Jump to content

గండ్లూరు వీరశివారెడ్డి

వికీపీడియా నుండి
గండ్లూరు వీరశివారెడ్డి
గండ్లూరు వీరశివారెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2014
ముందు ఎం.వి.మైసూరా రెడ్డి
తరువాత పి. రవీంద్రనాథ్ రెడ్డి
నియోజకవర్గం కమలాపురం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 – 1999
ముందు ఎం.వి.మైసూరా రెడ్డి
తరువాత ఎం.వి.మైసూరా రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1953
వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

గండ్లూరు వీరశివారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు కమలాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కమలాపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.వి.మైసూరా రెడ్డిపై 46414 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.వి.మైసూరా రెడ్డి చేతిలో 10531 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

వీరశివారెడ్డి 2004 ఎన్నికల్లో కమలాపురం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుత్తా నరసింహ రెడ్డిపై 11288 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పుత్తా నరసింహ రెడ్డిపై 4163 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

వీరశివారెడ్డి 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరాడు.[2][3] ఆయన ఆ తరువాత 2019లో టీడీపీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఆయన టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గండ్లూరు వీరశివారెడ్డి 2024 శాసనసభ ఎన్నికలకు ముందు జనవరి 27 జనవరి 2024న వైయ‌స్ఆర్‌సీపీని వీడి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి కమలాపురం టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో ఆయన 2024 ఏప్రిల్ 25న పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (27 January 2024). "తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, కొలికపూడి". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
  2. The Hindu (20 March 2014). "Congress MLA Veera Siva Reddy to join TDP" (in Indian English). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  3. The New Indian Express (27 March 2014). "Exodus from Congress Continues, Four More Leaders Join TDP" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  4. Prajasakti (25 April 2024). "వైసిపిలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.