గండిపేట పార్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గండిపేట పార్కు
గండిపేట పార్కు
రకంపార్కు
స్థానంగండిపేట చెరువు
హైదరాబాదు, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాదు
విస్తీర్ణం5.50 ఎకరాలు
నవీకరణ2022
నిర్వహిస్తుందిజీహెచ్ఎంసీ
తెరుచు సమయంఉదయం 8
స్థితివాడుకలో ఉంది

గండిపేట పార్కు, (ఆంగ్లం: Gandipet Park) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గండిపేట చెరువు సమీపంలో ఉన్న పార్కు.[1] గండిపేట ప్రాంతంలోని జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం సుమారు 35 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో 5.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును నిర్మించింది.[2]

చరిత్ర

[మార్చు]

నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిపేట చెరువును 1920లో నిర్మించగా, దానికి గుర్తుగా హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ ల్యాండ్‌స్కేప్ బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి, ఈ పార్కును అభివృద్ధి చేసింది.[3] రిజర్వాయర్ మెయిన్ గేట్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ గార్డెన్‌ను 2020లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ నుంచి హెచ్‌ఎండీఏ స్వాధీనం చేసుకుంది. హుస్సేన్‌సాగర్ మాదిరిగానే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను హెచ్ఎండీఏ తీసుకుని పనులను చేపడుతోంది.

ప్రారంభం

[మార్చు]

గండిపేట తీరంలో అత్యాధునిక డిజైన్లతో నిర్మించిన ఈ పార్కును 2022 అక్టోబరు 11న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సదుపాయాలు

[మార్చు]

12 స్వాగత తోరణాలతో స్వాగత ద్వారం అత్యంత భారీ ఆకృతిలో నిర్మించబడింది. మధ్యలో నాలుగు మీటర్ల వ్యాసం కలిగిన గ్లోబ్‌తో ఉన్న సెంట్రల్‌ పెవిలియన్‌, టికెటింగ్‌ కౌంటర్‌లు, సెమీ వృత్తాకార ఆకారంలో నాలుగు మార్గాల స్తంభాలతో ఉన్న ఒక గది, ఎంట్రెన్స్‌ ప్లాజా, వాక్‌వేస్‌, ఆర్ట్‌ పెవిలియన్‌, ప్లవర్‌ టెర్రస్‌, పిక్‌నిక్‌ స్పేసెస్‌, 1,200 సీటింగ్ కెపాసిటీతో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, ఇన్నర్‌ యాక్సెస్‌ రోడ్డు, కిడ్స్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటుచేయబడ్డాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-10-11). "గండిపేట పార్కును ప్రారంభించ‌నున్న మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
  2. Today, Telangana (2022-09-03). "Gandipet park ready for inauguration". Telangana Today. Archived from the original on 2022-09-03. Retrieved 2022-10-03.
  3. "Gandipet park ready for launch". The Hindu. Special Correspondent. 2022-09-03. ISSN 0971-751X. Archived from the original on 2022-09-03. Retrieved 2022-10-04.{{cite news}}: CS1 maint: others (link)
  4. telugu, NT News (2022-07-14). "గండిపేట తీరం.. ఇక పర్యాటక కేంద్రం". Namasthe Telangana. Archived from the original on 2022-07-14. Retrieved 2022-10-03.

బయటి లింకులు

[మార్చు]