కె. సురేంద్రన్
కె. సురేంద్రన్ | |
---|---|
భారతీయ జనతా పార్టీ, కేరళ యూనిట్ అధ్యక్షుడు | |
Assumed office 15 ఫిబ్రవరి 2020 | |
అంతకు ముందు వారు | పి. ఎస్. శ్రీధరన్ పిళ్లై |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఉల్లియేరి, కేరళ, భారతదేశం | 1970 మార్చి 10
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | షీబా కె. |
సంతానం | 2 |
నివాసం | కాసర్గోడ్, కేరళ |
కళాశాల | కాలికట్ విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
కున్నుమ్మల్ సురేంద్రన్ (జననం 1970 మార్చి 10) కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 11వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.[1][2][3][4][5]
2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఆయన వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నాడు. నిజానికి ఈ నియోజకవర్గం 2009 నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోట. అంటే, ఆ పార్టీ కీలక నేత, సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీపై తలపడనున్నాడు.[6]
ప్రారంభ జీవితం
[మార్చు]కె. సురేంద్రన్ కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఉల్లియేరిలో 1970 మార్చి 10న కుంజిరామన్, కళ్యాణి అమ్మలకు జన్మించాడు. ఆయన కోజికోడ్‌లోని జామోరిన్ గురువాయూరప్పన్ కళాశాల నుండి బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ పొందాడు. ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. తన రాజకీయ జీవితంలో ప్రారంభ సంవత్సరాల్లో, అతను డైరెక్టర్ నార్త్ మలబార్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ, ప్రెసిడెంట్, దేశ సేవా సాంస్కృతిక కేంద్రం, ఫౌండర్ డైరెక్టర్ బోర్డ్ మెంబరు నేషనల్ యువ కో-ఆపరేటివ్ సొసైటీ, అడ్వైజరీ బోర్డు సభ్యుడు నెహ్రూ యువకేంద్ర వంటి వివిధ పదవులను నిర్వహించాడు.[7] ఆయన కాసరగోడ్‌కు చెందిన స్థానిక ప్రజలతో మెరుగ్గా సంభాషించడానికి తుళు, కన్నడ భాషలు నేర్చుకున్నాడు.[8][9]
ఆయనకు షీబా కె.తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ 2009 అక్టోబర్‌లో నిరుద్యోగం, ప్రభుత్వ నియామకాలపై నిషేధాన్ని నిరసిస్తూ పాదయాత్రకు నాయకత్వం వహించాడు. ఆ సమయంలో, కేరళ సెక్రటేరియట్‌లోకి వెళ్లకుండా పోలీసులు బలవంతంగా అడ్డుకోవడంతో ఆయనతో పాటు పలువురు గాయపడ్డారు.[10] కేరళలో 2019 పార్లమెంటరీ పోటీలో, ఆయనను భారతీయ జనతా పార్టీ పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది.[11] ఈ నియోజకవర్గాన్ని భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన ఆంటో ఆంటోనీ(Anto Antony) గెలుపొందాడు. ఆ ఎన్నికల్లో, కె. సురేంద్రన్ కాంగ్రెస్, సీపిఐ(ఎం) అభ్యర్థుల తర్వాత మూడవ స్థానంలో నిలిచాడు.[12][13]
ఆయన 2020 ఫిబ్రవరి 15న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు.[14]
మూలాలు
[మార్చు]- ↑ "Surendran, the aggressive face of BJP in Kerala, appointed state president". The New Indian Express.
- ↑ "BJP appoints K. Surendran as its president in Kerala". The Week.
- ↑ Nair, N. j (15 February 2020). "Factionalism the main challenge". The Hindu – via www.thehindu.com.
- ↑ "Janmabhumi 17 JANUARY 2020, Sun, 16 Feb 20". Archived from the original on 17 February 2020. Retrieved 17 February 2020.
- ↑ "K Surendran assumes charge as Kerala BJP state chief; senior leaders of rival faction stay away". The New Indian Express.
- ↑ "రాహుల్ గాంధీపై బీజేపీ అస్త్రం.. ఎవరీ సురేంద్రన్? | Who Is K Surendran, BJP Choice From Wayanad to Fight Against Rahul Gandhi In Lok Sabha Polls? - Sakshi". web.archive.org. 2024-03-25. Archived from the original on 2024-03-25. Retrieved 2024-03-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Biodata of Mr. K. Surendran (BJP)", Kerala Assembly Election DATABASE, Government of Kerala, archived from the original on 3 ఏప్రిల్ 2016, retrieved 6 August 2016
- ↑ Amiya Meethal (20 March 2016), "BJP dreams of victory in Manjeswaram", Deccan Chronicle, retrieved 5 August 2016
- ↑ Shri K Surendran, BJP, archived from the original on 8 డిసెంబరు 2015, retrieved 5 August 2016
- ↑ "Yuva Morcha march turns violent – KERALA". The Hindu. 20 October 2009. Retrieved 25 July 2015.
- ↑ M.K, Nidheesh (23 March 2019). "BJP's K Surendran to contest from Kerala's Pathanamthitta". Mint.
- ↑ "Live Results: Pathanamthitta Lok Sabha Constituency (KERALA)". News18. Retrieved 2020-01-14.
- ↑ "2019 LS polls: Kerala BJP leader K Surendran to resubmit nomination papers today". The New Indian Express.
- ↑ "No Decision on 'Metroman' Sreedharan as BJP's CM Candidate in Kerala: Union Minister". The Wire. Retrieved 2021-03-18.