త్రికోణాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రికోణాసనం

త్రికోణాసనం (సంస్కృతం: त्रिकोणसन) యోగాలో ఒక విధమైన ఆసనము.

పద్ధతి

[మార్చు]

చక్కగా నిలబడి సమస్థితిలో ఉంటూ శ్వాస పీలుస్తూ వదలాలి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. రెండు కాళ్ళు వీలైనంత దూరంగా జరపాలి. నిదానంగా రెండు చేతులను కూడా భూమికి సమాంతరంగా పైకి లేపి ఉంచాలి. మోచేతులను వంచ కూడదు. అరచేతులను నేలవైపు ఉండే విధంగా చూడాలి. తర్వాత నిదానంగా గాలిని వదులుతూ కుడి చేతితో కుడి పాదాన్ని తాకే విధంగా మెల్లగా శరీరాన్ని వంచాలి.ఇదే సమయంలో ఎడమ అరచెయ్యిని పైకెత్తి నిటారుగా ఉంచాలి. శిరస్సు ఎడమ అరచేతి వైపు చూస్తూ ఉండాలి. తర్వాత శ్వాస పీలుస్తూ పైకి రావాలి. కుడి చేతివైపు ఏ విధంగా శరీరాన్ని వంచామో అదే విధంగా ఎడమ చేతి వైపు కూడా శరీరాన్ని వంచాలి.

ప్రయోజనం

[మార్చు]

త్రికోణాసనం వలన కాలికండరాలకు మంచి బలం చేకూరుతుంది. ఇందులోనున్న వికృతులు దూరమవుతాయి. రెండుకాళ్ళు సమాంతరంగా వికసిస్తాయంటున్నారు యోగా నిపుణులు. దీంతో చీలమండలలో శక్తి పుంజుకుంటుంది. వెన్నునొప్పి దూరమై, మెడ సునాయాసంగా తిరుగుతుందంటున్నారు యోగా గురువులు. ఉదరం బలంగా అయ్యి జీర్ణవ్యవస్ధ సక్రమంగా పనిచేస్తుంది.