కొంపెల్ల మాధవీలత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంపెల్ల మాధవీలత
జననం
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థకోఠి మహిళా కళాశాల,
నిజాం కాలేజీ, హైదరాబాదు
వృత్తివ్యాపారవేత్త, రాజకీయవేత్త, సంఘసేవకురాలు
జీవిత భాగస్వామివిశ్వనాథ్‌ కొంపెల్ల
పిల్లలు3, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు

కొంపెల్ల మాధవీలత తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ వ్యవస్థాపకురాలు. ఆమె హైదరాబాదు లోని విరించి హాస్పిటల్స్‌ కు చైర్‌ పర్సన్‌ గా వ్యవహరిస్తోంది.[1]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్లో జన్మించింది. ఆమె కోఠి మహిళా కళాశాలలో అనంతరం నిజాం కాలేజీలో విద్యాభ్యాసం చేసింది. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తిచేసింది. ఆమె భరతనాట్యం, వీణ, గానం వంటి కళలలో ప్రావీణ్యం ఉంది.[2]

కుటుంబం[మార్చు]

ఆవిడ కుటుంబీకులు కాశ్యపస గొత్రానికి చెందిన కోనసీమ వైదికి వెలనాటీయ బ్రాహ్మణులు.

గృహిణి, వ్యాపార నిర్వహణ[మార్చు]

కంప్యూటర్‌ కోర్సులు చేసిన ఆమె కొంతకాలం మధు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ పేరిట ఒక సంస్థను నడిపించింది. ఐటీ కంపనీ విరించి సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్ అధినేత విశ్వనాథ్‌ కొంపెల్లని ఆమె వివాహం చేసుకుంది. వారిద్దరు కలిసి విరించి హాస్పిటల్స్‌, వివో బయోటెక్‌, అమెరికాలో ‘క్యూ ఫండ్‌’ అనే ఫిన్‌ కార్ప్‌ సంస్థ ఇలా వివిధ రంగాల్లో పలు సంస్థలు నిర్వహిస్తున్నారు. అలాగే, వారు లోపాముద్ర ట్రస్ట్‌ ని స్థాపించి[3] సేవాకార్యక్రమాలు సైతం చేస్తున్నారు.[4]

వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. మొదటి సంతానం లోపాముద్ర, ఈమెను 9వ యేట వరకు బడికి పంపలేదు. మాధవీలత ఈమని ఇంటిపట్టునే చదివిపించేది. 14 ఏళ్ల ప్రాయంలోనే లోపాముద్ర చెన్నైలోని ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించింది. అంతేకాదు, ఐఐటీలో ప్రవేశం పొందిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచిపోయింది. ఇక మాధవి, విశ్వనాథ్‌ దంపతుల రెండో సంతానం రామకృష్ణ పరమహంస కూడా చెన్నై ఐఐటీలోనే సీటు సాధించాడు.

రాజకీయవేత్త[మార్చు]

2024 భారత సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాదు లోక్‌సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలత పోటీచేయనుంది.[5] తొలి నాళ్లలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానం 1984 నుంచి ఇప్పటి వరకు ఎంఐఎం చేతిలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "ఓటమి ఎరుగని అసద్‌పై మాధవీలత పోటీ.. ఎవరీమె, బ్యాగ్రౌండ్ ఏంటి..?". Samayam Telugu. Retrieved 2024-03-04.
  2. telugu, NT News (2021-12-10). "పిల్ల‌ల‌ను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్‌ప‌ర్సన్ స్వీయ అనుభ‌వం ఏంటంటే." www.ntnews.com. Retrieved 2024-03-04.
  3. telugu, NT News (2023-05-24). "బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌!". www.ntnews.com. Retrieved 2024-03-04.
  4. "బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌!-Namasthe Telangana". web.archive.org. 2024-03-02. Archived from the original on 2024-03-02. Retrieved 2024-03-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Hyderabad BJP MP candidate: హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత.. ఒవైసీ కోటను బద్దలు కొట్టనుందా..?". web.archive.org. 2024-03-02. Archived from the original on 2024-03-02. Retrieved 2024-03-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)