జి. వివేకానంద్
జి. వివేకానంద్ | |||
![]()
| |||
లోకసభ సభ్యులు
| |||
పదవీ కాలము 2009 నుండి 2014 | |||
ముందు | జి. వెంకటస్వామి | ||
---|---|---|---|
తరువాత | బాల్క సుమన్ | ||
నియోజకవర్గము | పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం | ||
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | సరోజ | ||
సంతానము | వ్రితిక, వంశీ, వైష్ణవి, వెంకట్ | ||
నివాసము | హైదరాబాద్ | ||
వెబ్‌సైటు | జి. వివేకానంద్ అధికారిక జాలగూడు |
జి. వివేకానంద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, 15వ పార్లమెంటు సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు.[1] 2014 ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు.[2]
జననం[మార్చు]
ఈయన 1957, నవంబరు 30న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, పార్లమెంట్ జి.వెంకటస్వామి, కళావతి దంపతులకు కరీంనగర్లో జన్మించాడు.
విద్యాభ్యాసం[మార్చు]
బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను చదివాడు. ఉస్మానియా వైద్య కళాశాల నుండి వైద్య విద్యను పూర్తిచేశాడు.
రాజకీయ ప్రస్థానం[మార్చు]
2009లో రాజకీయరంగ ప్రవేశంచేసి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందాడు. బొగ్గు, ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. విశాఖ పరిశ్రమలకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
నిర్వహించిన పదవులు[మార్చు]
- 15వ లోకసభ పార్లమెంట్ సభ్యుడు
- బొగ్గు, ఉక్కు కమిటీల సభ్యుడు
- భారతీయ పరిశ్రమ యొక్క సమాఖ్య (సిఐఐ), ఆంధ్రప్రదేశ్ చాప్టర్, (2006-2007) ల అధ్యక్షుడు
- తయారీదారుల సంఘం అధ్యక్షుడు
- విశాఖ పరిశ్రమ సంస్థల ప్రచార ఉపాధ్యక్షుడు
మూలాలు[మార్చు]
- ↑ Congress MPs fight over Group-I exams. deccanchronicle.com. 7 September 2010
- ↑ వి6 న్యూస్. "వివేకానంద్ కు ఘన సన్మానం". Archived from the original on 21 జనవరి 2017. Retrieved 18 March 2017. Check date values in:
|archive-date=
(help)