Jump to content

గజేంద్ర సింగ్ రాజుఖేడి

వికీపీడియా నుండి
గజేంద్ర సింగ్ రాజుఖేడి

పదవీ కాలం
2009 – 2014
ముందు ఛతర్ సింగ్ దర్బార్
తరువాత సావిత్రి ఠాకుర్
నియోజకవర్గం ధార్
పదవీ కాలం
1998 – 2004
ముందు ఛతర్ సింగ్ దర్బార్
తరువాత ఛతర్ సింగ్ దర్బార్
నియోజకవర్గం ధార్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-12-11) 1964 డిసెంబరు 11 (వయసు 60)
రాజుఖేడి, ధార్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2024- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2024 వరకు)
జీవిత భాగస్వామి
గాయత్రీ సింగ్
(m. 1990)
సంతానం 2 కుమార్తెలు, 2 కుమారులు
నివాసం మనవర్ ధార్ జిల్లా, మధ్యప్రదేశ్
పూర్వ విద్యార్థి దేవి అహల్య విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు, న్యాయవాది
మూలం [1]

గజేంద్ర సింగ్ రాజుఖేడి (11 డిసెంబర్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధార్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

గజేంద్ర సింగ్ రాజుఖేడి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధార్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై రక్షణ కమిటీ, దాని సబ్-కమిటీ-II సభ్యుడిగా, గ్రామీణ ప్రాంతాలు & ఉపాధి మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

గజేంద్ర పటేల్ 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధార్ నియోజకవర్గం నుండి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1999 నుండి 2000 వరకు రక్షణ కమిటీ సభ్యుడిగా, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, 2006 నుండి 2007 వరకు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధార్ నియోజకవర్గం నుండి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడిగా, జలవనరుల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా, సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం & అడవులపై కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

గజేంద్ర పటేల్ 2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని వీడి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో భోపాల్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (9 March 2024). "Blow to Congress as former Union minister Suresh Pachouri, ex-MP Rajukhedi among leaders who join BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.
  2. 10TV Telugu (9 March 2024). "కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు.. కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై" (in Telugu). Retrieved 14 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. EENADU (9 March 2024). "కాంగ్రెస్‌కు మరో షాక్‌.. భాజపాలో చేరిన కేంద్ర మాజీ మంత్రి". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.