బేరియం పెరాక్సైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేరియం పెరాక్సైడ్
పేర్లు
IUPAC నామము
barium peroxide
ఇతర పేర్లు
Barium binoxide,
Barium dioxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1304-29-6]
పబ్ కెమ్ 14773
యూరోపియన్ కమిషన్ సంఖ్య 215-128-4
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య CR0175000
SMILES [Ba+2].[O-][O-]
ధర్మములు
BaO2
మోలార్ ద్రవ్యరాశి 169.33 g/mol (anhydrous)
313.45 (octahydrate)
స్వరూపం Grey-white crystalline (anhydrous)
colorless solid (octahydrate)
వాసన odorless
సాంద్రత 5.68 g/cm3 (anhydrous) 2.292 g/cm3 (octahydrate)
ద్రవీభవన స్థానం 450 °C (842 °F; 723 K)
బాష్పీభవన స్థానం 800 °C (1,470 °F; 1,070 K) (decomposes to BaO & O2.[1])
anhydrous
0.091 g/100 mL (20 °C)
octahydrate
0.168 g/cm3
ద్రావణీయత dissolves with decomposition in acid
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Tetragonal [2]
D174h, I4/mmm, tI6
కోఆర్డినేషన్ జ్యామితి
6
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R8, మూస:R20/22
S-పదబంధాలు (S2), మూస:S13, మూస:S27
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

బేరియం పెరాక్సైడ్ ఒక రసాయన సంమ్మేళన పదార్థం. బేరియం, ఆక్సిజన్ మూలకాల పరమాణువు ల సమ్మేళనం వలన బేరియం పెరాక్సైడ్ ఏర్పడినది.ఇది ఒక ఆకర్బన సంయోగ పదార్థం. ఒక పరమాణువు బేరియంతో రెండు ఆక్సిజన్ పరమాణువులు సంయోగం వలన బేరియం పెరాక్సైడ్ అణువు ఏర్పడును.ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయన ఫార్ములా BaO2.శాస్త్రవేత్తలచే కనుగొనబడిన ఆకర్బన పెరాక్సైడులలో బేరియం పెరాక్సైడ్ మొదటిది.బేరియం పెరాక్సైడ్ ఒక ఆక్సీకరణి, మండించిన పచ్చని రంగుతో వెలుగులుప్రసరించును.అందుచేత ఈ సమ్మేళన పదార్థాన్ని బాణసంచా (fire works) తయారీలో ఉపయోగిస్తారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ తయారీలో బేరియం పెరాక్సైడ్ పుర్వగామి (precursor) గా పనిచేయును.

భౌతిక ధర్మాలు[మార్చు]

బేరియం పెరాక్సైడ్ ఘన స్థితిలో ఉండును. నిర్జల (anhydrous, జలయోజిత/నార్ధ్ర (hydrated) రూపాలలో లభ్యం.నిర్జల బేరియం పెరాక్సైడ్ బూడిద– తెలుపు రంగులో ఉండగా, నార్ధ్ర బేరియం పెరాక్సైడ్ (octahydrated,8 అణువులు, ఒక అణువు బేరియం పెరాక్సైడ్‌లో8 నీటి అణువుల బంధం) వర్ణ రహితంగా కన్పిస్తుంది.నిర్జల బేరియం పెరాక్సైడ్ యొక్క సాంద్రత 5.68 గ్రాములు/సెం/మీ3. ఆక్టాహైడ్రేట్ బేరియం పెరాక్సైడ్ సాంద్రత 2.292 గ్రాములు/సెం.మీ3. నిర్జల బేరియం పెరాక్సైడ్ యొక్క అణుభారం 169.33 గ్రాములు/మోల్ కాగా ఆక్టాహైడ్రేట్ బేరియం పెరాక్సైడ్ యొక్క అణుభారం 313.45 గ్రాములు/మోల్.బేరియం పెరాక్సైడ్ పదార్థం ద్రవీభవన స్థానం450°C (842 °F; 723K).నార్ధ్ర బేరియం పెరాక్సైడ్ 800 °C వద్ద BaO, O2గా వియోగం చెందును.

అణు నిర్మాణం[మార్చు]

బేరియం పెరాక్సైడ్ అణువులో ఒక పరమాణువు బేరియం, రెండు పరమాణువుల ఆక్సిజన్ ల సంయోగం చెందియుండును.ఘన బేరియం అణువుసౌష్టవం, కాల్షియం కార్బైడ్ అణుసౌష్టావానికి సమరూపము .చతుర్కోణ అణునిర్మాణం కలిగి ఉంది.

ఉత్పత్తి[మార్చు]

బేరియం ఆక్సైడ్ సమ్మేళనం, ఆక్సిజన్ (O2) తో ప్రతివర్తక్రియ (reversible reaction) వలన బేరియం పెరాక్సైడ్ ఉత్పత్తి అగును.ఈ పరివర్త చర్య 500°Cవద్ద జరగడం వలన బేరియం ఆక్సైడ్ ఏర్పడును.బేరియం పెరాక్సైడ్ 820°Cవద్ద పరివర్త చర్య జరపడం వలన ఆక్సిజన్ విడుదల అగును.

2 BaO + O2 ⇌ 2 BaO2

ఈ పరివర్తచర్య విధానం ఒకప్పటి, ఇప్పటిలో వాడుకలేని వాతావరణం నుండి ఆక్సిజన్‌ను వేరు చెయ్యు బ్రిన్ ప్రక్రియ ఆధారంగా ఈ పరివర్తచర్య విధానాన్ని కనుగొనడం జరిగింది. మిగతా ఆక్సైడులు Na2Oమరియు SrO లు ఇదే విధంగా ప్రవర్తించును.

ప్రస్తుతం వాడుకలో లేని మరొక ఉత్పత్తి విధానంళొ బేరియం పెరాక్సైడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపించి హైడ్రోజన్ పెరాక్సైడును ఉత్పత్తి చేసేవారు

BaO2 + H2SO4 → H2O2 + BaSO4

ఇలా ఏర్పడిన అద్రావణి (insoluble) బేరియం సల్ఫెట్‌ని మిశ్రమంనుండి వడకట్టి వేరు చేసే వారు.

ఉపయోగాలు[మార్చు]

  • ప్రయోగశాలలలో రసాయన పదార్థంగా, ఆక్సీకరణ కారకంగా ఉపయోగిస్తారు.
  • బాణసంచా తయారీలో ఆకుపచ్చ రంగు వెలుగు కైఉపయోగిస్తారు.
  • హైడ్రోజన్ పెరాక్సైడును ఉత్పత్తి చెయ్యుటకు ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి[మార్చు]

బేరియం

మూలాలు[మార్చు]

  1. Accommodation of Excess Oxygen in Group II Monoxides - S.C. Middleburgh, R.W. Grimes and K.P.D. Lagerlof Journal of the American Ceramic Society 2013, Volume 96, pages 308–311. doi:10.1111/j.1551-2916.2012.05452.x
  2. Massalimov, I. A.; Kireeva, M. S.; Sangalov, Yu. A. (2002). "Structure and Properties of Mechanically Activated Barium Peroxide". Inorganic Materials. 38 (4): 363–366. doi:10.1023/A:1015105922260.