మకరాసనము

వికీపీడియా నుండి
(మకరాసనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Makarāsana, Crocodile posture, used for relaxation

మకరాసనము (సంస్కృతం: मकरसन) యోగాలో ఒక విధమైన ఆసనం. ఈ ఆసనంలో శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమని పేరువచ్చింది. బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు, పొట్ట కండరాలకు, మిగతా అవయవాలకు విశ్రాంతిని కలుగజేసి నిద్రలేమి, రక్తపోటు వంటి వ్యాధులనుండి విముక్తి కలిగిస్తుంది.

పద్ధతి[మార్చు]

  • కాళ్ళు చాపి, బోర్లా పడుకొని చేతులపై చెంప ఆనించాలి.
  • కాలి మడమలు లోపలివైపు, వేళ్ళు బయటివైపు ఉంచాలి.
  • శ్వాస, ప్రశ్వాసలు మెల్లగా తీసుకోవాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=మకరాసనము&oldid=3687837" నుండి వెలికితీశారు