కోటిగాడు
కోటిగాడు (1986 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
తారాగణం | అర్జున్, రాధిక, మహాలక్ష్మి |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | జయకృష్ణ కంబైన్స్ |
భాష | తెలుగు |
కోటిగాడు 1986,జూన్ 12న విడుదలైన తెలుగు సినిమా. పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జయకృష్ణ కంబైన్స్ బ్యానర్‌పై డి.ఎన్.ప్రసాద్ నిర్మించాడు.[1] ఈ సినిమా పగల్ నిలవు అనే తమిళ సినిమాకు రీమేక్. ఇదే తమిళ సినిమా పగలే వెన్నెల పేరుతో 1989లో డబ్ చేయబడింది.
నటీనటులు[మార్చు]
- అర్జున్ - కోటి
- రాధిక - తులసి
- మహాలక్ష్మి - జ్యోతి
- శరత్ బాబు - పోలీస్ ఇన్‌స్పెక్టర్
- చరణ్రాజ్ - రాయుడు
- సుధాకర్
- సుత్తి వేలు
- వినోద్
- సుత్తి వీరభద్రరావు
- నిర్మల
- శ్రీలక్ష్మి
సాంకేతికవర్గం[మార్చు]
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.ఎన్.రామచంద్రరావు
- మాటలు: త్రిపురనేని మహారథి
- పాటలు: వేటూరి
- సంగీతం: జె.వి.రాఘవులు
- ఛాయాగ్రహణం: బి.కోటేశ్వరరావు
- నృత్యాలు: శ్రీనివాస్
- స్టంట్స్: జూడో రత్నం
- కూర్పు: వెంకటరత్నం - శ్యాం
కథ[మార్చు]
రాయుడు ఆ ఊరిలో పలుకుబడి కలిగిన ధనవంతుడు. ఆయన మాటలకు తిరుగులేదు. అయితే పేదలను దోచుకోవడం, వారిని బానిసలుగా చూడటం, రౌడీలచేత కొట్టించడం, స్మగ్లింగ్ అతని వ్యాపార లక్షణం. జనం భయంతోనో, గౌరవంతోనో నోరుమూసుకుని పడి ఉంటారు. కోటి ఆయన సేవకుడు. నిజాయతీపరుడు. పోలీసు అధికారి చెల్లెలు జ్యోతిని ప్రేమిస్తాడు. కానీ ఆ అధికారికి ఈ ప్రేమ నచ్చదు. ఆయన తులసి అనే అమ్మాయికి మనసిచ్చాడు. ఆమె ఏనాడో రాయుడి పెద్దకుమారుడి చేత చెరచబడి తన నాట్యకళకు స్వస్తి చెప్పింది. రాయుడు కుతంత్రాలకు పోలీస్ ఇన్‌స్పెక్టర్ బలైపోతాడు. మరో పోలీస్ కానిస్టేబుల్ మోసానికి గురై బందీ అవుతాడు. ఈ ఆటంకాలు దాటుకుని నిజాలు తెలుసుకున్న మరుక్షణం కోటి విజృంభిస్తాడు. జనం తిరుగుబాటు చేస్తారు. రాయుడు గత్యంతరం లేని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటాడు. అతని కొడుకులు ఇద్దరూ పోలీసులకు చిక్కుతారు.[2]
పాటలు[మార్చు]
ఈ సినిమాలోని పాటలను వేటూరి రచించగా జె.వి.రాఘవులు సంగీతం సమకూర్చాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకుడు(లు) | నిడివి |
---|---|---|---|
1. | "మళ్ళీ మళ్ళీ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
2. | "వైదేహీ రాముల" | ఎస్.జానకి | |
3. | "రారాదా ప్రేయసీ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
4. | "మసకల్లో మల్లెచెండు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
5. | "నీ కోసమే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ |
మూలాలు[మార్చు]
- ↑ వెబ్ మాస్టర్. "Kotigadu (P.N. Ramachandra Rao) 1986". ఇండియన్ సినిమా. Retrieved 16 November 2022.
- ↑ డి.కె.ఎం. "యజమానికి ఎదురుతిరిగిన "కోటిగాడు"" (PDF). ఆంధ్ర పత్రిక. No. 19 June 1986. Retrieved 16 November 2022.