Jump to content

క్లోరిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
క్లోరిక్ ఆమ్లం
Chloric acid
Chloric acid
పేర్లు
ఇతర పేర్లు
Chloric(V) acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7790-93-4]
SMILES O=Cl(=O)O
ధర్మములు
HClO3
మోలార్ ద్రవ్యరాశి 84.45914 g mol−1
స్వరూపం colourless solution
సాంద్రత 1 g/mL, solution (approximate)
>40 g/100 ml (20 °C)
ఆమ్లత్వం (pKa) ca. −1
నిర్మాణం
pyramidal
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Oxidant, Corrosive
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
ammonium chlorate
sodium chlorate
potassium chlorate
సంబంధిత సమ్మేళనాలు
hydrochloric acid
hypochlorous acid
chlorous acid
perchloric acid
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

క్లోరిక్ ఆమ్లం అనునది క్లోరిన్ యొక్క ఆక్సోఆమ్లం.ఇది క్లోరేట్ లవణాల ఉత్పత్తికి పూర్వగామి (precursor).క్లోరిక్ ఆమ్లం బలమైన ఆమ్లం (pKa ≈ −1).క్లోరిక్ ఆమ్లం ఆక్సీకరణ కారకం.క్లోరిక్ ఆమ్లం రసాయానిక ఫార్ములా HClO3.క్లోరిన్,హైడ్రోజన్, ఆక్సిజన్ మూలక పరమాణు సంయోగం వలన క్లోరిక్ ఆమ్లం ఏర్పడినది.

భౌతిక ధర్మాలు

[మార్చు]

భౌతిక స్థితి

[మార్చు]

క్లోరిక్ ఆమ్లం రంగులేని ద్రావణం[1]. క్లోరిక్ ఆమ్లం యొక్క అణుభారం 84.45914 గ్రాములు/మోల్−1.[2]

సాంద్రత

[మార్చు]

25°Cసాధారణ ఉష్ణోగ్రత వద్ద సాంద్రత 1.2గ్రాం/మి.లీ.[3] ఒక మి.లీ ద్రావణం బరువు ఒక గ్రాము,అందాజుగా.

ద్రావణీయత

[మార్చు]

నీటిలో ద్రావణీయత >40గ్రాములు/100 మి.లీలో,20 °C) వద్ద.

అణుసౌష్టవం

[మార్చు]

క్లోరిక్ ఆమ్లం అణువు పిరమిడ్ ఆకృతి అణుసౌష్టవం పొంది ఉంది.

రసాయన చర్యలు

[మార్చు]

క్లోరిక్ ఆమ్లం తాపగతి శాస్త్రీయముగా (thermodynamically) అస్థిరమైనది. క్లోరిక్ ఆమ్లం 30% గాఢత వరకు చల్లని జలసంబంధమైన ద్రావణంలలో స్థిరత్వాన్ని కల్గి ఉంది. తగ్గించబడిన వత్తిడివద్ద, తగు జాగ్రత్తలు తీసుకొని, ద్రావణాన్నిబాష్పీకరణ (evaporation) కావించడం వలన 40% గాఢత ఉన్న క్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పతి చేయవచ్చును.40% గాఢత మించినచో,ఉష్ణోగ్రత 40 °C దాటినచో క్లోరిక్ ఆమ్లం ద్రావణం వియోగం చెంది,పలురకాల ఉత్పాదికలు ఏర్పడును.[1] ఉదాహరణకు:

8HClO3 → 4HClO4 + 2H2O + 2Cl2 + 3 O2
3HClO3 → HClO4 + H2O + 2 ClO2

ఉత్పత్తి

[మార్చు]

సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బేరియం క్లోరేట్ రసాయన చర్య వలన క్లోరిక్ ఆమ్లం, బేరియం సల్ఫేట్ ఏర్పడును. ఏర్పడిన ఉత్పాదిత మిశ్రమం నుండి అద్రావణ బేరియం సల్ఫేట్ ను తొలగించి, క్లోరిక్ ఆమ్లాన్ని వేరు చేయుదురు.

Ba(ClO3)2 + H2SO4 → 2HClO3 + BaSO4

మరొక ఉత్పత్తి ప్రక్రియలో హైపోక్లోరస్ఆమ్లాన్ని వేడి చెయ్యడం వలన క్లోరిక్ ఆమ్లం, హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడును.

3HClO → HClO3 + 2 HCl

ఇబ్బందులు

[మార్చు]

క్లోరిక్ ఆమ్లం శక్తి వంతమైన ఆక్సీకరణ కారకం[1]. అందువల పలు సేంద్రియ పదార్థాలను,మండే స్వభావమున్న పదార్థాలతో సంపర్కంవలన, వాటిని మండించి కాల్చిబూడిదచేయును (deflagrate).

ఇవికూడా చూడండి

[మార్చు]
  • క్లోరిక్ ఆమ్లం

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "chlorate". infoplease.com. Retrieved 2016-03-21.
  2. "CHLORIC ACID". chemspider.com. Retrieved 2016-03-21.
  3. "CHLORIC ACID". chemicalbook.com. Retrieved 2016-03-21.