బేరియం అక్సాలేట్
గుర్తింపు విషయాలు | |
---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [516-02-9] |
పబ్ కెమ్ | 68201 |
SMILES | [Ba+2].[O-]C(=O)C([O-])=O |
| |
ధర్మములు | |
BaC2O4 | |
మోలార్ ద్రవ్యరాశి | 225.346 g/mol |
సాంద్రత | 2.658 g/cm3 |
ద్రవీభవన స్థానం | 400 °C (752 °F; 673 K) (decomposes) |
0.9290 mg/L | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బేరియం అక్సాలేట్ఒక రసాయనిక సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన సంయోగ పదార్థం.ఈ సంయోగ పదార్థం అక్సాలిక్ ఆమ్లం యొక్క బేరియం లవణం. బేరియం అక్సాలేట్యొక్క రసాయనిక ఫార్ములా BaC2O4.
బేరియం అక్సాలేట్ యొక్క భౌతిక లక్షణాలు
[మార్చు]బేరియం అక్సాలేట్ తెల్లని రంగులేనటు వంటి ఘన పదార్థం. బేరియం అక్సాలేట్ యొక్క మోలార్ మాస్/అణుభారం 225.346 గ్రాములు/మోల్.ఈ సంయోగ పదార్థం యొక్క సాంద్రత2.658 గ్రాములు/సెం.మీ3. బేరియం అక్సాలేట్ యొక్క ద్రవీభవన స్థానం స్థానం400 °C (752 °F; 673K), కాని ఈ ఉష్ణోగ్రతవద్ద బేరియం అక్సాలేట్ వియోగం చెందును.నీటిలో కరుగదు. గరిష్ఠంగా 0.9290 మిల్లి గ్రాములు లీటరు నీటిలో కరుగును.
ఉత్పత్తి
[మార్చు]బేరియం అక్సాలేట్‌ను ఉత్పత్తి చెయ్యుటకు ముడి పదార్థాలు బేరియం అక్సాలేట్ లేదా ఆక్సాలిక్ ఆమ్లం, బేరియం హైడ్రాక్సైడ్ (అక్టాహైడ్రేట్) లు. బేరియం అక్సాలేట్‌ను మరో ప్రత్నామ్యాయపద్ధతిలో ఆక్సాలిక్ ఆమ్లం, బేరియం క్లోరేట్ ద్రావణాన్ని ద్రావణాన్నిఉపయోగించి కుడా ఉత్పత్తి చేయ్యుదురు.వీటి మధ్య చర్య దిగువన చూపిన విధంగా జరుగును.
- BaCl2 + H2C2O4 → BaC2O4↓ + 2 HCl
ఈ సమ్మేళనం నీటిలో కరుగదు.వేడి చేసి నప్పుడు బేరియం ఆక్సైడ్ గా పరివర్తన చెందును.
రసాయన చర్యలు
[మార్చు]బేరియం అక్సాలేట్ స్థిరమైన సమ్మేళనం, ఇది బలమైన ఆమ్లాలతో చర్య జరుపును.
ఉపయోగాలు
[మార్చు]బేరియం అక్సాలేట్ ను ఎక్కువగా బాణ సంచా (pyrotechnic) తయారీలో ఉపయోగిస్తారు. ఎక్కువగా మాగ్నీషియం కలిగిన బాణ సంచా వస్తువులలో ఉపయోగిస్తారు.
ఆరోగ్యపరమైన ఇబ్బందులు
[మార్చు]చర్మాన్ని సోకిన ఇరెటెసన్ కల్గిస్తుంది. అన్నాశయం/జీర్ణాశయంలోకి వెళ్ళినవాంతి వచ్చేటట్టు వుండడము జరుగును, మూత్రపిండాలు దెబ్బతినవచ్చును.అలాగే ప్రేగులకు హాని కల్గించును.