బేరియం నైట్రేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేరియం నైట్రేట్
barium nitrate
పేర్లు
ఇతర పేర్లు
Barium dinitrate,
, barium salt
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10022-31-8]
పబ్ కెమ్ 24798
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య CQ9625000
SMILES [Ba+2].[O-][N+]([O-])=O.[O-][N+]([O-])=O
ధర్మములు
Ba(NO3)2
మోలార్ ద్రవ్యరాశి 261.337 g/mol
స్వరూపం white, lustrous crystals
వాసన odorless
సాంద్రత 3.24 g/cm3
ద్రవీభవన స్థానం 592 °C (1,098 °F; 865 K) (decomposes)
4.95 g/100 mL (0 °C)
10.5 g/100 mL (25 °C)
34.4 g/100 mL (100 °C)
ద్రావణీయత insoluble in alcohol
వక్రీభవన గుణకం (nD) 1.5659
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
cubic
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R20/22
S-పదబంధాలు (S2), S28
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
355 mg/kg (oral, rat)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.5 mg/m3[1]
REL (Recommended)
TWA 0.5 mg/m3[1]
IDLH (Immediate danger)
50 mg/m3[1]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బేరియం నైట్రేట్ ఒక రసాయన సమ్మేళనం. ఇది ఒక అకర్బన సంయోగ పదార్థం, బేరియం నైట్రేట్ అనునది బేరియం మూలకం యొక్క లవణం. బేరియం, నైట్రేట్ అయానుల సమ్మేళనం వలన బేరియం నైట్రేట్ ఏర్పడినది.

బేరియం నైట్రేట్ యొక్క భౌతికలక్షణాలు[మార్చు]

బేరియం నైట్రేట్ గది ఉష్ణోగ్రత వద్ద తెల్లని ఘన రూపంలో ఉండును. వాసన లేనటువంటి రసాయన సమ్మేళన పదార్థం. బేరియం నైట్రేట్ ఘనాకృతి అణుసౌష్టవం కలిగి ఉంది. మిగతా బేరియం సంయోగ పదార్థాలవలె ఇది నీటిలో కరుగును. నీటిలో కరిగే లక్షణం కలిగి ఉండటం వలన ఇది విషపూరితం. బేరియం నైట్రేట్ ఆల్కహాల్‌లో కరుగదు. బేరియం నైట్రేట్ యొక్క అణుభారం 261.337 గ్రాములు/మోల్. ఈ సమ్మేళన పదార్థం యొక్క సాంద్రత 3.24 గ్రాములు/సెం.మీ3. ద్రవీభవన స్థానం 592 °C (1,098 °F; 865K, ఈ ఉష్ణోగ్రత వద్ద బేరియం నైట్రేట్ వియోగం చెందును. బేరియం నైట్రేట్ యొక్క వక్రీభవనసూచిక 1.5659. బేరియం నైట్రేట్ ఒక ఆక్సీకరణి.

ఉత్పత్తి చెయ్యువిధానం[మార్చు]

బేరియం నైట్రేట్ ను రెండు రకాల ప్రక్రియలలో ఉత్పత్తి చెయ్యుదురు. ఒకవిధానంలో బేరియంకార్బొనేట్ యొక్క దళసరి ముక్కలను నైట్రిక్ ఆమ్లం/నత్రికామ్లంలో కరగించి ఉత్పత్తి చెయ్యుదురు. బేరియం కార్బొనేట్ లోని ఇనుముకు చెందిన మలినాలు అవక్షేపం పొందును. ఏర్పడిన బేరియం నైట్రేట్ ద్రావణాన్ని వడగట్టి (ఇనుము మలినాలను తొలగించుటకు) బాష్పీకరించి, స్పటికాలు ఏర్పరచెదరు. రెండవ విధానంలో వేడి చేసిన సోడియం నైట్రేట్ ద్రవంలో కలిపి మిశ్రమం చెయ్యుదురు. ఏర్పడిన బేరియం నైట్రేట్ స్పటికాలను మిశ్రమద్రావణం నుండి వేరు చెయ్యుదురు.

రసాయన చర్యలు[మార్చు]

బేరియం నైట్రేట్ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బేరియం ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఆక్సిజన్‌గా వియోగం చెందును.

2Ba(NO3)2 + heat → 2BaO + 4NO2 + O2

నైట్రిక్ ఆక్సైడ్‌తో, థెర్మల్ వియోగం వలన బేరియం నైట్రైట్ ఏర్పడును. ద్రావాలలో కరిగే లక్షణమున్న లోహ సల్ఫేట్‌లు, లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య వలన బేరియం సల్ఫేట్ లు ఉత్పత్తి అగును. కార్బొనేట్, ఆక్సాలేట్, లోహాల పాస్పేట్ వంటి కరుగని (insoluble) బేరియం లవణాలను ద్వంద వియోగం ద్వారా అవక్షేపించెదరు. బేరియం నైట్రేట్ ఒక ఆక్సీకరణి కావటం వలన, సాధారణ క్షయికరణ కారకాలతో తీవ్రంగా, చురుకుగా చర్య జరుపును.

