కేటుగాడు (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేటుగాడు
(2015 తెలుగు సినిమా)
దర్శకత్వం కిట్టు నల్లూరి
నిర్మాణం బాలసాని వెంకటేష్
తారాగణం తేజస్
చాందిని చౌదరి
సుమన్
రాజీవ్ కనకాల
సంగీతం సాయి కార్తీక్
ఛాయాగ్రహణం మల్హర్ భట్ జోషి
నిర్మాణ సంస్థ వెంకటేష్ మూవీస్
విడుదల తేదీ 18 సెప్టెంబర్ 2015
నిడివి 127 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కేటుగాడు 2015లో విడుదలైన తెలుగు సినిమా.వెంకటేష్ మూవీస్ పతాకంపై బాలసాని వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు కిట్టు నల్లూరి దర్శకత్వం వహించాడు. తేజస్, చాందిని చౌదరి, సుమన్, రాజీవ్ కనకాల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్నందించాడు.[1]

కథ[మార్చు]

చందు(తేజస్) ఓ కార్ల దొంగ. తనకు కనిపించిన కార్లన్నింటినీ కొట్టేసి తన స్నేహితుడు ప్రవీణ్ సహాయంతో అమ్మేస్తుంటాడు. ఓ కారు దొంగతనం చేసే ప్రయత్నంలోనే చందు, ఒక పార్టీలో అకిరా(చాందినీ)ను చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అకిరా అన్నయ్య బిజినెస్ మ్యాన్ ప్రకాష్ (రాజీవ్ కనకాల). వ్యాపార లావాదేవీల్లో అకిరా కిడ్నాప్ కు గురైతుంది. సొంత చెల్లెలినే ప్రకాష్ ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటాడు? ఈ కిడ్నాప్ కథ చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: వెంకటేష్ మూవీస్
 • నిర్మాత: బాలసాని వెంకటేష్
 • కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: కిట్టు నల్లూరి
 • సంగీతం: సాయి కార్తీక్
 • సమర్పణ: వీఎస్పీ తెన్నేటి
 • కెమెరా: మల్హర్ భట్ జోషి
 • ఎడిటర్: పాశం వి రావు
 • డైలాగ్స్:పి.రాజశేఖర్ రెడ్డి
  బాషా శ్రీ
 • పాటలు:కాసర్ల శ్యామ్
  శ్రీమణి
  బాలాజీ
  సుబ్బరాయ శర్మ
  బాషా శ్రీ
 • ఫైట్స్: నందు

మూలాలు[మార్చు]

 1. Sakshi (28 July 2015). "తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్". Sakshi. Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.
 2. The Times of India (18 September 2015). "Ketugadu Movie Review {2/5}: Critic Review of Ketugadu by Times of India". Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.
 3. Tupaki (18 September 2021). "Ketugadu Review | Ketugadu movie Review". tupaki. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)