కొండకల్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండకల్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ
Typeప్రైవేటు
పరిశ్రమరైలు
స్థాపనజూన్ 22, 2023; 9 నెలల క్రితం (2023-06-22)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంకొండకల్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
Areas served
భారతదేశం
Productsరోలింగ్ స్టాక్
Production output
500 కోచ్‌లు, 50 లోకోమోటివ్‌ (ప్రతి సంవత్సరం)
Ownerమేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్
తెలంగాణ ప్రభుత్వం
Number of employees
1058 (2023)

కొండకల్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో ఉన్న రైల్వేకోచ్ ఫ్యాక్టరీ.[1] 150 ఎకరాల స్థలంలో దేశంలోనే అతిపెద్దగా నిర్మించిన ఈ ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్‌లు ఉత్పత్తి కానున్నట్లు, ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.[2]

ప్రతిపాదన[మార్చు]

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీమేరకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్ర ప్రభుత్వం హామీని నేరవేర్చలేదు.[3] చివరకు, తెలంగాణలో ఒక ప్రైవేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని స్థాపించడానికి 2017లో మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.[2]

శంకుస్థాపన[మార్చు]

2020 ఆగస్టు 13న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామరావు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాడు.

ప్రారంభం[మార్చు]

రైల్‌ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా 1000 కోట్ల రూపాయలతో మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్విస్‌ రైల్వే వెహికిల్స్‌ తయారీదారు స్టాడ్లర్‌ రైల్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని 2023, జూన్ 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.[4] రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీకి రిబ్బన్‌ కట్‌చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎలక్ట్రిక్‌ బగ్గీలో ప్రయాణం చేస్తూ ఫ్యాక్టరీలో చేపట్టిన పనులను, సాంకేతికతను స్వయంగా పరిశీలించాడు. అనంతరం మేధా సంస్థ ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని సంస్థ ప్రతినిధులను, ఉద్యోగులను అభినందించాడు.

ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌అలీ, కేటీఆర్‌, టి. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సి.హెచ్. మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

ఉత్పత్తి, ఉపాధి[మార్చు]

ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదించిన పెట్టుబడి 805 కోట్ల రూపాయలుకాగా, తొలిదశలో దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేధా మేనేజింగ్ డైరెక్టర్ కశ్యప్ రెడ్డి తెలిపాడు. 1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయబడిన ఈ ప్రైవేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ సంవత్సరానికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్‌ల ఉత్పత్తి అవుతాయి. 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కర్మాగారం కోచ్‌లు, రైలు సెట్లు, లోకోమోటివ్‌లు, మెట్రో రైళ్ళఉ, మోనోరైల్‌లతో సహా అన్ని రకాల రైల్వే రోలింగ్ స్టాక్‌లను అభివృద్ధి చేస్తుంది.

ప్రారంభంనాటికి 558 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగా, అదనంగా మరో 500 మందికి పరోక్షంగా లబ్ధి పొందగా, భవిష్యత్తులో మరో 1,000 మందికి అదనంగా ఉపాధి కల్పించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.[2]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2023-06-23). "రంగారెడ్డి సిగలో.. మరో మణిహారం". www.ntnews.com. Archived from the original on 2023-06-23. Retrieved 2023-07-26.
  2. 2.0 2.1 2.2 "India's largest private rail coach factory opens in Telangana". Business Insider. 2023-06-22. Archived from the original on 2023-06-22. Retrieved 2023-07-26.
  3. Today, Telangana (2023-06-22). "CM KCR inaugurates Medha Rail Coach Factory at Kondakal". Telangana Today. Archived from the original on 2023-06-22. Retrieved 2023-07-26.
  4. "India's largest private rail coach factory inaugurated in Telangana's Kondakal village". Financialexpress (in ఇంగ్లీష్). 2023-06-23. Archived from the original on 2023-06-24. Retrieved 2023-07-26.
  5. telugu, NT News (2023-06-23). "Railway Coach Factory | మన గడ్డపై రైలుకు ఊపిరి.. కొండకల్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ రంగ కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-23. Retrieved 2023-07-26.