ధనురాసనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనురాసనం.

ధనురాసనము (సంస్కృతం: धनुरसन) యోగాలో ఒక విధమైన ఆసనము. ఈ ఆసనం ధనుస్సు లేదా విల్లును పోలి ఉండటం వల్ల దీనిని ధనురాసనమని పేరువచ్చింది. ఇది భుజంగాసనం, శలభాసనం అను రెండాసనాల సమన్వయం.

పద్ధతి

[మార్చు]

ధనుస్ అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి. ఇది చేయాలంటే ముందుగా చదునైన ప్రదేశంలో చాప కాని అలాంటి వేరేదైనా కానీ నేలపై పరచి దానిపై మెత్తటి దుప్పటి లాంటిది వేసి ఆసనాన్ని చేయాలి.

 • పద్ధతి 1 :
 • గడ్డం నేలపై ఆనించి భుజాలను ఆనుకుని ఉండేలా చూసి పాదాలను కొంచం ఎడంగా ఉంచాలి.
 • కండరాలను వదులుగా ఉండేలా చూసుకోవాలి.
 • గాలి సాధారణంగా పీల్చుకోవాలి .
 • కాళ్ళను మెల్లిగా వెనుకకు వంచాలి.
 • చేతులతో చీలమండలాలను గట్టిగా పట్టుకోవాలి.
 • తల, మెడను మెల్లగా వెనుకకు వంచాలి.
 • దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి.పది సెకనులు పీల్చుకోవాలి.
 • కనీసం 3 సెకనులు తరువాత గాలి మెల్లగా వదలాలి.
 • 15 సెకనులు పూర్తిగా గాలి వదలాలి.
 • కాళ్ళు మెల్లగా వెనుకకు వదలాలి.
 • క్రమంమంగా మోకాళ్ళు, బొటన వ్రేళ్ళు దగ్గరకు చేర్చాలి.
 • పద్ధతి 2:
 • బోర్లా పడుకొని రెండు కాళ్ళను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి.
 • కొద్దిగా శ్వాస పీల్చి తలను, కాళ్ళను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేలమీద ఉంటుంది.
 • తరువాత కొద్ది సేపు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

ఉపయోగాలు

[మార్చు]

సూచన

[మార్చు]

ధనురాసనం సమర్ధవంతంగా వేయాలంటే భుజంగాసనాన్ని, శలభాసనాన్ని మొదట చక్కగా అభ్యాసం చేయాలి.