బేరియం అయోడైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేరియం అయోడైడ్[1]
పేర్లు
IUPAC నామము
Barium iodide
ఇతర పేర్లు
Barium iodide, anhydrous
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13718-50-8]
పబ్ కెమ్ 83684
యూరోపియన్ కమిషన్ సంఖ్య 237-276-9
SMILES [Ba+2].[I-].[I-]
ధర్మములు
BaI2 (anhydrous)
BaI2·2H2O (dihydrate)
మోలార్ ద్రవ్యరాశి 391.136 g/mol (anhydrous)
427.167 g/mol (dihydrate)
స్వరూపం White orthorhombic crystals (anhydrous) colorless crystals (dihydrate)
వాసన odorless
సాంద్రత 5.15 g/cm3 (anhydrous)
4.916 g/cm3 (dihydrate)
ద్రవీభవన స్థానం 711 °C (1,312 °F; 984 K) (anhydrous)
decomposes at 740 °C (dihydrate)
166.7 g/100 mL (0 °C)
221 g/100 mL (20 °C)
246.6 g/100 mL (70 °C)
ద్రావణీయత soluble in ethanol, acetone
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Orthorhombic, oP12, SpaceGroup = Pnma, No. 62
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-602.1 kJ·mol−1
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు toxic
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
beryllium iodide
magnesium iodide
calcium iodide
strontium iodide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బేరియం అయోడైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం.బేరియం అయోడైడ్ ఒక అకర్బన సంయోగ పదార్థం.బేరియం, అయోడిన్ మూలక పరమాణువుల సంయోగం వలన బేరియం అయోడైడ్ ఏర్పడినది.నిర్జల/అనార్ద్ర (anhydrous) బేరియం అయోడైడ్ యొక్క రసాయన ఫార్ములా BaI2.రెండు నీటి అణువులను (dihydrate) కలిగిన బేరియం అయోడైడ్ యొక్క రసాయన ఫార్ములా BaI2•2H2O.హైడ్రేటెడ్ బేరియం అయోడైడ్‌ను వేడి చేసిన నిర్జల (తడిలేని) బేరియం అయోడైడ్‌గామారును.

బేరియం అయోడైడ్ యొక్క భౌతిక ధర్మాలు

[మార్చు]

నిర్జల బేరియం అయోడైడ్ తెల్లగాను, సార్ద్ర/జలయోజిత బేరియం అయోడైడ్ (హైడ్రేట్) వర్ణరహితంగా ఉండును. నిర్జల బేరియం అయోడైడ్ వాసన లేని రసాయన సమ్మేళన పదార్థం.అనార్ద్ర/నిర్జల (తడిలేని) బేరియం అయోడైడ్ అణువు అర్థోరోంబిక్ అణుసౌష్టవాన్ని కలిగి ఉంది. అనార్ద్ర బేరియం అయోడైడ్ యొక్క అణుభారం 391.136 గ్రాములు /మోల్.సార్ద్ర/జలయోజిత బేరియం అయోడైడ్ (dihydrate) యొక్క అణుభారం 427.167 గ్రాములు/మోల్. నిర్జల బేరియం అయోడైడ్ యొక్క సాంద్రత5.15గ్రాములు/సెం.మీ3. డై హైడ్రేట్ (సార్ద్ర/జలయోజిత) బేరియం అయోడైడ్ యొక్క సాంద్రత సాంద్రత4.916 గ్రాములు/సెం.మీ3. అనార్ద్ర /నిర్జల బేరియం అయోడైడ్ యొక్క ద్రవీభవన స్థానం 711 °C (1,312 °F; 984K).డై హైడ్రేట్ బేరియం అయోడైడ్ 740°Cవద్ద వియోగం చెందును. బేరియం అయోడైడ్ నీటిలో కరుగుతుంది.ఇంకను ఇథనాల్, అసిటోన్ ద్రావణంలలో కరుగును.

అణు సౌష్టవం

[మార్చు]

అనార్ద్ర బేరియం అయోడైడ్ అణుసౌష్టవం లెడ్ (II) క్లోరైడ్ అణుసౌష్టవ పోలిక కలిగి, ప్రతి బేరియం అయాన్, తొమ్మిది అయోడైడ్ లిగండ్స్ (ligands) బంధం ఏర్పరచుకొని ఉండును. బేరియం అయోడైడ్‌ యొక్కస్పాటికా కృతి క్లోరైడ్ అణువు సమరూపము కలిగిఉండును.

రసాయన చర్యలు

[మార్చు]

బేరియం లోహాన్ని ఇథర్‌లో ఉంచిన/ఉన్న1,2-డై ఐడోఇథేన్ ( 1,2-diiodoethane) తో చర్య జరిపించి నిర్జల/అనార్ద్ర బేరియం అయోడైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు.బేరియం అయోడైడ్ సమ్మేళన పదార్థం అల్కైల్ పొటాషియం సంయోగ పదార్థాలతో చర్య వలన ఆర్గానో బేరియం సమ్మేళనాలు ఉత్పత్తిఅగును.

బేరియం అయోడైడ్‌ను లిథియంబై ఫినైల్ తో క్షయించిన, అత్యంత చురుకైన క్రియాశీలస్థితి బేరియం లోహం ఏర్పడును.

అపాయకారిగుణం- రక్షణ స్థితి

[మార్చు]

అన్ని ద్రావణీయ బేరియం లవణాలవలె బేరియం అయోడైడ్ కూడా విషాక్తము

ఇవికూడా చూడండి

[మార్చు]

బేరియం

మూలాలు

[మార్చు]
  1. Lide, David R. (1998), Handbook of Chemistry and Physics (87 ed.), Boca Raton, FL: CRC Press, pp. 4–44, ISBN 0-8493-0594-2