పవనముక్తాసనం
పవనముక్తాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. ఉదరంలో ఉండే ఆపాన వాయువు ఈ ఆసనం వేయడం ద్వారా బయటకు వెళుతుంది. అందుకనే ఈ ఆసనానికి పవన ముక్తాసనం అనే పేరు వచ్చింది. పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రమం. ఇందులో పవన అంటే వాయు లేదా గాలి. ముక్త అంటే విడుదల లేదా విసర్జన. ఆసనం అంటే యోగాలో శరీర స్థితి. ఈ మూడు పదాల కలయికనే పవనముక్తాసనం అంటారు.
నేలపై వెల్లకిలా పడుకోవాలి. మీ భుజాలు నేలపై విస్తారం పరచాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. కాళ్ళను మెల్లగా వెనక్కు మడవాలి. పాదాలు నేలను తాకేటట్టు ఉండాలి. తరువాత మెల్లగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోవాలి. ఈ స్థితి నుంచి ఆసనం కింది చర్యలు చేయాలి.
కాళ్ళను పాదాలకు వ్యతిరేక దిశలో మడవాలి. మోకాళ్ళను ఛాతీభాగం వైపు తీసుకురావాలి. అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి. భుజాలు, తల భాగాన్ని నేలకు వ్యతిరేకంగా పైకి తీసుకురావాలి. మళ్ళీ ఒక్క మారు అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి. తుంటి, పిరుదలను మెల్లగా పైకి లేవనెత్తాలి. మోకాళ్ళను ఛాతీకి మరింత దగ్గరగా తీసుకురావాలి. మోకాళ్ళు, పాదాలు సమేతంగా ఉండాలి. అయితే తల కిందకు దించరాదు.
మడిచి ఉన్న మోకాళ్ళు, భుజాలను ఆలింగనం చేసుకునేలా ఉంచాలి. మోకాళ్ళను ఛాతీభాగాన్ని హత్తుకునేలా చేయాలి. ఈ స్థితిలో ఊపిరి బిగబట్టి 5 సెకనుల పాటు ఉండాలి. గాలి వదులుతూ మెల్లగా ఆసనం నుంచి అదే క్రమపద్దతిలో బయటకు రావాలి. భుజాలు, తల, కాళ్ళను నేలను తాకించి ఉపశమనం పొందాలి. ఇలా పలుమార్లు చేయాలి.
లాభాలు
[మార్చు]వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఆసనం వేయవచ్చు. కడుపు ఉబ్బరంగా ఉండేవారికి ఈ ఆసనం ద్వారా విముక్తి లభిస్తుంది. ఉదరంలో నిర్బంధంగా ఉన్న అదనపు గాలి తక్షణం వెలుపలికి వస్తుంది. ఉదరకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం ద్వారా ఉదరము, పేగులలోని అదనపు గాలి బయటకు వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యతో బాధపడుతున్నవారికి ఈ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ NIFT, వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC. "Pavanamuktasnam | పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి". telugu.webdunia.com. Retrieved 2020-04-11.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
బాహ్య లంకెలు
[మార్చు]- "Yoga Video : పవనముక్తాసనం ఎలా చెయ్యాలి ? దాని ఉపయోగాలు ఏంటి?". News18 Telugu. 2019-06-21. Retrieved 2020-04-11.[permanent dead link]