శవాసనము
Appearance
శవాసనము (సంస్కృతం: शवसन) యోగాలో ఒక విధమైన ఆసనము. శరీరంలో ఎటువంటి కదలికలు లేకుండా శవాన్ని పోలి ఉండటం వల్ల ఈ ఆసనానికి శవాసనమని పేరువచ్చింది. దీనిని 'శాంతి ఆసనం', 'అమృతాసనం' అని కూడా అంటారు. దీనివల్ల శరీరంలో అలసట తగ్గిపోయి అన్ని అవయవాలు విశ్రాంతిని పొందుతాయి.
పద్ధతి
[మార్చు]- వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు విడివిడిగా దూరంగా ఉంచాలి.
- అరచేతులు పైకి ఉండాలి.
- శరీరంలోని ఇతర భాగాలను వదులుగా ఉంచాలి.
- శ్వాసను మెల్లగ పీల్చి వదలాలి. మెల్లగా పీల్చి, దానికి రెట్టింపు సమయం వదలటానికి తీసుకోవాలి. శ్వాస పీల్చినప్పుడు పొట్టను కూడా నింపి, వదలినప్పుడు పొట్టను, ఊపిరితిత్తులను ఖాళీచేయాలి. శ్వాసలో ఎటువంటి శబ్దం రాకూడదు.
- శ్వాసగతిపైననే మనస్సును కేంద్రీకరించాలి.
ఉపయోగాలు
[మార్చు]శరీరము యెక్క వునికిని కొంత సేపు మరచి వుండ వలయును. అందు వలన మనస్సు శరీరము పూర్తిగా విశ్రాంతి పొంది తిరిగి ఎక్కువ శక్తి వంత మగును. ఇందు సాధకుడు మృతుని వలె చైతన్యమును వీడి యుండుట చేత మృతాసనమని, శవాసనమని అనిరి.[1]
మూలాలు
[మార్చు]- ↑ "పుట:Yogasanamulu.djvu/146 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-25.
ఇతర పఠనాలు
[మార్చు]- Iyengar, B. K. S. (1 October 2005). Illustrated Light On Yoga. HarperCollins. ISBN 978-81-7223-606-9.
- Saraswati, Swami Janakananda (1 February 1992). Yoga, Tantra and Meditation in Daily Life. Weiser Books. ISBN 978-0-87728-768-1.
- Saraswati, Swami Satyananda (1 August 2003). Asana Pranayama Mudra Bandha. Nesma Books India. ISBN 978-81-86336-14-4.
- Saraswati, Swami Satyananda (January 2004). A Systematic Course in the Ancient Tantric Techniques of Yoga and Kriya. Nesma Books India. ISBN 978-81-85787-08-4.
- Swanson, Ann (2019). Science of Yoga : understand the anatomy and physiology to perfect your practice. DK Publishing. ISBN 978-1-4654-7935-8.