చాందిని చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాందిని చౌదరి
Chandini Chowdary.jpg
జననంచాందిని చౌదరి
(1991-10-23) 1991 అక్టోబరు 23 (వయస్సు: 28  సంవత్సరాలు)
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లుచాందిని
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2015–ప్రస్తుతం

చాందిని చౌదరి తెలుగు చలనచిత్ర నటి. లఘుచిత్రాలలో నటించిన చాందిని, కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

చాందిని చౌదరి 1991, అక్టోబరు 23న విశాఖపట్టణంలో జన్మించింది. విద్యాభ్యాసమంతా బెంగళూరులో పూర్తిచేసింది.[1]

సినీరంగ ప్రస్థానం[మార్చు]

బెంగళూరులో చదువుతున్న సమయంలోనే లఘచిత్రాలలో నటించింది. ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ అవ్, రోమియో జూలియట్ వంటి లఘచిత్రాలు చాందినికి గుర్తింపునిచ్చాయి.[1]

2013లో వచ్చిన మధురం లఘచిత్రంలో చాందిని నటనను చూసిన ముళ్ళపూడి వరా, కె.రాఘవేంద్రరావులు కుందనపు బొమ్మ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది.[2]2015లో కేటుగాడు చిత్రంతో తెలుగు చలన చిత్ర తెరకు పరిచయం అయ్యింది. 2018లో నటించిన మను చిత్రంలో నీలా పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ తరువాత కేటుగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన చాందిని బ్రహ్మోత్సవం, శమంతకమణి సినిమాలలో కూడా నటించింది.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2012 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తెలుగు
2013 ప్రేమ ఇష్క్ కాదల్ తెలుగు
2015 కేటుగాడు అకిరా తెలుగు
2016 బ్రహ్మోత్సవం[3] ఆనంద వల్లి తెలుగు ప్రత్యేక పాత్ర
2016 కుందనపు బొమ్మ సుచి తెలుగు
2017 శమంతకమణి[4] మధు తెలుగు
2017 లై ప్రత్యేక పాత్ర
2018 హౌరా బ్రిడ్జ్ స్వీటీ తెలుగు
2018 మను నీలా తెలుగు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 justbollywood. "Chandini Chowdary". www.justbollywood.in. Archived from the original on 1 జూన్ 2017. Retrieved 16 June 2017.
  2. సినీజోష్. "సినీజోష్ ఇంటర్వ్యూ: చాందిని చౌదరి". www.cinejosh.com. Archived from the original on 10 అక్టోబర్ 2017. Retrieved 16 June 2017.
  3. టాలీవుడ్ టైమ్స్. "మహేష్ బాబుతో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్". www.tollywoodtimes.com. Archived from the original on 17 ఆగస్టు 2018. Retrieved 16 June 2017.
  4. ఇండియా గ్లిట్జ్. "మల్టీస్టారర్ లో చాందిని చౌదరి..." /www.indiaglitz.com. Retrieved 16 June 2017.