తాడాసనం
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |

తాడాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగప్రక్రియలో వేసే భంగిమనే సమస్థితి ఆసనమని కూడా అంటారు. సమ అంటే కదలని సమతత్వం, స్థితి అంటే నిలబడుట అని అర్థం. కదలకుండా సమస్థతిలో నిలబడి చేసేదే సమస్థితి ఆసనం లేదా తాడాసనం అవుతుంది.
ఆసనం వేయు పద్దతి
[మార్చు]- చదునైననేలపై పాదాలలోని మడమల నుంచి బొటన వేలు దాకా ఒకదానికొకటి తాకిస్తూ నిలబడాలి. నిటారుగా ఉండాలి. అదే సమయంలో భుజాలను ముందుకు చాచాలి. అరచేతులు రెండు లోపలివైపుకు అభిముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
- మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. స్థిర విన్యాసస స్థితిలో ఉండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదేసమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి.
- ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్ళపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అలాగే ఉన్న తరువాత మెల్లగా గాలి వదులుతూ పూర్వ స్థితికి రావాలి. తరువాత కాళ్ళను దూరం చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు
[మార్చు]ఈ ఆసనం నాడీమండలాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాలి మడమలు, పిక్కలు బాగా దృఢంగా అవుతాయి.