వృక్షాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వృక్షాసనం.

వృక్షాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. వృక్షం, ఆసనం అనే రెండు పదాల కలయిక వల్ల వృక్షాసనంగా ప్రసిద్ధి. ఈ పదం కూడా సంసృతం నుంచి తీసుకొనబడింది. ప్రాథమికంగా, ఒక వృక్షం ఆకారంలో నించోవడమే.[1]

పద్ధతి[మార్చు]

  1. వృక్షాసనం చేసేటప్పుడు సమస్థితిలో నిలబడి, ఎడమ కాలును మోకాలు వద్ద వంచి, ఎడమ మడిమను మూలస్థానం వద్ద ఉంచుతూ, పాదాన్ని కుడి తొడకు అదిమి పట్టి ఉంచాలి. పాదము భూమికి లంబంగా, వ్రేళ్ళు నేలపైవైపు ఉండాలి, చేతులు నడుముపైన ఉంచాలి.
  2. గాలి పీలుస్తూ కుడికాలిని సమంగా నిలిపి రెండు చేతులు ప్రక్కలకు లాగుతూ భూమికి సమాంతరంగా అర చేతులు నేల వైపు చూపాలి.
  3. గాలి పీలుస్తూ రెండు చేతులూ తలపైకి తీసుకెళ్ళి అరచేతులను కలిపి శరీరం మొత్తాన్ని పైకి లాగాలి.
  • గాలి వదులుతూ 2 రెండొవ స్థితిలోకి రావాలి.
  • అలాగే మళ్ళీ గాలి వదులుతూ 1 మొదటి స్థితిలోకి రావాలి. తర్వాత సమస్థితిలోకి రావాలి.

లాభాలు[మార్చు]

కాలి కండరాలకు అధిక వ్యాయామం కల్గుతుంది. ఇలా చేసిన వ్యక్తికి తన శరీరం యొక్క సంతులున జ్ఞానం కల్గుతుందంటున్నారు యోగా నిపుణులు. వ్యక్తికి చైతన్యం ప్రకాశింపబడుతుంది. కాళ్ళు, చేతులు, వెనుకభాగం విస్తరించబడతాయి. ఏకాగ్రత మెరుగవుతుంది. సయాటికా నరాల సమస్య నయమవుతుంది నిలకడగా ఉండటం మెరుగవుతుంది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Staff (2016-06-18). "లోబ్లడ్ ప్రెజర్ నియంత్రించే వృక్షాసనం (ట్రీ పోస్)". https://telugu.boldsky.com. Retrieved 2021-04-05. {{cite web}}: External link in |website= (help)