కోడూరి కౌసల్యాదేవి
స్వరూపం
కోడూరి కౌసల్యాదేవి (ఆరికెపూడి కౌసల్యాదేవి) సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.
జననం
[మార్చు]ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో 'దేవాలయం' అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 25వ యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.
రచనలు
[మార్చు]నవలలు
[మార్చు]- అనామిక
- అనిర్వచనీయం
- కల్పతరువు
- కల్పవృక్షం
- కళ్యాణమందిర్
- చక్రభ్రమణం[1]
- చక్రనేమి
- చక్రవాకం
- జనరంజని
- తపోభూమి
- ధర్మచక్రం
- దిక్చక్రం
- దివ్యదీపావళి
- నెమలికనులు
- నందనవనం
- నివేదిత
- పసుపుతాడు
- పెళ్ళి ఎవరికి?
- పూజారిణి
- ప్రేమనగర్
- బదనిక
- బృందావనం
- భాగ్యచక్రం
- మార్గదర్శి
- మోహన మురళి
- శంఖుతీర్థం
- శాంతినికేతన్
- శిలలు - శిల్పాలు
- సంసారచక్రం
- సత్యం శివం సుందరం
- సుదక్షిణ
- సూర్యముఖి
- సౌభాగ్యలత
- స్వయంసిద్ధ
- హైందవి
కథాసంపుటాలు
[మార్చు]- ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కథలు
- సుప్రభాతం
- కల్పన
- తీయనిశాపం
- శోభకృతు
- విద్య
- చెట్టూ - ఛాయా
కథలు
[మార్చు]- 1+1=?
- అందని ద్రాక్షపళ్లు
- అమ్మమ్మగారూ - ఆపిల్ చెట్టూ
- ఆశాకిరణాలు
- ఆశ్రయబంధం
- ఈనాటి సమస్య
- ఊహానందం
- కదంబమాల
- కర్తవ్యం
- కల్పన
- కాత్యాయని
- గాడిదలూ...
- గురువిందగింజలు
- చక్కనీరాజమార్గముండగా
- చిగురుటాకులు
- చుక్కాని
- చెట్టూ-ఛాయా
- తపోవనం
- తీయని బాధ
- తీయనిశాపం
- దీపావళి
- దూరపు కొండలు
- దేవాలయం
- నవనీత
- నారీ ధర్మం
- పంకజం
- పరంపర
- పరిత్యక్త
- పరిశోధన
- పిల్లలూ దేవుడూ చల్లనివారే
- పిల్లిమెడలోగంటకట్టేదెవరు?
- పేరూ ప్రఖ్యాతీ
- ప్రమిద
- భవిష్యత్కవిత
- మలయపవనాలు
- మాయ
- మేడిపండు
- లౌకికులు
- శోభకృతు
- శ్రీనివాస కల్యాణం
- సంకెళ్లు
- సంపదా-సంస్కారమా
- సుప్రభాతం
- స్త్రీ విద్య
- స్థాయీ భేదం
పురస్కారాలు
[మార్చు]- 1961 - ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి
- 1967 - గృహలక్ష్మి స్వర్ణకంకణము
మూలాలు
[మార్చు]- ↑ కౌసల్యాదేవి, కోడూరి (1964). చక్రభ్రమణం. Vijayawada: Sarvodaya Publishers,. Retrieved 2020-07-11.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link)