో నివసిస్తున్నారు.

డిసెంబర్ 2020లో, బ్రహ్మ్ కంచిభొట్ల స్కాలర్‌షిప్ కంచిభొట్ల బరూచ్ కళాశాలలో ప్రారంభించబడింది. [12]

  1. "AP CM condoles Indian-American journalists demise in NYC". outlookindia.com.
  2. "You will be missed, Brahm Kanchibhotla". 10 April 2020.
  3. "Brahmanandam Kuchibhotla from Prakasam district dies of coronavirus in USA." ap7am.com.
  4. "Indian-Americans mourn death of veteran journalist due to coronavirus". The Hindu. 8 April 2020.
  5. "Indian-American journo Brahm Kanchibotla dies of COVID-19 in New York". WION. 7 April 2020.
  6. Modi, Narendra (7 April 2020). "Deeply anguished by the passing away of Indian-American journalist Mr. Brahm Kanchibotla. He will be remembered for his fine work and efforts to bring India and USA closer. Condolences to his family and friends. Om Shanti".
  7. India, Vice President of (8 April 2020). "Deeply saddened to learn about the demise of Indian-American journalist, Mr Brahm Kanchibotla in New York. My condolences to the bereaved family members. May his soul rest in peace!".
  8. "Indian-Americans mourn death of veteran journalist". outlookindia.com.
  9. "AP CM condoles Indian-American journalist's demise in NYC". daijiworld.com.
  10. "Brahm Kanchibotla brought US and Southeast Asia closer: B'desh Information Min".
  11. "Coronavirus update: Deeply anguished, says PM Modi after Indian American journalist dies of Covid-19 in New York". Hindustan Times. 8 April 2020.
  12. "Brahm Kanchibhotla Scholarship". Baruch College Fund - CUNY. 10 December 2020.