మకరాసనం

మకరాసనం, ఒక విధమైన యోగాసనం. ఈ ఆసనంలో శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమని పేరువచ్చింది. యోగాసనాలు వేస్తూ, మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు, పొట్ట కండరాలకు, మిగతా అవయవాలకు విశ్రాంతిని కలుగజేసి నిద్రలేమి, రక్తపోటు వంటి వ్యాధులబారినుండి విముక్తి కలిగిస్తుంది.
బి. కె. ఎస్. అయ్యంగార్ రాసిన లైట్ ఆన్ యోగా అనే గ్రంథం ప్రకారం ఘేరండ సంహితలో ఈ ఆసనం శరీర వేడిని పెంచుతుందని పేర్కొన్నారు. అయ్యంగారు దీనిని శలభాసనానికి ఒకానొక రూపంగా చెప్పాడు.[1]
శబ్దవ్యుత్పత్తి
[మార్చు]ఈ పేరు సంస్కృతంలోని మకర అంటే "మొసలి" లేదా "రాక్షసుడు" నుండి ఈ "భంగిమ" లేదా "ఆసనం" వచ్చిందని పురాణకథనం.[2][3] మకరాసనం 17వ శతాబ్దపు ఘేరండ సంహిత (అధ్యాయం 2, శ్లోకం 40)లో వర్ణించబడింది. దీనిని 1905 యోగసోపాన పూర్వచతుష్కలో వివరిస్తూ, ఈ ఆసనం బొమ్మను హాఫ్‌టోన్‌లో ముద్రించారు.[4][2][3]
వివరణ
[మార్చు]బి. కె. ఎస్. అయ్యంగార్ రాసిన లైట్ ఆన్ యోగా అనే గ్రంథం ప్రకారం ఘేరండ సంహితలో ఈ భంగిమను రెండు కాళ్ళు “చాచి” పడుకుని ఉన్నట్లు, తల చేతుల్లో ఇరికించి ఉంటుందని వర్ణించాడు. ఈ భంగిమ “శరీర వేడిని పెంచుతుందని” తెలిపాడు. అయ్యంగారు దీనిని శలభాసనానికి ఒకానొక రూపమని చెప్పాడు.[1] ఈ ఆసనం మిడుత రూపంలో ఉంటుందని చెబుతూ, తల, కాళ్ళు శక్తివంతంగా పైకి లేపి, వేళ్లను తల వెనుక భాగాన ఒకదానికొకటి ముడివేసి, మోచేతులు నేల నుండి పైకి లేపి ఉన్నట్లుగా ఉంటుందని వివరించాడు.[1]
అయితే, మకరసనాన్ని తరచుగా విశ్రాంతి అవసరం కోసం ఆసనంగా ఉపయోగిస్తారు. ఇది వెల్లకిలా పడుకుని ఉండే శవాసనానికి ప్రత్యామ్నాయం. తల, కాళ్ళు రెండూ నేలపైనే ఉంటాయి. అంతర్జాతీయ యోగా సంస్థ దీని పద్దతిలో ఛాతీని "కొంచెం పైకి లేపి", "డయాఫ్రాగ్మాటిక్ శ్వాసతో పనిచేయడానికి ఉత్తమమైన భంగిమలలో ఒకటి"గా వర్ణిస్తుంది.[5]
.పద్ధతి
[మార్చు]- కాళ్ళు చాపి, బోర్లా పడుకొని చేతులపై చెంప ఆనించాలి.
- కాలి మడమలు లోపలివైపు, వేళ్ళు బయటివైపు ఉంచాలి.
- శ్వాస, ప్రశ్వాసలు మెల్లగా తీసుకోవాలి.
గ్యాలరీ
[మార్చు]-
నది దేవత గంగ వాహనంగా మకర
-
యోగాసోపానంలో మకరాసనం, 1905
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Iyengar 1979, pp. 100–101.
- ↑ 2.0 2.1 Sinha, S. C. (1996). Dictionary of Philosophy. Anmol Publications. p. 18. ISBN 978-81-7041-293-9.
- ↑ 3.0 3.1 Venkatkrishnan, Sri (1 January 2008). Yoga For Stress Management. Peacock Books. pp. 99–. ISBN 978-81-248-0183-3.
- ↑ Ghamande, Narayana (1905). Yogasopana Purvacatuska (1st ed.). Bombay: Janardan Mahadev Gurjar, Niranayasagar Press. p. 75.
- ↑ Anderson, Sandra. "Makarasana: The Crocodile Pose". Yoga International. Retrieved 18 December 2018.