కె. సురేష్ కురుప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. సురేష్ కురుప్
కె. సురేష్ కురుప్


పదవీ కాలం
1 జూన్ 2011 (2011-06-01) – 24 మే 2021 (2021-05-24)
ముందు థామస్ చాజికడన్
తరువాత వి.ఎన్. వాసవన్
నియోజకవర్గం ఎట్టుమనూరు

పదవీ కాలం
1998 (1998) – 2009 (2009)
ముందు రమేష్ చెన్నితాల
తరువాత జోస్ కె. మణి
నియోజకవర్గం కొట్టాయం
పదవీ కాలం
1984 (1984) – 1989 (1989)
ముందు స్కరియా థామస్
తరువాత రమేష్ చెన్నితాల
నియోజకవర్గం కొట్టాయం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-25) 1956 మే 25 (వయసు 68)
కొట్టాయం , ట్రావెన్‌కోర్ రాష్ట్రం-కొచ్చిన్ (ప్రస్తుత కేరళ ), భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సీపీఎం
తల్లిదండ్రులు
  • కుంజన్ పిళ్లై
  • భారతి అమ్మ
జీవిత భాగస్వామి సావిత్రి నంపూతిరి
సంతానం 2
నివాసం కొట్టాయం
పూర్వ విద్యార్థి
  • CMS కళాశాల, కొట్టాయం
  • NSS హిందూ కళాశాల, చంగనస్సేరి
  • కేరళ లా అకాడమీ లా కాలేజీ, తిరువనంతపురం
మూలం [1]

కె. సురేష్ కురుప్ (జననం 25 మే 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొట్టాయం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా,[1] రెండుసార్లు ఎట్టుమనూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కురుప్ విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చి 1978 నుండి 1979 వరకు కేరళ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్‌ ఛైర్మన్‌గా, 1982 నుండి 1985 వరకు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొట్టాయం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 1989లో ఎన్నికలలో ఓడిపోయాడు.[3]

కురుప్ 1998, 1999, 2004 ఎన్నికలలో వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2011, 2016లో కేరళ శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఎట్టుమనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (3 March 2019). "Lok Sabha polls 2019: Kottayam awaits fierce battle" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
  2. "Kerala Legislative Assembly". 2024. Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
  3. The New Indian Express (26 April 2024). "Kerala: How an innovative LDF campaign withstood Indira Wave of 1984" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.