బేరియం సల్ఫేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేరియం సల్ఫేట్
Chemical structure of barium sulfate
3D model of barium sulfate
3D model of barium sulfate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7727-43-7]
పబ్ కెమ్ 24414
యూరోపియన్ కమిషన్ సంఖ్య 231-784-4
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య CR060000
ATC code V08BA01
SMILES [Ba+2].[O-]S([O-])(=O)=O
  • InChI=1/Ba.H2O4S/c;1-5(2,3)4/h;(H2,1,2,3,4)/q+2;/p-2

ధర్మములు
BaSO4
మోలార్ ద్రవ్యరాశి 233.43 g/mol
స్వరూపం white crystalline
వాసన odorless
సాంద్రత 4.49 g/cm3
ద్రవీభవన స్థానం 1,580 °C (2,880 °F; 1,850 K)
బాష్పీభవన స్థానం 1,600 °C (2,910 °F; 1,870 K) (decomposes)
0.0002448 g/100 mL (20 °C)
0.000285 g/100 mL (30 °C)
Solubility product, Ksp 1.0842 × 10−10 (25 °C)
ద్రావణీయత insoluble in alcohol,[1] soluble in concentrated sulfuric acid
వక్రీభవన గుణకం (nD) 1.636 (alpha)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
orthorhombic
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−1465 kJ·mol−1[2]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
132 J·mol−1·K−1[2]
Pharmacology
Bioavailability negligible orally
Excretion rectal
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
జ్వలన స్థానం {{{value}}}
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 15 mg/m3 (total) TWA 5 mg/m3 (resp)[3]
REL (Recommended)
TWA 10 mg/m3 (total) TWA 5 mg/m3 (resp)[3]
IDLH (Immediate danger)
N.D.[3]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బేరియం సల్ఫేట్ఒక రసాయనిక సమ్మేళన పదార్థం. బేరియం సల్ఫేట్ ఒక అకర్బన సంయోగ పదార్థం.ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా BaSO4.

భౌతిక లక్షణాలు[మార్చు]

బేరియం సల్ఫేట్ తెల్లని స్పటికాకార ఘనపదార్థం. ఇది వాసన లేనటు వంటి సంయోగ పదార్థం. ఈ సమ్మేళన పదార్థం నీటిలో కరుగదు. కాని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరుగుతుంది.అణుభారం 233.43 గ్రాములు/మోల్.బేరియం సల్ఫేట్ యొక్క సాంద్రత 4.49 గ్రాములు/సెం.మీ3. బేరియం సల్ఫేట్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 1580 °C. ఈ అకర్బన సమ్మేళన పదార్థం యొక్క మరుగు లేదా భాష్ఫీభవనస్థానం 1600 °C, అయితే ఈ ఉష్ణోగ్రత వద్ద బేరియం సల్ఫేట్ వియోగం చెందుతుంది.ప్రకృతిలో బేరియం సల్ఫేట్ పదార్థం బెరైట్ (barite) అను ఖనిజంగా లభిస్తుంది. బేరియం మూలకం ఉత్పత్తికి ఈ బెరైట్ ఖనిజమే మూల వనరు. బేరియం సల్ఫేట్ యొక్క అణు సౌష్టవం ఆర్థోరోంబిక్ రూపం.

ఉత్పత్తి[మార్చు]

ప్రస్తుతం వినియోగిస్తున్న బేరియం అంతయు బేరైట్ ఖనిజంనుండి ఉత్పత్తి చెయ్యబడినదే అనిచెప్పవచ్చు. బేరైట్ నుండి ఉత్పత్తి చెయ్యబడు బేరియం తరచుగా పూర్తిగా నాణ్యమైనది కాదు. బేరైట్‌ను కార్బో థెర్మల్ క్షయికరణ కోక్ తో వేడి చెయ్యడం) కావించిన బేరియం సల్ఫైడ్ ఏర్పడును.

