ఉష్ట్రాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉష్ట్రాసనం.

ఉష్ట్రాసనం (సంస్కృతం: उष्ट्रसन ) యోగాలో ఒక విధమైన ఆసనము. సంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ (ధనురాసన) కు ఊర్ధ్వ శర భంగిమ (ఊర్ధ్వ ధనురాసన) కు మధ్యస్థంగా ఉంటుంది.

పద్ధతి

[మార్చు]
  • మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో వాటిని ఉంచాలి.
  • కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చొవాలి.
  • నడుము కింది భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచాలి.
  • శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి.
  • మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి.
  • మడమలను గట్టిగా పట్టుకుని నడుము, తొడలను వెనక్కు వంచాలి.
  • తలను, మెడను వీలైనంతగా వెనక్కు వంచాలి.
  • కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి.
  • శ్వాసను మామూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6-8 సెకన్ల వరకు అలాగే ఉండిపోవాలి.
  • తర్వాత ఈ స్థితినుంచి బయటకు వచ్చి మామూలుగా నీలింగ్ పొజిషన్‌కి వెళ్లాలి.
  • ఇలా చేస్తున్నప్పుడు ముందుగా చేతులను సడలించి నీలింగ్ పొజిషన్లో శరీరాన్ని గట్టిగా ఉంచాలి.

లాభములు

[మార్చు]
  • వెన్నుముకను సడలపరచును.
  • మెదడుకు రక్త ప్రసరణను వృద్ధి చేయును.
  • వీపుకు సంబంధించిన వ్యాధులను నయము చేయును.
  • మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు, కటి, పొత్తి కడుపులను దృఢంగా ఉంచడానికి ఈ భంగిమ చాలా మంచింది. ఇది మెడ, పొత్తికడుపు అంగాలను నియంత్రిస్తుంది. ఈ భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి, శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నిరోధించి, నివారిస్తుంది.[1]
  • ఈ భంగిమను క్రమం తప్పకుండా చేస్తే ఫాటిగ్యూ, రుతుసంబంధ అసౌకర్యాన్ని, ఆత్రుతను నివారిస్తుంది

మూలాలు

[మార్చు]
  1. NIFT, వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC. "Ustrasana | Yoga | Asanas | ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం (ఒంటె భంగిమ)". telugu.webdunia.com. Retrieved 2020-04-21.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)