గాలి (పవనం)
(గాలి నుండి దారిమార్పు చెందింది)
పవనం అనగా వాయువుల ప్రవాహం. భూమిపై పవనం అనేది ఎక్కువగా గాలి యొక్క కదలిక. అంతరిక్షంలో సౌర పవనం అనేది స్పేస్ ద్వారా సూర్యుని నుండి వాయువుల లేదా కణాల యొక్క కదలిక. బలమైన పవనాలు మన సౌర వ్యవస్థలో నెప్ట్యూన్, శని గ్రహాలపై చూడవచ్చు. వేగవంతమైన పవనాల యొక్క చిన్న బరస్టులను గస్ట్స్ అంటారు. ఒక నిమిషం పాటు కొనసాగే బలమైన పవనాలను స్క్వాల్స్ (ప్రచండ గాలులు) అంటారు. ఎక్కువ సమయం పాటు కొనసాగే పవనాల వంటి బ్రిజీ (చల్లగాలి), గలే, హరికేన్, తుఫాను అని పిలవబడేటటు వంటి అనేకరకములున్నవి. పవనం భూమిని తరలించగలుగుతుంది, ముఖ్యంగా ఎడారులలో ఇది జరుగుతుంది. చల్లని పవనాలు కొన్నిసార్లు పశుగణాలలో చెడ్డ ప్రభావాన్ని చూపుతుంటాయి. పవనాలు జంతువుల యొక్క ఆహార నిల్వలపై, రక్షణ మార్గాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.
భాషా విశేషాలు
[మార్చు]పవనము [ pavanamu ] pavanamu. సంస్కృతం n. Air, Wind గాలి లేదా వాయువు.[1]
- పవనతనయుడు pavana-tanayuḍu. n. The son of the air, i.e., Hanuman (హనుమంతుడు.), Bhīma (భీముడు), or Agni (అగ్ని).
- పవనాశనము pavan-āṣanamu. n. A creature that lives on air, i.e., a serpent. పాము.
- పవనుడు or పవమానుడు pavanuḍu. n. The god of the air. Wind. the god of wind వాయుదేవుడు.
- పవన విద్యుత్తు అనగా గాలిని ప్రత్యేక యంత్రాలను ఉపయోగించి విద్యుచ్ఛక్తిగా మార్చడం.
- పవనముక్తాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. ఉదరంలో ఉండే ఆపాన వాయువు ఈ ఆసనం వేయడం ద్వారా బయటకు వెళుతుంది.