BaSO4 + 4 C → BaS + 4 CO

బేరియం సల్ఫేట్‌కు భిన్నంగా, బేరియం సల్ఫైడ్ నీటిలో కరిగే స్వభావం కలిగి ఉండి, సులభంగా ఆక్సైడ్, కార్బోనేట్, హాలైడులుగా పరివర్తింప బడును.బేరియం సల్ఫైడ్ లేదా బేరియం క్లోరైడ్ ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో లేదా సల్ఫేట్ లవణాలతో చర్య జరపడం వలన ఎక్కువ శుద్ధమైన బేరియం సల్ఫేట్ ఉత్పత్తి అగును.

BaS + H2SO4 → BaSO4 + H2S

పైన పేర్కొన్న విధానంలో ఉత్పత్తి చేసిన బేరియం సల్ఫేట్‌ను బ్లాంక్ ఫిక్స్ (blanc fixe) అంటారు, ఈ మాటకు ఫ్రెంచ్‌లో శాశ్వితతెలుపు అని అర్థం .

పరిశోధనశాలలో సల్ఫేట్ లవణాలను, బేరియం ఆయానులను కలిగిన ద్రావణాలను కలపడం ద్వారా బేరియం సల్ఫైట్ తయారు చెయ్యుదురు.సల్ఫేట్ లవణాలలో తక్కువ విష స్వభావం, బేరియం సల్ఫేట్కు ఇది నీటిలో కరగక పోవటంచే కలిగినది.నీటిలో ద్రావణియత లేని/కరుగని సల్ఫేట్ లవణాలలో బేరియం సల్ఫేట్ మొదటి స్థానం ఆక్రమిస్తుం దనవచ్చును.

దీనియొక్క తక్కువ ద్రావణీయత ఆధారంగా బేరియం సల్ఫేట్ అకర్బన పదార్థాల గుణాత్మకవిశ్లేషణ (qualitative inorganic analysis) లో బేరియం+2 ఆయానులను, సల్ఫెట్లను గుర్తించుటకు ఉపయోగిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

డ్రిల్లింగ్ ఫ్లుయిడ్‌గా[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అగుచున్నబేరియం సల్ఫేట్‌లో 80%ను నూనెబావుల డ్రిల్లింగ్ లిక్విడ్ తయారీలో ఒక పదార్థఅంశముగా ఉపయోగిస్తారు.బేరియం సల్ఫేట్ నూనె బావుల డ్రిల్లింగ్ లిక్విడ్‌ల సాంద్రత గాఢతను పెంచును.

వర్ణకము/రంగుల తయారి[మార్చు]

రంగుల తయారిలో తెల్లని రంగు తయారీలో బేరియం సల్ఫేట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా తైల చిత్ర రంగులు/ ఆయుల్ పెయింట్‌లలో బేరియం సల్ఫేట్ పారదర్శకంగా ఉండటంవలన దీనిని, పూరకం/ఫిల్లర్ (filller) గా ఉపయోగిస్తారు.జింకు సల్ఫైడ్, బేరియం సల్ఫేట్‌లమిశ్రమ అకర్బన రంగును లిథో పోన్ (lithopone) అంటారు.

కాగితం నిగారింపు[మార్చు]

barytaఅనబడు బేరియం సల్ఫేట్‌ను పొటోగ్రఫీలో పోటోగ్రఫీ పేపరులకు ఆధారభాగపు మొదటిపూతగా ఉపయోగిస్తారు.దీని వలన చిత్రం/యొక్క మననశీలత ( reflectiveness) పెరుగుతుంది.జర్మనీలో,1884 లో మొదట పోటోగ్రఫీ పేపరు పూతగా వాడారు.ఈ మధ్యకాలంలో ఇంక్ –జెట్ ప్రింటింగ్‌కు ఉపయోగించు కాగితం ప్రకాశవంతంగా కన్పించునట్లు చెయ్యుటకు బేరియం సల్ఫేట్ / baryta ను ఉపయోగిస్తున్నారు.

ప్లాస్టిక్ పూరకం[మార్చు]

పాలి ప్రోపైలిన్, పాలిస్టేరిన్ ప్లాస్టిక్‌ల తయారిలో 70% వరకు బేరియం సల్ఫేట్‌ను పూరకపదార్థంగా ఉపయోగిస్తారు. బేరియం సల్ఫేట్ ప్లాస్టికుల ఆమ్ల, క్షారాల ప్రభావ నిరోధక/ప్రతిబంధక శక్తిని పెంచుతుంది.