బేరియం నైట్రేట్ యొక్క పొడిని, అల్యూమినియం, జింకు వంటి లోహాల మెత్తని చూర్ణంతో కలిపినను, లేదా అల్యూమినియం-మాగ్నీషియం మిశ్రమ ధాతు పొడితో మిశ్రమం చేసిన అంటుకొని, బలమైన విస్పొటన చెందును.

వినియోగం[మార్చు]

బరటోల్ (Baratol) అనునది బేరియం నైట్రేట్, TNT, బైండర్ మిశ్రమం చేసి తయారు చేసిన ప్రేలుడు పదార్థం. అల్యూమినియం పుడి/చూర్ణంతో బేరియం నైట్రేట్ కలుపబడిన మిశ్రమం అథిక ప్రేలుడు శక్తి కలిగి ఉంది.ఈ మిశ్రమాన్ని ఫ్లాష్ పౌడర్ అంటారు. థెర్మిట్ (thermit) లో బేరియం నైట్రేట్‌ను మిశ్రమం చేసి తయారు చేసిన థెర్మిట్-TH3ను, సైనిక థెర్మిట్ చేతి బాంబుల (thermite grenades) లో ఉపయోగించుతారు. బాణ సంచా తయారీలో కూడా టపాసులు, జువ్వలు, మతాబుల వంటి వాటిలో పచ్చమంట వచ్చుటకై ఉపయోగిస్తారు. బేరియం నైట్రేట్‌ను ఇంకా బేరియం ఆక్సైడ్‌ను ఉత్పత్తి చెయ్యుటకు ఉపయోగిస్తారు. వాక్యుం ట్యూబుల పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తారు.

బేరియం నైట్రేట్-ఆరోగ్య సమస్యలు[మార్చు]

ద్రావణీయత (solubility) కల్గిన అన్ని బేరియం సంమ్మేళనాల వలె బేరియం నైట్రేట్‌ను తినినను, లేదా శ్వాసించినను/ఊపిరి పీల్చినను ప్రమాదం. దీని విష ప్రభావం వలన కండారాలు బిగుసుకు పోవడం, (ప్రత్యేకంగా ముఖం, మెడ) వాంతులు, విరేచనాలు అవ్వడం, పొత్తికడుపులో నొప్పి, కండరాల తీవ్రత తక్కువగా ఉండుట, ఆతృత, బలహీన పడటం, శ్వాస కష్టంగా ఉండటం, హృదయ స్పందనలో హెచ్చు తక్కువలు, అసంకల్పితముగా /అప్రయత్నపూర్వకముగా కండరములు కొద్దికాలంసేపు ముడుచుకోవడం వంటి దుష్ఫలితాలు కలుగును.

హృదయ స్పందన, శ్వాస ఆగిపోవడం వలన మరణం సంభవించ వచ్చును. ఈ పరిణామాలన్నీ బేరియం నైట్రేట్ యొక్క ప్రభావానికి గురైన కొన్ని గంటల నుండి కొన్ని రోజులలో సంభవించ వచ్చును. బేరియం నైట్రేట్ ప్రభావం వలన మూత్రపిండాలు కూడా పాడై పోవును. బేరియం నైట్రేట్ ధూళిని శ్వాసించట వలన శ్వాసనాళలలో ఇరిటేసన్/చికాకు, నొప్పి కల్గును.

చర్మాన్ని, లేదా కళ్ళను తాకినప్పు, తినిన లేదా శ్వాసించిన దాని కన్నా తక్కువ హానికారి అయినప్పటికీ ఇరిటేసన్, దురద, ఎరుపెక్కడం, నొప్పి కలగడం వంటి లక్షణాలుంటాయి.

ప్రథమ చికిత్స[మార్చు]

బేరియం నైట్రేట్ వలన దుష్ప్రభావం గురైన వారికి విషహారి ( విష నివారిణి) గా ఎప్సం సాల్ట్ లేదా సోడియం సల్ఫేట్ వంటి సల్ఫేట్ లవణాల ద్రావణాలను ప్రథమ చికిత్సగా ఇవ్వవచ్చును. ఈ సల్ఫేట్‌ లవణాలు విషపూరితమైన నైట్రేట్‌ను ద్రావణియతరహిత (విషకారి కాని) బేరియం సల్ఫేట్‌లుగా అవక్షేపించును.

ఆక్యుపెసనల్ సేఫ్టి అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేసన్, నేషనల్ ఇన్స్తిటూట్ ఫర్ ఆక్యుపెసనల్ సేఫ్టి అండ్ హెల్త్ సంస్థలు నిర్దేశించిన రక్షిత ప్రభావ మితి (exposure limits) 0.5 మి.గ్రా/మీ3 /ఎనిమిది గంటల కాలవ్యవధిలో.

ఇవికూడా చూడండి[మార్చు]

బేరియం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0046". National Institute for Occupational Safety and Health (NIOSH).