రేడియోకాంట్రాస్ట్ కారకం[మార్చు]

డయాగ్నొస్టిక్ క్లినిక్‌లలో X-కిరణాల చిత్ర చిత్రీకరణలో బేరియం సల్ఫేట్ ద్రావణాన్ని రేడియోకాంట్రాస్ట్ కారకంగా (Radiocontrast agent) ఉపయోగిస్తారు. బేరియం సల్ఫేట్ ద్రావణాన్నితరచుగా GI Tract ను చిత్రీకరించుటకు ఉపయోగిస్తారు.ఇలాఉపాయోగించు ద్రావణాన్ని బేరియం మీల్ అంటారు. X-రే చిత్ర చిత్రీకరణకు ముందు దీనిని జీర్ణ వ్యవస్థ లోకి నోటి ద్వారా లేదా ఎనేమా ద్వారా పంపెదరు.

ఇతర సముచిత ఉపయోగాలు[మార్చు]

భుసార పరీక్షలలో నేల యొక్క pH ని పరీక్షించడంలో బేరియం సల్ఫేట్‌ను వినియోగిస్తారు.బేరియం సల్ఫేట్‌ను ఇంకా బ్రేక్ లైనింగ్, అనకౌస్టింగు ఫోమ్సు (anacoustic foams, పౌడర్ కోటింగ్, రూట్ కెనాల్ ఫిల్లింగ్‌లో ఉపయోగిస్తారు.colorimetry లో కాంతి జనక మూలకాన్ని కొలమానం చెయ్యునప్పుడు బేరియం సల్ఫేట్ ను డిఫ్యుజర్ గా ఉపయోగిస్తారు. లోహాలను పోత పోయునప్పుడు, పోత అచ్చులకు లోహం అతుక్కోకుండఉండు టకై బేరియం సల్ఫేట్ ను అచ్చులకులోపలి భాగంలో పూతగా ఉపయోగిస్తారు.

బాణ సంచా[మార్చు]

బేరియం సమ్మేళనాలను దహించు నప్పుడు పచ్చని కాంతిని ప్రసరిస్తాయి. అందువలన బేరియం సల్ఫేట్‌ను కూడా బాణసంచా తయారీలో ఉపయోగిస్తారు,

రాగి పరిశ్రమలో వినియోగం[మార్చు]

బేరియం సల్ఫేట్ ఎక్కువ దహన స్థానం కలిగి ఉండటం, నీటిలో కరగక పోవటం వంటి ధర్మాల కారణంగా రాగి ఆనోడ్ పలకలను పోతలో పై పూతగా ఉపయోగిస్తారు. రాగి ఆనోడ్ పలకలను రాగి అచ్చులో పోత పోస్తారు, పోత సమయంలో ఘనరాగి అచ్చుకు ద్రవ రాగి అతుక్కొకుండగా నీటిలో కలియబెట్టబడిన బేరియం సల్ఫేట్‌ను పూతగా అచ్చుకు పూస్తారు.

భద్రత ప్రమాణాలు[మార్చు]

నీటిలోకరిగే గుణం/ద్రావనియతకలిగిన బేరియం లవణాలు తగుమాత్రంగా మానవులకు హానికరమైనప్పటికి, బేరియం సల్ఫేట్‌కు నీటిలో కరిగే గుణం లేనందున, హానికారి కాదు. Occupational Safety and Health Administration వారి ప్రకారం ఈ సమ్మేళన ప్రభావానికి గురైన, ప్రమాద రహితమితి 15 మి.గ్రాములు/మీ3. National Institute for Occupational Safety and Health సంస్థ వారి సిఫారసు ప్రకారం 10 మి.గ్రాములు/మీ3.దాటరాదు.

మూలలు[మార్చు]

  1. CRC Handbook of Chemistry and Physics (85th ed.). CRC Press. 2004. pp. 4–45. ISBN 0-8493-0485-7.
  2. 2.0 2.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. ISBN 0-618-94690-X.
  3. 3.0 3.1 3.2 3.3 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0047". National Institute for Occupational Safety and Health (NIOSH).